Operation Ravan Movie Song Launch: ఆపరేషన్ రావణ్” సినిమా నుంచి ‘చందమామ కథలోన..పాట ను విడుదల చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

Operation Ravan Movie Song Launch2 e1691995048978

 

రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “ఆపరేషన్ రావణ్”. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి చందమామ కథలోన అనే లిరికల్ పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారు విడుదల చేశారు. టీమ్ కు తన ఆశిస్సులు అందజేశారు

Operation Ravan Movie Song Launch

శరవణ వాసుదేవన్ సంగీతాన్ని అందించిన ఈ పాటకు పూర్ణాచారి లిరిక్స్ రాయగా..హరి చరణ్, గీతామాధురి పాడారు. చందమామ కథలోన, అందమైన పిల్లేనా, కళ్లముందు కదిలిందా, తుళ్లి తుళ్లి పడ్డానా..అంటూ ప్రేయసి అందాన్ని పొగుడుతూ సాగుతుందీ పాట.

Operation Ravan Movie Song Launch1

ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, తమిళ నటుడు విద్యా సాగర్ ఇతర కీలక పాత్రల్లో నటించడం విశేషం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “ఆపరేషన్ రావణ్” సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

Operation Ravan Movie Song Launch3

నటీనటులు:

రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్, టీవీ5 మూర్తి, కార్తీక్ తదితరులు

సాంకేతిక బృందం :
సంగీతం: శరవణ వాసుదేవన్
డైలాగ్స్: లక్ష్మీ లోహిత్ పూజారి
ఎడిటర్: సత్య గిద్దుటూరి
ఆర్ట్: నాని.టి
ఫైట్స్: స్టంట్ జాషువా
కోరియోగ్రఫీ: జేడీ
ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీపాల్ చొళ్లేటి
పిఆర్ఓ: జి.ఎస్.కె మీడియా
నిర్మాత: ధ్యాన్ అట్లూరి
రచన-దర్శకత్వం: వెంకట సత్య

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *