సినిమా : అమ్ము (AMMU IN AMAZON RPIME)
Ammu Telugu Movie Review: భార్య మీద
చేయి చేసుకునే భర్తలు, భర్తను దుర్భాశలాడే భార్యలుఈ సమాజంలో ఉన్నారు.
గృహ హింస కి పాల్పడే వారికి, ప్రేరేపించేవారికి మంచి సందేశం ఇచ్చే సినిమా ‘అమ్ము’.
అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు : ఐశ్వర్య లక్ష్మీ, నవీన్ చంద్ర, బాబీ సింహ, సత్య కృష్ణన్, ప్రేమ్ సాగర్, రఘుబాబు, అంజలి అమీర్, రాజా రవీంద్ర, అప్పాజీ అంబరీష తదితరులు
మాటలు : పద్మావతి మల్లాది
ఛాయాగ్రహణం : అపూర్వ అనిల్ శాలిగ్రాం
సంగీతం: భరత్ శంకర్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : కార్తీక్ సుబ్బరాజ్
నిర్మాతలు : కళ్యాణ్ సుబ్రమణియన్, కార్తికేయన్ సంతానం
రచన, దర్శకత్వం : చారుకేశ్ శేఖర్
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2022
ఓటీటీ వేదిక : అమెజాన్ ప్రైమ్ వీడియో
దోమస్తిక్ వైల్యాన్స్ (గృహ హింస) నేపద్యం లో చాలా సినిమాలు వచ్చాయి. ఈ మద్యనే బాలీవుడ్ లో అలియా బట్ డార్లింగ్స్ సినిమా వచ్చింది. అలాంటి గృహ హింస బాక్ గ్రౌండ్ లో ఐశ్వర్య లక్ష్మీ (Aishwarya Lekshmi), నవీన్ చంద్ర (NAVEEN CHANDRA), బాబీ సింహ (BOBBY SIMHA) ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అమ్ము’ (Ammu Movie) ఈ రోజు నుండి అమెజాన్ ప్రయిమ్ ఓ టి టి లో స్ట్రీమింగ్ అవుతుంది.
సినీ ప్రేక్షకులకు అందుబాటులో లో ఉన్న ట్రైలర్స్ చూస్తే భర్త చేతిలో భార్య హింసకు గురయ్యే సన్నివేశాలు కనిపిస్తాయి. భార్య గా ఐశ్వర్య లక్షి కనిపించారు.
అమ్ము సినిమా (Ammu Review) రివ్యూ ఎలా ఉంది?
గృహ హింస నేపథ్యంలో ఈ అమ్ము ద్వారా కధకుడు, దర్శకుడు ఎలాంటి సందేశం ఇచ్చారు?
ఎలాంటి వెదుమపులను గృహ హింస అంటారు ? .
భార్యలు చేతులలో అవమానాలు పడుతున్న భర్త ల గురించి ఏమైనా చర్చించారా ?
భర్త , భార్యను హింసించాడానికి ప్రేరేపించే కారణాలు ఏమైనా చర్చించారా ఈ అమ్ము లో ?
ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే అమ్ము సినిమా మొత్తం చూసి తెలుసుకోవాలి .
కథ ని పరిశీలిస్తే ( AMMU STORY REVIEW):
రవి… రవీంద్రనాథ్ (నవీన్ చంద్ర) పోలీస్ ఆఫీసర్.
అమ్ము… అముద (ఐశ్వర్య లక్ష్మీ) అతడి పక్కింటి అమ్మాయి. పెళ్లి అనే బందం తో పెద్దలు ఇద్దరితో ఏడడుగులు వేయిస్తారు. పెళ్ళైన కొత్తలో అంతా బావుంది.
అందరి భర్తలు లనే భార్యను రవి బాగా చూసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత అతడి ఇన్నర్ ఫీలింగ్స్ బయట పడతాయి. చిన్న చిన్న విషయాలకు భార్యపై కోప్పడటం, కొట్టడం మొదలు మొదలు పెడతాడు. భర్తను వదిలి, ఇల్లు విడిచి వెళ్లిపోవాలని అమ్ము అనుకుంటుంది.
కానీ, భర్తను ఇంటిని వదిలి వెళ్లలేక పోతుంది ఎందుకు ?
తనను చిత్రహింసలకు గురి చేస్తున్న భర్తను భరించిందా ?
లేదంటే ప్రతీకారం ఏమైనా ప్లాన్ చేసిందా?
రవి, అమ్ము దంపతుల మధ్య జైలు నుండి బయటికి వచ్చిన హంతకుడు ప్రభు (బాబీ సింహ) ఏమి చేశాడు?
ప్రభు రాకతో రవి అమ్ము ప్రవర్తన మరిందా ? తర్వాత ఏమైంది?
అనేది అమ్ము సినిమా .
కధనం పరిశీలిస్తే: (SCREENPLAY Review):
డొమెస్టిక్ వయలెన్స్ (గృహ హింస) అంశం మీద హిందీలో తాప్సీ ‘థప్పడ్’, ఆలియా భట్ ‘డార్లింగ్స్’ చిత్రాలు వచ్చాయి. తెలుగులో గృహ హింస నేపథ్యంలో కొన్ని చిత్రాల్లో సన్నివేశాలు ఉన్నాయి.
గృహ హింస ప్రధానాంశంగా రూపొందిన ఈ మద్య కాలం లో వచ్చిన చిత్రం ‘అమ్ము’ అని చెప్పాలి. ఈ సినిమా ఎలా ఉందనే విషయంపరిశీలిస్తే…..
– మన సమాజంలో బాగా నాటుకు పోయిన భావన ఇది.
‘ఒక మగాడు పెళ్ళాం మీద చెయ్యి ఎత్తకూడదు. అలా ఎత్తాడే అనుకో… వాడితో ఒక్క క్షణం కూడా పెళ్ళాం ఉండాల్సిన అవసరం లేదు’
– ఇదీ ‘అమ్ము’లో అమ్మాయితో తల్లి చెప్పే మాట!
తల్లి మాట విని భర్త కొట్టిన తర్వాత బ్యాగ్ సర్దుకుని అమ్మాయి అమ్మ తో వెళ్లిపోతే ‘అమ్ము’ కథ అర గంటలో ముగిసి పోతుంది. కథలో అసలు విషయం ఇదేనని తెలిసిన తర్వాత చూసేటప్పుడు ఆసక్తి ఏముంటుంది?
అనుకునే ప్రేక్షకులు తెలిసికోవాలసింది ‘అమ్ము’లో భార్య భర్తల గొడవ విషయం కంటే మించి బలమైన సంఘర్షణ ఉంది. అది మనల్ని చివరి వరకూ సినిమా గా కాకుండా మన పక్కింటి భార్య భర్తల కధ చూస్తున్నాము అనెల చేస్తుంది అమ్ము సినిమా కధనం.
అమ్మ మాట విని ఆడపిల్ల బ్యాగ్ సర్దుకుని వచ్చేయడం అంత సులభం కాదనే విషయాన్ని ‘అమ్ము’లో బలంగా చూపించారు. అందుకు ఎన్నో అడ్డంకులు, కొన్నిసార్లు భర్తకు భార్య భయపడితే… కొన్నిసార్లు బంధాన్ని నిలుపుకోవాలనే ఆలోచన, ప్రేమ అడ్డు గోడలు అవుతాయని సూటిగా, స్పష్టంగా చెప్పారు.
అసలు విషయం చెప్పే క్రమంలో దర్శకుడు కొంత సినిమా కధను నడిపించే స్క్రీన్ ప్లే లో దొరికే స్వేచ్ఛ తీసుకున్నారు. అది ఏంటంటే రవి పాత్రలో ఒక్కసారిగా వచ్చే మార్పు ఆశ్చర్యానికి గురి చేస్తే… పోలీసుల కళ్ళు గప్పి హంతకుడిని దాచడం అంత సులభమా? అనిపిస్తుంది.
కథకు అనుకూలంగా కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాసుకున్నారు. అవి నిజ జీవిత జీవన విధానానికి దూరంగా, భార్యను కొట్టి తర్వాత సారీ చెప్పి, మళ్ళీ కొట్టే రవి లాంటి పాత్రలను చాలా సినిమా లలో ఇంతకు ముందు చూశాం కూడా!
‘డార్లింగ్స్’లో విజయ్ వర్మ పాత్ర కూడా అలానే ఉంటుంది. అయితే… ఐశ్వర్య పాత్రను మలచిన విధానం కొత్తగా ఉంది. కథను ఆసక్తిగా ప్రారంభించిన దర్శకుడు… మొదటి గంట తర్వాత కొన్ని కధలో కొంచెం బ్యాలెన్స్ తప్పినట్టు అనిపించింది.
బాబీ సింహ పాత్ర, జైలు బయట అతని కోసం ధర్నా చేసే సన్నివేశాలు కథను కొంత సైడ్ ట్రాక్‌లోకి తీసుకు వెళ్లాయి. అవి సినిమా రన్ టైమ్ పెంచేశాయి. మళ్ళీ ముగింపు అర గంట లో మెరుపు చూపించారు. కథ, కథనం కంటే కథలో అమ్ము పాత్ర తాలూకు సంఘర్షణ, సంభాషణలు ఎక్కువ ఆకట్టుకుంటాయి. కథతో ప్రయాణించేలా చేస్తాయి.
సినిమాలో పెద్దగా లొకేషన్లు లేవు. ఇల్లు, పోలీస్ స్టేషన్, ఇంటి పరిసర ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, ఆ ఫీలింగ్ ఆడియన్‌లో రానివ్వకుండా సినిమాటోగ్రాఫర్ అపూర్వ అనిల్ శాలిగ్రాం తన కెమెరా యాంగిల్స్ తో మాయ చేశారు. సినిమా చూస్తున్న ఫీల్ లేకుండా కధ లోకి తీసుకు వెళ్లారు. సంగీతం కూడా అంతే! సాంకేతికంగా సినిమా బావుంది. ఓటీటీకి బెస్ట్ ఇచ్చారని చెప్పుకోవాలి.
నటీనటులు నటన పరిశీలిస్తే :
ఐశ్వర్య లక్ష్మీ అమ్ము పాత్రలో జీవించారు. ముఖ్యంగా ఆమె కన్నీరు పెట్టుకుంటుంటే… కొన్నిసార్లు మనమూ ఎమోషనల్ అవుతాం. భర్త తనపై చెయ్యి చేసుకోవడం సహించలేని తనం, అదే సమయంలో నిస్సహాయతను వ్యక్తం చేసే సన్నివేశాల్లో ఐశ్యర్య లక్ష్మీ అభినయం అద్భుతం!
నవీన్ చంద్ర ఇంతకు ముందు నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లను చాలానే చేశారు. ఆయనకు ఈ క్యారెక్టర్ చేయడం పెద్ద ఛాలెంజ్ ఏమీ కాదు. అయితే… పతాక సన్నివేశాల్లో భార్య ధైర్యంగా ముందడుగు వేసి, డీఐజీ దగ్గర నిలబడిన సన్నివేశంలో నవీన్ చంద్ర ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ నటుడిగా అతడిని మరో మెట్టు ఎక్కించింది.
బాబీ సింహ, ప్రేమ్ సాగర్, సత్య కృష్ణన్, సంజయ్ స్వరూప్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. రఘుబాబు కనిపించేది కొంత టైమ్ అయినప్పటికీ… కథలో కీలక పాత్ర చేశారు.
18F OPINION:
మహిళలు పెళ్లి అయినా తర్వాత కూడా ధైర్యంగా ఉండాలని చెప్పే చిత్రమిది. ప్రతి పల్లెలో, పట్టణంలో, నగరంలో ఒక అమ్ము లాంటి ఉంటుంది. మనసులో తనను తానుగా బయపడకుండా దైర్యంగా ఏ సమస్యను అయినా ఎదుర్కొని, భయాన్ని వీడాలని చెప్పే చిత్రమిది.
సదా సీదా కధ ని అమ్ము రవి గా చేసిన ఐశ్యర్య లక్ష్మీ, నవీన్ చంద్ర తమ అభినయంతో చివర వరకు చూసేలా చేశారు. కొన్ని సీన్స్ లాజిక్‌కు దూరంగా ఉన్నా సరే ‘అమ్ము’ ఎమోషన్, యాక్టింగ్ & క్యారెక్టర్‌లో ఇంటెన్సిటీ మనసును తాకుతుంది.
ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి,తండ్రి పెళ్ళికి రెఢీ అవుతున్న ప్రతి అమ్మాయి, అబ్బాయి తప్పక చూడవలసిన సినిమా..
అమ్ము మన పక్కింటి అమ్మాయి కధ.
BY KRISHNA PRAGADA.
18F TEAM RATING: 3.25/5