Parakramam Movie Pre-Teaser Launch: బండి సరోజ్ కుమార్ నూతన చిత్రం ‘పరాక్రమం’ ప్రీ టీజర్ విడుదల!

Bandi Sanjay Kumar పరాక్రమం మూవీ టిజర్ e1692609224988

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకం పై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించబోతున చిత్రం “పరాక్రమం”. ప్రస్తుతానికి ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ లో ముప్పై రోజులో షూటింగ్ పూర్తి చేసి ఫిబ్రవరి 14, 2024 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఈ రోజు ఈ చిత్రం యొక్క ప్రీ టీజర్ ను విడుదల చేసారు.

]Bandi Sanjay Kumar పరాక్రమం మూవీ స్టిల్స్

దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ  “మీడియా మిత్రులకు, పెద్దలకు నమస్కారాలు. బండి సరోజ్ కుమార్ అనే నేను ఒక నటుడిగా , దర్శకుడిగా మీలో కొంత మందికి తెలిసే ఉండొచ్చు. “కళ నాది. వెల మీద” అనే కాన్సెప్ట్ తో, డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో రిలీజ్ చేసిన “నిర్బంధం, మాంగల్యం” లాంటి కల్ట్ సినిమాల తో నాకు లక్షలాది ప్రేక్షకుల అభిమానం లభించింది.

Bandi Sanjay Kumar పరాక్రమం మూవీ స్టిల్స్ 2

వాళ్ళు ఇచ్చిన బలంతో ఇప్పుడు నేను “BSK మెయిన్ స్ట్రీమ్ ” అనే నా సొంత నిర్మాణ సంస్థ ద్వారా వెండితెరకు రాబోతున్నాను. పిల్లా , పాపలతో కుటుంబాలు సినిమా హాల్ కు తరలి వచ్చే కథాంశం తో “పరాక్రమం” అనే చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ” I, ME, MYSELF ” దీని టాగ్ లైన్ .

Bandi Sanjay Kumar పరాక్రమం మూవీ స్టిల్స్ 1
“పరాక్రమం” అనే ఈ చిత్రం యొక్క “ప్రీ టిజర్ ” ను ఈ లేఖతో జత చేశాను . ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 14 2024 న  విడుదల లక్ష్యంగా, ఈ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో రెండు షెడ్యూల్స్ తో ముప్పై రోజుల
షూటింగ్ తో ఈ చిత్రం  పూర్తవుతుంది.

Bandi Sanjay Kumar పరాక్రమం మూవీ స్టిల్స్ 3

ఈ చిత్ర కథాంశం  గురించి చెప్పాలంటే గోదావరి జిల్లా లో “లంపకలోవ” గ్రామంలో పుట్టిన “లోవరాజు” అనే యువకుడి జీవితంలో జరిగే గల్లీ క్రికెట్, ప్రేమ, నాటక రంగ జీవితం , రాజకీయం లాంటి ఘట్టాల ఆవిష్కరణ ఈ చిత్ర ముఖ్య కథాంశం. యువతను అన్ని విధాలుగా ఎంటర్టైన్  చేస్తూనే, వారిని మేల్కొలిపే ఒక మంచి కమర్షియల్ కథతో రాబోతున్నాను. నాతోపాటు ప్రతిభ ఉన్న నూతన నటీ, నటులను ఈ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయబోతున్నాను.

Bandi Sanjay Kumar పరాక్రమం మూవీ స్టిల్స్ 5
దీనికి రచన, కూర్పు, సంగీతం, దర్శకత్వం  నేనే వహిస్తుండగా మిగిలిన విభాగాల్లో ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో ఈ చిత్రం నిర్మించబడుతుంది. ఒక గొప్ప సంకల్పంతో నేను నిర్మించబోయే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లి నాకు, నా నిర్మాణ సంస్థ కి మరింత బలాన్ని చేకూర్చాలి అన్న సంకల్పం తో మీ పాత్రికేయులందరికి నా విజ్ఞప్తి అని ముగించారు.

నటీనటులు :

బండి సరోజ్ కుమార్, అనామిక, కిరీటి, మోహన్ సేనాపతి, తదితరులు.

సాంకేతిక వర్గం : 

బ్యానర్ : బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK MAINSTREAM)

కథ, ఎడిటర్, సంగీతం, నిర్మాత, దర్శకుడు – బండి సరోజ్ కుమార్

వి ఎఫ్ ఎక్స్ : AYKERA studios

సౌండ్ డిజైన్ మరియు మిక్సింగ్ : కాళీ ఎస్ ఆర్ అశోక్

ఆర్ట్ : కిరీటి మూసి

పబ్లిసిటీ డిజైర్ : సాగర్ ముదిరాజ్, మరియు ఉదయ్ జల

లిరిక్స్ : శశాంక్ వెన్నెలకంటి

లైన్ ప్రొడ్యూసర్ : ప్రవీణ్ గూడూరి

పి ఆర్ ఓ : పాల్ పవన్

ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : మన రాజు

స్టిల్స్ : నవీన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *