మూవీ: ఆపరేషన్ వాలెంటైన్
విడుదల తేదీ : మార్చి 01, 2024,
నటీనటులు: వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్, నవదీప్, మిర్ సావర్, తదితరులు,
దర్శకుడు: శక్తి ప్రతాప్ సింగ్ హడా,
నిర్మాత: సందీప్ ముద్దా, సోనీ పిక్చర్స్,
సంగీత దర్శకులు: మిక్కీ జే మేయర్,
సినిమాటోగ్రాఫర్: హరి కె. వేదాంతం,
ఎడిటింగ్: నవీన్ నూలి,
ఆపరేషన్ వాలెంటైన్ మూవీ రివ్యూ (Operation Valentine Movie Review):
మంచి పిజిక్ పర్సనాలిటీ ఉండి యొదుడు పాత్రలకు పర్ఫెక్ట్ హీరో మెటీరీయల్ అయిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్.
వరుణ్ తేజ్ కి ఇది స్ట్రెయిట్ హిందీ సినిమా అని చెప్పవచ్చు. మరి ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాక్ డ్రాప్ లో వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా తెలుగు ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !
కధ పరిశీలిస్తే (Story Line):
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అర్జున్ దేవ్ (వరుణ్ తేజ్) వింగ్ కమాండర్ గా ఉంటూ దేశ రక్షణ కోసం రెడీ అయ్యి వచ్చే ఎయిర్ క్రాఫ్ట్స్ ని టెస్ట్ చేసే విభాగంలో టెస్టింగ్ ఫైలేట్ గా పని చేస్తుంటాడు. అతని భార్య అహనా గిల్ (మానుషీ చిల్లర్) కూడా వింగ్ కమాండర్. అయితే ఎయిర్ బేస్ రాడార్ ప్రోగ్రామ్ కంట్రోలర్ ఫైటర్స్ ని ఇన్స్ట్రుక్ట్ చేస్తుంటుంది.
ఆపరేషన్ వజ్ర పేరుతో ఎయిర్ ఫోర్స్ ఒక ప్రాజెక్ట్ చేపడుతుంది. తక్కువ ఎత్తులో ఫైటర్ జెట్స్ నడిపితే శత్రువుల రాడార్ కంటికి కనిపించకుండా ఉండటంతో పైలట్స్ ప్రాణాలు కావడవచ్చనేది దాని ఉద్దేశం. స్వతహాగా ఆవేశపరుడైన రుద్ర ‘ఆపరేషన్ వజ్రా’ మొదటి టెస్టింగ్ లో ఫెయిల్ అయి తన ప్రాణ స్నేహితుడు కొ పైలెట్ ని కోల్పోయి ప్రాణాలతో బయట పడతాడు.
2019, ఫిబ్రవరి 14 న శ్రీనగర్ పర్వతాలలో మరో సారీ టెస్ట్ చేసి తిరిగి వస్తూతున్నప్పుడే (వాలెంటెన్ డే ) పుల్వామాలో భారతీయ జవాన్ల మీద దాడి జరుగుతుంది. పుల్వామా దాడిలో 40 మందికి పైగా సైనికులను ఇండియా కోల్పోతుంది. పుల్వామా ఘటనకు ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ సమీపం లో ఎయిర్ స్ట్రైక్ ని ఆపరేషన్ వాలెంటైన్ అనే పేరుతో చేస్తుంది. ఈ దాడులకు పాకిస్థాన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ప్రతికారమే సినిమా కి క్లైమాక్స్..
ఈ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ కి పాకిస్తాన్ ఎలా స్పందించింది?,
అసలు పుల్వామాలో భారతీయ జవాన్ల మీద దాడి కి కారణం ఏంటి ?,
దానికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన పోరాటం ఏమిటి ?,
‘ఆపరేషన్ వజ్రా’ మొదటి సారీ ఫెయిల్ కి కారణం ఏంటి ?,
ఆపరేషన్ వజ్రలో కబీర్ (నవదీప్) ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఏమిటి?,
ఎయిర్ స్ట్రైక్ సమయంలో అర్జున్ ఏం చేశాడు? ,
వింగ్ కమాండర్ గా అర్జున్ రుద్ర పడ్డ కష్టం ఏమిటి ?,
ఈ మొత్తం యుద్ధంలో రుద్ర భార్య అహనా గిల్ ( మానుషి చిల్లర్) పాత్ర ఏమిటి ?
బార్య – భర్తలు ఇద్దరు ఒకే ఫోర్స్ లో ఉండటం వలన ఎలాంటి త్యాగాలు తెలిసి చెయ్యాలి ?
అనే ప్రశ్నలకు జవాబుల సమహారమే ఈ ఆపరేషన్ వాలెంటైన్ చిత్ర కధ- కధనం. ఈ ప్రశ్నలే కొత్తగా ఉన్నాయి కాబట్టి, సినిమా కూడా కొత్త అనిబహుతిని కల్పిస్తూ స్లో గా టెక్ ఆఫ్ తీసుకొన్న హై ఎండ్ ఎమోషన్స్ తో ముగిస్తుంది.
కధనం పరిశీలిస్తే (Screen – Play):
దర్శకుడు ఎయిర్ ఫోర్స్ బాక్ డ్రాప్ లో వింగ్ కమాండర్ (ఫైటర్ ఫైలెట్స్ )ల నేపద్యం లో రాసుకొని కధ పాయింట్ చాలా బాగుంది. తెలుగు ప్రేక్షకులకు కొత్తది కూడా ! ఇంకా ఈ కధకు గతం లో జరిగిన పుల్వామా దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బాలాకోట్ సమీపం లో చేసిన ఎయిర్ స్ట్రైక్ ఆపరేషన్ వంటి నిజంగా జరిగిన సంఘటనలను జోడించి కధను దేశభక్తి వైపు నడిపే కధనం ( స్క్రీన్ – ప్లే ) మాత్రం కొంచెం సామాన్య ప్రేక్షకులకు అర్దం కానీ భాషలో సాగించడం కొంత నిరాశే అని చేపవచ్చు.
ముఖ్యంగా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలోని సన్నివేశాలు బాగానే ఉన్నా, దర్శకుడు కథనాన్ని మాత్రం పూర్తి ఆసక్తికరంగా మలచలేకపోయారు. కీలకమైన సన్నివేశాలను తన మాతృ భాషలో బాగా రాసుకున్నప్పటికీ వెండితెర మీదకు వచ్చేటప్పటికి సోల్ మిస్ అయ్యిందా అనిపఇస్తుంది. హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాల్లో కొన్నిటిలో ఆసక్తిక ఎమోషన్ అందుకోలేకపోయాడు.
సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుంది ?, ఫైటర్ జెట్ ఫైలైట్స్ ఎలాంటి కష్టాల్లో ఇరుకకుంటారు ? వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారో అనే ఎమోషనల్ ట్రాన్స్ లోకి ప్రేక్షకులను తీసుకెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు మాత్రం ఆ దిశగా సినిమా కధనాన్ని నడిపించలేకపోయాడు. ఇక సినిమా మొదటి అంకం ( ఫస్టాఫ్) కథనం పాత్రల పరిచయం తో సాదా సీదాగానే గడిచిపోయింది.
దీనికి తోడు సినిమాలో కొన్ని చోట్ల టెక్నికల్ వర్డ్స్ వాడటం వలన సామాన్యులకు సీన్స్ అర్దం కాక విజువల్స్ చూస్తూ ఉండిపోవలసి వస్తుంది. ఆర్టిస్టులు కూడా వరుణ్, అతిది పాత్రలలో నటించిన నవదీప్, అభినవ్ గోమటమ్ తప్ప మిగిలిన మెయిన్ పాత్రలలో నటించిన నటులు అంతా హిందీ, పరభాషా నటులు అవ్వడం వలన హిందీ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా తీసుకొన్న కధ ఉత్కంఠభరితమైనది అయినా తెలుగు ప్రేక్షకులకు అర్దమయ్యే విధంగా కథనాన్ని రాసుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడ్డారు. ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్ ని వాడుకొన్న విధానం, స్పేస్ నేపథ్యంలో ఆయన రూపొందించిన సన్నివేశాలు, విఎఫ్ఎక్స్ వర్క్ ఆకట్టుకున్నాయి.
దేశం కోసం టేక్ ఆఫ్ తీసుకొన్న ప్రతి సారీ తిరిగి వస్తామో లేదో తెలియని సిట్యువేశన్ లో ఉద్యోగం చేస్తున్నమా లేక జీవితం తో పోరాడుతూన్నామా అనే క్లిష్ట పరిస్తులలో పని చేస్తున్న ఫైటర్ ఫైలేట్స్ గురించి చూపించిన మొదటి తెలుగు సినిమా అని చెప్పవచ్చు.
ఈ ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందంటమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రాసుకున్న సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పైగా తెలుగులో ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ సినిమాలు రాకపోవడంతో ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు ఒక సరి కొత్త అనుభూతినిస్తుంది.
అర్జున్ దేవ్ ( రుద్ర) పాత్రలో వరుణ్ తేజ్ చాలా చక్కగా నటించాడు. తన హవ భావాలతో ముఖ్యంగా కళ్ళతో (ఫైటర్ జెట్ లో హెల్మెట్ నోస్ మాస్క్ వలన ఐస్ మాత్రమే కనిపిస్తాయి) నటించి మేప్పించా డు. కొన్ని స్పేస్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన బాగుంది.
హీరోయిన్ గా నటించిన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల్లో తన పెర్ఫార్మెన్స్ తో ఆమె మెప్పించింది.
మరో కీలక పాత్రలో నటించిన మిర్ సావర్ కూడా ఆకట్టుకున్నాడు. నవదీప్, అభినవ్ గోమటమ్ తో పాటు సందీప్ రాజ్, అవినాష్ కురువీల్లే తో పాటు మిగిలిన ప్రధాన పాత్రధారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:
సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది. సంగీతంలో మెరుపులు లేవు కానీ కథకు తగ్గట్టు ఉంది. వందేమాతరం వంటి దేశభక్తి గీతం వినేతప్పుడు అంతగా ఆకట్టుకో క పోయినా విజువల్స్ తో చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంది.
హరి కె. వేదాంతం సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రియల్ ఎయిర్ బేస్ లో ఘాట్ చేయడం వలన, ఏరియల్ షాట్స్ లో క్లారిటీ చాలా బాగున్నాయి.
నవీన్ నూలి ఎడిటింగ్ కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంది. VFX షాట్స్ తో పాటు ఎయిర్ బేస్ షాట్స్ కూడా చాలా షార్ప్ గా కట్ అయ్యి సన్నివేశాలు చూడడానికి చాలా బాగున్నాయి.
నిర్మాతలు సందీప్ ముద్దా, సోనీ పిక్చర్స్ నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. సందీప్ చెప్పిన మతలలోనే చూస్తే చాలా తక్కువ ఖర్చు తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రియల్ ఎయిర్ బేస్ లో ఘాట్ చేస్తూ రిచ్ విజువల్స్ తో అద్భుత సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించారు అని చెప్పవచ్చు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :
తెలుగు లో మొదటి సారిగా ‘ఎయిర్ ఫోర్స్’ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. కథలోని కోర్ పాయింట్ దేశ సరిహద్దుల రక్షణలో ఎయిర్ ఫోర్స్ పైలెట్స్ దైర్య సాహసాలు తో పాటు యుద్ద విమానాల మధ్య సాగే యాక్షన్ సన్నివేశాలు అయినా, స్నేహితుల మద్య, భార్య – భర్త మద్య ఎమోషన్స్ చాలా వరకూ బాగానే ఉన్నా సంభాషణలు ( డైలాగ్స్) అంతగా ఆకట్టుకో లేదు అని చెప్పాలి.
ఇంక ఈ సినిమా కి వాడిన విఎఫ్ఎక్స్ వర్క్ అయితే చాలా బాగా ఉంది అని చెప్పవచ్చు. హాలీవుడ్, బాలీవుడ్ లో మొన్ననే వచ్చిన ఫైటర్ ( 300+ కోట్ల బడ్జెట్) తో సమానంగా అతి తక్కువ బడ్జెట్ లో చేయడం నిజంగా హై లైట్ అని చెప్పవచ్చు. స్టార్టింగ్ 20 మినిట్స్ నెమ్మదిగా సాగిన కథనం, లాజిక్ లేని కొన్ని కీలక సన్నివేశాలు వంటి అంశాలు సినిమాని మాస్ ఆడియన్స్ కి దూరం చేస్తుంది.
ఓవరాల్ గా ఎయిర్ ఫోర్స్ యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఇంకా తెలుగు ప్రేక్షకులకు కొత్త ఎక్స్పెరియన్స్ ఇస్తుంది ఈ ఆపరేషన్ వాలెంటైన్ మూవీ.