మెగాస్టార్ చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’. మోహన్ లాల్ మలయాళంలో చేసిన ‘లూసీఫర్’ కు రీమేక్‌గా తెరకెక్కిన సినిమా ఇది.
అంతే కాకుండా ‘లూసీఫర్’ పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ వర్షన్ ఎప్పుడో అందుబాటులోకి వచ్చింది. చాలా మంది ఈ సినిమాను చూసిన వారే. అయినా కూడా మెగాస్టార్ ‘గాడ్ ఫాదర్’ సినిమా మాత్రం ఊహించని స్థాయిలో విడుదలైన అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.
దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దసరా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో కీలక పాత్రలో సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ నటించారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు రంగం సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థలో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు గాడ్ ఫాదర్ ఓటీటీ రైట్స్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
https://www.youtube.com/watch?v=GyAqgwiNKiU
త్వరలోనే ‘గాడ్ ఫాదర్’ ను ఓటీటీ వ్యూయర్స్ కోసం అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది నెట్‌ఫ్లిక్స్. అన్ని కుదిరితే ఈ నవంబర్ 19 నుంచే స్ట్రీమింగ్ కావడం పక్కా అనే సమాచారం చక్కర్లు కొడుతుంది.
ఎటు తిరిగి మూడు వారాల సమయం వేచి ఉండక తప్పదు కదా అని నెటిజన్స్ దీని మీద స్పందిస్తున్నారు.