తెలుగు పాపులర్ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు బుల్లి తెర, వెండితెర ప్రేక్షకులకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.
టివి యాంకర్ అంటే చలాకీ మాటలతో పాటు కాస్తా గ్లామర్ తో కూడా ఆకట్టుకుంటారు. ఆలాంటి గ్లామరస్ యాంకర్లలో బ్యూటిఫుల్ అనూసయ భరద్వాజ్ ఒకరని తెలిసిందే.
బుల్లితెరపై పాపులర్ యాంకర్‌గా వెండితెరపై అద్బుతమైన నటిగా అందరి అభిమానాన్ని సంపాదించుకుంది ఈ అందాల రాశి. యాంకర్ గా, సోషల్ మీడియాలో గ్లామర్ ఒలకబోస్తూనే వెండితెరపై తనదైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది.
వెండి తెర మీద ఇటీవల ఆమె నటించిన చిత్రం దర్జా. సునీల్, అనసూయ కీలక పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్దమైంది.
అందాల చిలిపి మాటల యాంకర్ గా పేరు బుల్లితెర హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ అటు టివి షోలతో పాటు మరోవైపు సినిమాల్లో అలరిస్తోన్న సంగతి తెలిసిందే.
అమద్య రంగమ్మత్తగా రంగస్థలం మూవీలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కుర్ర కారు నోటిలో అత్త,ఆంటీ అంటూ స్తిర పడిపోయింది ఆ తర్వాత పుష్ప ది రైజ్ చిత్రంలో దాక్షాయణిగా గుర్తింపు తెచ్చుకుంది.
రవితేజ ఖిలాడీ మూవీలో రెండు వేరియేషన్స్ లో నటించి ఆకట్టుకుంది. ఇలా వరుసగా సినిమాలతో దూసుకుపోయిన యాక్టర్ అదే యాంకర్ అనసూయ ఇటీవల నటించిన చిత్రం దర్జా. సునీల్, అనసూయ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రానికి సలీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు.
పూర్వ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ సమర్పణలో పీఎస్ఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్ టైన్ చిత్రంగా దర్జా తెరకెక్కింది.
శివశంకర్ పైడిపాటి నిర్మించిన ఈ మూవీకి కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం జులై 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే.
ఈ దర్జా మూవీ థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ మూవీని ఓటీటీ ఆడియెన్స్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు.
దర్జా మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ప్రసారం చేయనుంది. స్పెషల్ ప్రీమియర్ గా విజయ దశమి కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 5 నుంచి ప్రసారం చేయనున్నారు ఆహా ఓ టి టి వారు.
దర్జా మూవీలో అనసూయ, సునీల్ తోపాటు డ్యాన్సర్ అక్సా ఖాన్, జబర్దస్త్ కమెడియన్ షకలక శంకర్ లు కూడా మంచి పాత్రల్లో నటించారు.
అనసూయ భరద్వాజ్ ఓ వైపు యాంకర్‌గా, మరోవైపు నటిగా పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవలే వాంటెడ్పండుగాడ్మూవీతో ప్రేక్షకులను పలకరించిన అనసూయ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్బిజీగా ఉంది రోజుకి రెండు షిఫ్ట్ లు నటిస్తుంది అని కృష్ణా నగర్ కబుర్లు.
అనసూయ భరద్వాజ్ఇ ప్పటికే ‘రంగమార్తాండ’, ‘వేదాంతం రాఘవయ్య’, ‘గాడ్ ఫాదర్’, ‘హరిహర వీరమల్లు’, ‘పుష్ప 2’, ‘భోళా శంకర్’ వంటి భారీ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే సినిమాలే కాకుండా వెబ్‌సిరీస్‌లకు కూడా ప్రాధాన్యత ఇస్తానంటోంది అనసూయ.
వెబ్ సిరీస్ లలో బాగంగా కన్యాశుల్కం అనే వెబ్‌సిరీస్‌లో అనసూయ నటించనుంది. గురజాడ అప్పారావు క్లాసిక్నాటకం ఆధారంగా వస్తున్న ఈ సిరీస్‌లో మధుర వాణి అనే వేశ్య పాత్రలో అనసూయ నటించనున్నట్లు సమాచారం.
చూడాలి అనసూయ గారు ఏ ఫీల్డ్ లో స్తిర పడతారో. ఇంకా సోషల్ మీడియా ఆంటీ కామెంట్స్ మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు కూడా చేసింది.
సొ ఫ్రెండ్స్ అనసూయ భరద్వాజ గారి ఆర్టికల్స్ మీద కామెంట్స్ చేసేటప్పుడు అబ్జక్ట్బూల్ కామెంట్స్ ఏమి పాస్ చేయకండి.