ఆర్టస్ ఇంటర్నేషనల్ స్కూల్ లోగో మరియు బ్రోచర్ ప్రారంభించిన నాగ తుమ్మల, రాజ్ యార్లగడ్డ !

IMG 20241116 WA0208 e1731748342589

 హైదరాబాద్: కోకాపేట్‌లో ఆర్టస్ ఇంటర్నేషనల్ తన మొదటి క్యాంపస్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వినూత్నమైన, సాంకేతికత, సంపూర్ణమైన అభ్యాసానికి ఇది కేంద్రంగా నిలవనుంది. ఆర్టస్ సీబీఎస్ఈ, కేంబ్రిడ్జ్ సిలబస్‌ల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని అందిస్తుంది.

IMG 20241116 WA0210కృత్రిమ మేధా సాంకేతికత, మానవ విలువలు, సృజనాత్మక ఆలోచనలతో సరికొత్త అబ్యాసాన్ని ఇక్కడ అందించనున్నారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో…

IMG 20241116 WA0220

పాఠశాల నిర్వాహకుడు, విద్యావేత్త డాక్టర్ ప్రసన్న మండవ మాట్లాడుతూ… మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేయడంలో సాంప్రదాయ పద్ధతులు చాలా తక్కువగా ఉన్నాయని మేము గుర్తించాము. ఆర్టస్ సమగ్రమైన, విలువ-ఆధారిత విధానాన్ని ప్రారంభించింది, సాంకేతికత, ప్రాజెక్ట్‌లోని తాజా పోకడలతో నాన్-లీనియర్ బోధనా విధానాన్ని ఏకీకృతం చేస్తుందన్నారు.

విద్యార్థుల ఆలోచనలకు అనుగుణంగా వారిని ఆయా రంగంలో ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.

IMG 20241116 WA0216

సహా వ్యవస్థాపకులు నాగ తుమ్మల మాట్లాడుతూ.. “వైవిధ్యమైన అభ్యాస విధానాలు, సాంకేతికత అభ్యాసం ద్వారా ప్రతి విద్యార్థి పై ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్నారు.

IMG 20241116 WA0212.. ప్రపంచ స్థాయి పాఠశాల వాతావరణాన్ని ఇక్కడ అందిస్తున్నామన్నారు చదువుకునే విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఈ పాఠశాల సరికొత్త అభ్యాస కేంద్రంగా నిలుస్తుందన్నారు.

కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్‌ఎస్ కరుణాకరరావు దాసరి, మహేశ్ లంకిపల్లి, అనిరుధ్ రెడ్డి జిల్లెల, యసస్విని మండవ, నితిన్ రెడ్డి జిల్లెల తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *