AHA Naa Pellanta OTT Review: రాజ్ తరుణ్ శివాని ఆహా నా పెళ్ళంట తెలుగు రివ్యూ

రాజ్ తరుణ్ శివాని ఆహా నా పెళ్ళంట రివ్యూ

OTT Review – Zee5 Aha Naa Pellanta Web Series: రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించిన వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట!’. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైంది ఈ రోజు నుండే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ ఎలా ఉందో చదివి తెలుసుకుందామా?

aha naa pellanta రాజ్ తరుణ్ శివాని జీ 5 సిరీస్

OTT Web Series: ఆహా నా పెళ్ళంట !

విడుదల తేదీ : నవంబర్ 17, 2022

నటీనటులు: రాజ్ తరుణ్, శివాని రాజశేఖర్, హర్షవర్ధన్, ఆమని, పోసాని కృష్ణ మురళి, గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్

దర్శకుడు : సంజీవ్ రెడ్డి

నిర్మాత: సూర్య రాహుల్ తమడ

సంగీత దర్శకులు: జుడః సాండీ

సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, అక్షర్ అలీ

ఎడిటర్: మధు రెడ్డి

aha naa pellanta రాజ్ తరుణ్ శివాని

వెండితెర చిన్న హీరో రాజ్ తరుణ్ (Raj Tarun) ఓటీటీకి పరిచయ మవుతూ నటించిన వెబ్ సిరీస్ ‘అహ నా పెళ్ళంట’ (Aha Naa Pellanta Web Series). ఈ సిరీస్ లో  శివానీ రాజశేఖర్ (Shivani Rajasekhar) హీరోయిన్ గా నటించింది.

ప్రచార చిత్రాలు, పాటలకు జీ నెట్వర్క్ ద్వారా మంచి స్పందన లభించింది. ట్రైలర్, టిజర్ ఆడియన్స్‌ను అట్ట్రాక్ట్ చేశాయి. ప్రేమ, పెళ్లి, కుటుంబ అనుబంధాలు, వినోదం… ఇందులో చాలా ఉన్నాయి.

లేటెస్ట్ గా ఓటిటిలో కూడా నాన్ స్టాప్ లో ఏదొక కంటెంట్ రిలీజ్ అవుతూనే ఉంది. మరి అలా ప్రముఖ ఓటిటి యాప్ జీ 5 లో స్ట్రీమింగ్ కి వచ్చిన ఇంట్రెస్టింగ్ సిరీస్ ఎలా ఉంది ?

aha naa pellanta రాజ్ తరుణ్ శివాని ప్రెస్ మీట్

కథ ని పరిశీలిస్తే:

‘అహ నా పెళ్ళంట’ కథలోకి వెళ్తే : శీను(రాజ్ తరుణ్) తన చిన్నప్పుడు నుంచే  ప్రేమ, పెళ్లి అంటూ తన తల్లిదండ్రులైన  నో బాల్ నారాయణ(Harshavardhan)  సుశీల(Amani) లకు  షాకిస్తూ ఉంటాడు. అయితే తన కి పెళ్లి వయస్సు  వచ్చేసరికి తన పెళ్లి ఒక అమ్మాయి తో  ఫిక్స్ అవుతుంది.

పెళ్ళి కూతురు  ఊహించని విధంగా సరిగ్గా పెళ్ళి మూహర్తానికి  ముందు ఎక్కడికో వెళ్ళిపోతుంది. స్వంత వూర్లో పెళ్ళి కూతురు లేచిపోయింది అనే మాటలు బారించలేక తండ్రి బలవంతం మీద హైదరాబాద్ వచ్చి  క్రికెట్ అకాడమీలో జాబ్ లో జాయిన్ అవుతాడు.

అక్కడ ఆ పెళ్లి కూతరు తండ్రి మహేంద్ర(Posaani Krishna Murali) అసలు నిజాన్ని అతనికి చెప్తాడు.

మామ అవ్వాలి అనుకొన్న మామ  చెప్పిన నిజం ఏంటి?

పెళ్ళి కూతురు మహా(శివానీ రాజశేఖర్) ఎందుకు వెళ్ళిపోయింది?

మహా  వల్ల శీను లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటి ? 

శ్రీను కి ఫ్రెండ్స్ ఏవిధముగా సహాయం చేశారు ?

ఇలాంటి ఎన్నో  విశయాలు తెలియాలి అంటే 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ని జీ 5 లో వీక్షించాల్సిందే.

aha naa pellanta రాజ్ తరుణ్ శివాని స్టిల్స్

కధ కధనం (SCREENPLAY) పరిశీలిస్తే:

ఈ సిరీస్ లో కొన్ని సీన్స్  ఎంత కామిక్ గా ఎంత  బాగుంటాయో అలాగే కొన్ని సీన్స్  క్లారిటీ లేకుండా ఉన్నట్టు అనిపిస్తాయి. సిరీస్ కధనం తో    మెయిన్ ప్లాట్ లోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకోవడం స్టార్టింగ్ నుంచే అంత ఎంగేజింగ్ గా ఉండకపోవడం అనేది స్క్రీన్ ప్లే లోపం లా అనిపించింది.

అలాగే చాలా చోట్ల కధనం ఊహించదగిన విధంగానే ముందుకు సాగుతుంది. దీనితో ఎంగేజింగ్ లేక  కొత్తదనం కనిపించక కొంచెం బోర్ ఫీల్ అవ్వాలి. పలు సన్నివేశాల్లో ఇంకా బెటర్ గా డిజైన్ చేసి ఉంటే బాగుండు అనిపిస్తుంది. వీటితో పాటుగా క్లైమాక్స్ ని కూడా బాగా డిజైన్ చేసినట్టు అయితే బాగుండేది.

aha naa pellanta రాజ్ తరుణ్ శివాని డాన్స్

నటి నటుల నటన పరిశీలిస్తే: 

ఈ సిరీస్ ల చాలా అంశాలు చూసే వీక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పాలి. నటీ నటుల నటన నుంచి వారి పాత్రల డిజైన్ వాటిలో ఎమోషన్స్ మరియు డీటెయిల్స్ బాగా కనిపిస్తాయి.

యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న  రాజ్ తరుణ్  తన ఓటిటి డెబ్యూ గా మంచి కంటెంట్ ఉన్న ఈ స్టోరీ ని  ఎంచుకోవడంలో మెచ్చుకోవాలి. అలాగే ఈ సిరీస్ లో తన గత  సినిమాలలో ని  నటన కు మించు చేశాడు అలాగే ఎమోషన్స్ ని చక్కగా ప్రెసెంట్ చేసి ఆకట్టుకున్నాడు.

aha naa pellanta రాజ్ తరుణ్ శివాని రాజశేఖర్ డాన్స్

వీటితో పాటుగా తనలో కామికల్ యాంగిల్ కూడా ఉంది అన్నట్టు నటించు ఆహా  అనిపించాడు,  ఈ సిరీస్ లో కూడా క్యూట్ గా యంగ్ గా కనిపించి మరింత క్లీన్ నెస్ ని కనబరిచాడు. ఇక తనతో పాటుగా యంగ్ హీరోయిన్ శివాని కూడా మంచి నటన తో అమాయక పాత్ర లో  మెప్పించింది.

aha naa pellanta రాజ్ తరుణ్ శివాని స్టిల్స్ ౨

శివాని  పాత్రని డిజైన్ చేసిన విధానం కూడా మెప్పించే విధంగా ఉంది. ఈ సిరీస్ లో  ఆమె అద్భుతమైన పెర్ఫామెన్స్ ని కనబరిచింది అని కూడా చెప్పాలి.

డెఫినెట్ గా శివాని రాజ శేఖర్ కెరీర్ లో నటన పరంగా ఈ పాత్ర కూడా ఒక బెస్ట్ రోల్ గా నిలుస్తుందని చెప్పొచ్చు. శ్రీను మహా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయ్యింది. అలాగే సిరీస్ లో అన్ని ఎమోషన్స్ తో పాటుగా మంచి కామెడీ కూడా కనిపిస్తుంది.

సినీయర్ నటుడు  హర్షవర్ధన్ పై తీసిన కొన్ని సీన్స్ బాగుంటాయి. అలాగే గెటప్ శ్రీను, తాగుబోతు రమేష్ లపై వచ్చే సీన్స్ కూడా మంచి హిలేరియస్ గా అనిపిస్తాయి.

aha naa pellanta రాజ్ తరుణ్ శివాని 1

అలనాటి హీరోయిన్  ఆమని తల్లి పాత్రలో చక్కగా వదిగిపోయింది, పోసాని, రాజ్ కుమార్ తదితరులు తమ పాత్రల్లో  నటించి మెప్పించారు.

‘అహ నా పెళ్ళంట’  సిరీస్ లో ఎపిసోడ్స్ ని ఎడిటర్ క్రిస్ప్ గా కట్ చెయ్యడం మరో అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు.

aha naa pellanta రాజ్ తరుణ్ శివాని ప్రెస్ మీట్ పోస్టర్

సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:

ఈ సిరీస్ లో  తమ్ డా మీడియా వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కధ పెళ్లి నేపథ్యామ్ లో ఉంటుంది కాబట్టి దానికి  తగ్గట్టుగా చేసిన సెటప్ అంతా ఖర్చుకి వెనకాడకుండా డిజైన్ చేశారు.

టెక్నీకల్ టీం లో మ్యూజిక్ బాగుంది సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అయితే ఎడిటింగ్ లో కొన్నిసీన్స్  బెటర్ గా చేయాల్సి ఉంది. మిగతా అంతా నీట్ గా ఉంది. అలాగే డైలాగ్స్, కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి.

దర్శకుడు సంజీవ్ రెడ్డి గురించి మాట్లాడుకొంటే ఈ కధ లో కాస్త రొటీన్ లైన్ నే తీసుకున్నా చాలా వరకు మంచి నరేషన్ ని అందించడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. కధనం లో పలు చోట్ల సన్నివేశాలు బెటర్ గా రాసుకొని చెయ్యాల్సింది.

దర్శకుడు  చెప్పాలి అనుకున్న పాయింట్ ని ఆల్ మోస్ట్ మెప్పించే విధంగా చెప్పాడని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఒకే.

aha naa pellanta రాజ్ తరుణ్ శివాని పాన్ ఇండియా రిలీజ్

18 ఫ్ టీం ఒపీనియన్:

ఈ  “అహ నా పెళ్ళంట” సిరీస్ తో  హీరో రాజ్ తరుణ్ ఓ టి టి లోకి  మంచి డెబ్యూ ఇచ్చాడని చెప్పొచ్చు. తనకు  సహా నటి గా నటించిన  శివాని రాజశేఖర్ పెర్ఫామెన్స్  మంచి ప్రామిసింగ్ గా ఉండగా కొన్ని లేన్తి సీన్స్  మినహా ఈ సిరీస్ దాదాపు ఎంగేజింగ్ గా మంచి ఎమోషన్స్ మరియు ఎంటర్టైన్మెంట్ తో సాగుతుంది.

ఈ వారాంతానికి వీలు చూసుకుని ఓ టి టి  వీక్షకులు జీ 5 లో ఈ సిరీస్ తప్పకుండా చూడొచ్చు. యూత్ అయితే బ్రెంజె వాచ్ చేయవచ్చు.

 

18F Movies Rating: 3.25/5

  • కృష్ణ ప్రగడ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *