Adivi Shesh and Sharwanand to feature in Unstoppable with NBK 2:*అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2లో గెస్టులుగా అడివి శేష్, శర్వానంద్

US2 I Dance Ikon I Chef Mantra 2 1

 

* డాన్స్ ఐకాన్‌లో ముఖ్య అతిథిగా మెరవనున్న రాశీ ఖన్నా

* చెప్ మంత్ర సీజన్ 2లో అలరించనున్న రష్మీ గౌతమ్, గెటప్ శీను

US2 I Dance Ikon I Chef Mantra 2 e1667329209889

తెలుగు వారి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని దక్కించుకున్న అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఓటీటీ మాధ్యమం ఆహా.

ప్రతి వారం ఆడియెన్స్‌ని సూపర్బ్ ఎంటర్‌టైనింగ్ షోస్‌తో ఆహా అలరిస్తోంది. అదే ఎనర్జీని కంటిన్యూ చేస్తూ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే 2లో  హీరోలు అడివి శేష్, శర్వానంద్ గెస్టులుగా అలరించబోతున్నారు.

dance ikon RASHI kHANNA

మరో వైపు డాన్స్ ఐకాన్ షోలో రాశీ ఖన్నా, చెఫ్ మంత్ర సీజన్ 2లో గెటప్ శీను, రష్మీ గౌతమ్ అతిథులుగా అలరిచంబోతున్నారు. కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకుల కోసం ఫుడ్, డాన్స్, ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్‌ను సరికొత్తగా అందించడానికి సిద్ధమైంది ఆహా.

డాన్స్ ఐకాన్ (నవంబర్ 5, నవంబర్ 6)

ప్రజల్లో గొప్ప డాన్సింగ్ టాలెంట్‌ను బయటపెట్టే డాన్స్ షో డాన్స్ ఐకాన్. సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ డాన్స్ షో. ఈ షోలో పాల్గొనే ప్రతి కంటెస్టెంట్‌లోని బెస్ట్ టాలెంట్‌ను ప్రతివారం ఈ షో బయటకు తీసుకొస్తుంది.

ప్రతి శని, ఆది వారాల్లో ఈ షో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఓంకార్ హోస్ట్ చేస్తోన్న ఈ షోకి రమ్యకృష్ణ, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలోని టాప్ కంటెస్టెంట్స్ మధ్య జరగబోయే పోటీని చూడటం అస్సలు మరచిపోకండి.ఇది కేవలం ఆహాలోనే.

చెఫ్ మంత్ర సీజన్ 2

నటి, నిర్మాత, రచయిత, దర్శకురాలు, సామాజిక వేత్త, ఎన్‌ఎఫ్‌టి కలెక్టర్ లక్ష్మీ మంచు మంచు భోజన ప్రియురాలు. అలాంటి ఆమె చెఫ్ మంత్ర సీజన్ 2కి హోస్ట్‌గా మారారు.

కార్యక్రమంలో పాల్గొనే అతిథుల జీవన విధానం, జీవన శైలిని అనుసరించి సరికొత్త ఫుడ్ ఐటెమ్స్‌ను తయారు చేస్తారు. ఈ వారం రష్మీ గౌతమ్, గెటప్ శీను షోలో అతిథులుగా హాజరు కాబోతున్నారు. ఈ షో సమయంలో వారు వారికి నచ్చిన ఆహారం, దానితోనే ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకుంటారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *