అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తెలుగు లో మొదటి ఒరిజినల్ మూవీ గా “అమ్ము” నిర్మించి గ్రాండ్ గా తెలుగు సినీ ప్రముకుల కోసం ప్రీమియర్ షో ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ప్రైమ్ వీడియో తొలి తెలుగు ఒరిజినల్ మూవీ “అమ్ము” ట్రైలర్ లాంచ్ అయినప్పటి నుంచి మంచి అంచనాలను సృష్టించింది. విపత్కర పరిస్థితుల్లో ఫీనిక్స్‌లా ఎదిగే ఓ మహిళ కథను తెరపైకి తెచ్చే ఈ థ్రిల్లింగ్ స్టోరీ విడుదల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
“అమ్ము” సినిమా అక్టోబర్ 19న ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం ప్రీమియర్ షో స్ట్రీమింగ్ ప్రారంభం అయ్యింది.
“అమ్ము” చిత్ర తారాగణం, సిబ్బంది మరియు సినీ ప్రముకుల కోసం హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.
అత్యంత ఆసక్తిగా నిర్మించ బడిన తొలి తెలుగు అమెజాన్ ఒరిజినల్ మూవీ అమ్మూ ప్రత్యేక స్క్రీనింగ్‌ను ప్రైమ్ వీడియో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని AMB సినిమాస్‌లో 18 న నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో కార్తీక్ సుబ్బరాజ్,నవీన్ చంద్ర, నిహారిక కొణిదెల,దేవాకట్టా,శరత్ మరార్,రాజ్ కందుకూరి మరియు స్వాతి ఈ ప్రీమియర్ కు హాజరయ్యారు.
అమ్ము పాత్రలో ఐశ్వర్య లక్ష్మి నటించారు.ఆమె పోలీసు-భర్త రవి పాత్రలో నవీన్ చంద్ర నటించారు. “అమ్ము” సహనానికి పరీక్ష ఎదురైన క్షణంలో, తన స్వేచ్ఛను తిరిగి పొందడానికి బాబీసింహా పోషించిన అపరిచిత మిత్రుడి పాత్రతో జతకడుతుంది.
కార్తీక్ సుబ్బరాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ కాగా, చారుకేష్ శేఖర్ రచన, దర్శకత్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ డ్రామా థ్రిల్లర్‌లో ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, సింహా నటించారు.
“అమ్ము” చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2022 అక్టోబర్ 19 నుంచి ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ చేస్తుంది.