Special Interview: “దయా” వెబ్ సిరీస్ లో ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది అంటున్న హీరో జేడీ చక్రవర్తి

dayaa special interview ఆఫ్ jd e1690975109987

 

జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించిన ‘దయా’ వెబ్ సిరీస్ ఈ నెల 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు పవన్ సాధినేని తెరకెక్కించారు.

ఈ దయా  వెబ్ సిరీస్ లో నటించిన ఎక్సీపిరియన్స్ మా 18f మూవీస్ ప్రతినిధి తో షేర్ చేసుకున్నారు జేడీ చక్రవర్తి. ఆ విశేషాలు మీ కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాము. చదవండి. కహదీవించండి..

dayaa special interview ఆఫ్ jd 7

కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని నేను. దయా అనే కథను దర్శకుడు పవన్ సాధినేని చెప్పిన విధానం ఆకట్టుకుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించాను. కథ మనకున్న స్థలం లాంటిదైతే..అందులో అందమైన ఇళ్లు కట్టడం డైరెక్షన్ లాంటిది. సినిమా అనే సౌధాన్ని అందంగా నిర్మించడం దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది.

– హాట్ స్టార్ నుంచి దయా వెబ్ సిరీస్ కోసం నన్ను తరుచూ సంప్రదించారు. నేను సిరీస్ చేసే మూడ్ లో లేననుకుంటా…డెసిషన్ చెప్పడం పోస్ట్ పోన్ చేస్తూ వచ్చా. వాళ్లు మాత్రం వదలలేదు. సినాప్సిస్ వినండి అని స్క్రిప్ట్ పంపారు. ఆ తర్వాత డైరెక్టర్ పవన్ సాధినేని ఫోన్ లో పది నిమిషాలు కథ వినిపించాడు. పర్సనల్ గా వచ్చి ఫుల్ స్క్రిప్ట్ చెప్తా అని వచ్చాడు. నేను స్టోరీ వినకుండానే దయా వెబ్ సిరీస్ చేస్తున్నా అని చెప్పా. ఎందుకంటే నాకు గతంలో ఆర్జీవీ చెప్పిన మాటలు గుర్తుకువచ్చాయి.

dayaa special interview ఆఫ్ jd 6 e1690975152423

ఏ దర్శకుడైనా పది నిమిషాల్లో కథ చెప్పగలిగితే అతనికి ఆ స్క్రిప్ట్ మీద కమాండ్ ఉన్నట్లు అని ఆర్జీవీ అనేవారు. పవన్ ఫోన్ లో 10 మినిట్స్ స్టోరీ చెప్పినప్పుడే అతనికి కథ మీద ఉన్న పట్టు తెలిసింది. దాంతో ఫుల్ నెరేషన్ వినకుండానే ఓకే చెప్పాను.

dayaa special interview ఆఫ్ jd 3

– దయా వెబ్ సిరీస్ కు దర్శకుడు పవన్ పెద్ద బలం. ఇందులో క్యారెక్టర్స్ ఒక స్ట్రెంత్ అని చెప్పుకోవచ్చు. ప్రతి క్యారెక్టర్ యూనిక్ గా ఉంటుంది. నటీనటులకు గుర్తింపు తెచ్చే పాత్రలు ఇందులో ఉంటాయి. నా మొదటి సినిమా శివతోనే నేను జేడీ అయిపోయా. అలాగే బాహుబలిలో సత్యరాజ్ ను కట్టప్పగానే గుర్తుంచుకుంటాం. ఇలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్న వెబ్ సిరీస్ దయా. లొకేషన్స్, క్యారెక్టర్స్, స్క్రిప్ట్ అన్నీ బాగా కుదిరిన సిరీస్ ఇది.

– దయాలో నేను ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ ను. చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లడం నా పని. దయా వరల్డ్ ను ప్రారంభం నుంచీ 10, 12 నిమిషాల పాటు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చాడు. ఆ ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్ కు ఒకరోజు అమ్మాయి శవం కనిపిస్తుంది. పోలీసులకు చెప్పేంత ధైర్యం అతనిలో ఉండదు. ఈ భయంలో ఉండగానే ఇంకో శవం దొరుకుతుంది. సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటనలు మలుపుతిప్పుతాయి. ఆ ఎమోషన్స్ అన్నీ దయాలో చూస్తారు.

dayaa special interview ఆఫ్ jd 5

బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా. అయితే నా బలం తెలుగు చిత్ర పరిశ్రమ. అందుకే మళ్లీ ఇక్కడ ప్రాజెక్ట్స్ చేస్తున్నా. ఇండస్ట్రీలో డిమాండ్ అండ్ సప్లై గురించి మీకు తెలుసు. నా కోసం విపరీతంగా ఆఫర్స్ వస్తున్నాయి నేను చేయడం లేదని చెప్పడం అబద్ధమే అవుతుంది. కానీ కొన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చక వదిలేస్తున్నవీ ఉన్నాయి.

– ఓటీటీలో స్టార్ డమ్ ను కౌంట్ చేయలేము అనడం సరికాదు. సినిమా ఎంత సక్సెస్ అయ్యింది అనేందుకు థియేటర్ లో మనకు కలెక్షన్స్ లెక్కిస్తాం. కానీ ఓటీటీలో ఎంతమంది చూశారు అనేది కొలమానం. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుకు వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. వెబ్ సిరీస్ లో కొత్త వాళ్లకూ ఆదరణ దక్కుతుంది. వాళ్లనూ రిసీవ్ చేసుకుంటారు.

dayaa special interview ఆఫ్ jd 4 e1690975200367

ప్రస్తుతం థియేటర్ లో స్టార్స్ సినిమాలకు మాత్రమే బయ్యర్స్, కలెక్షన్స్ ఉంటున్నాయి. ఇది ఓటీటీకున్న అడ్వాంటేజ్. నేను జేడీ చక్రవర్తి కాకుండా కొత్త నటుడైనా దయాలో చూస్తారు..

ఒకే థాంక్యు అండ్ అల్ ద బెస్ట్ జేడి గారు,

*కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *