ప్రస్తుత సినీ ప్రేక్షక దేవుళ్లకు సినిమా ధియేటర్లలో సినిమా మాత్రమే కాకుండా ఇంట్లో హోమ్ థియేటర్ లో ఓటీటీ రూపమ్ లో వచ్చే సినిమాలకు కూడా మంచి క్రేజ్ అయితే అందుతుంది.
చాలా మంది యువకులు ఫ్యామిలీ ఓటీటీ కంటెంట్ కు ఎక్కువగా అలవాటు పది థియేటర్ కి వెళ్ళడం తగ్గించేసేసారు. ఇంట్లో కుర్చీని ఫ్యామిలీ అందరూ సినిమా చూడడానికి బాగా అలవాటు పడ్డారు అనే చెప్పాలి.
ఈవారం కూడా కొన్ని డిఫరెంట్ సినిమాలు వివిద ఓటీడీ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల కాబోతున్నాయి. అయితే అందులో అందరి ఫోకస్ ఎక్కువగా కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా పైనే ఉంటుంది.
ఏ సినిమా ఏ ఓ టి టి లో స్ట్రీమింగ్ కాబోతుంది అనే వివరాల్లోకి పరిశీలిస్తే:
ఆమెజాన్ ప్రైమ్ లో..
అమెజాన్ ప్రైమ్ లో అయితే వరుసగా మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి.
ముఖ్యంగా అక్టోబర్ 19వ తేదీన అమ్ము అనే ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ విడుదల కాబోతోంది. ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి నవీన్ చంద్ర, బాబీ సింహ నటించారు.
అలాగే అక్టోబర్ 21వ తేదీన పేరి ఫెరల్ అనే సిరీస్ మొదలు కాబోతోంది.
అదే రోజు ఫోర్ మోర్ షాట్స్ అనే మరొక సీరిస్ కూడా స్టార్ట్ కాబోతోంది.
సోనీ లీవ్ లో:
శర్వానంద్ సినిమా ఒకే ఓక జీవితం సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదలై మంచిపాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అసలు ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ అవుతుందా లేదా అని అనుమానాలు చాలానే వచ్చాయి.
కొత్త దర్శకుడు అయినప్పటికీ టైం ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు ఈ సినిమా సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
నెట్ ఫ్లిక్స్ లో:
నెట్ ఫ్లిక్స్ లో అయితే ఏకంగా నాలుగు డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి.
అందులో ఎక్కువగా అయితే అందరి ఫోకస్ కూడా ఈ ది స్కూల్ ఫర్ గుడ్ అండ్ ఈవిల్ అనే సినిమా పైనే ఉంది.
ఇంగ్లీష్ లో అక్టోబర్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ కూడా మంచి క్రేజ్ అందుకుంది.
అలాగే ఇన్ సాల్వ్ మిస్టరీస్ అనే సిరీస్ మూడవ వాల్యూమ్ అక్టోబర్ 18 న రానుండగా..
అక్టోబర్ 21 బార్బెరియన్స్ అనే సెకండ్ సీరీస్ సందడి చేయబోతోంది.
అదేరోజు ఫ్రం స్క్రాచ్ అనే సిరీస్ కూడా స్టార్ట్ కానుంది.
https://www.youtube.com/watch?v=vBHKSQ4MrJE
జీ 5 లో:
జీ5 లో అక్టోబర్ 21 నుంచి కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మొత్తానికి అనుకున్నట్లుగానే ఈ వారం బింబిసార ఓటీడీలోకి రాబోతోంది.
ఇక అదే రోజు జీ5 లోనే త్రిపులింగ్ అనే ఒక వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కాబోతోంది.
ఇన్ని ఓటీటీ కంటెంట్ లలో ఏది ఎక్కువగా క్రేజ్ అందుకుంటుందో చూడాలి.