మూవీ: 105 మినిట్స్ (One Not Five Minuttees)
విడుదల ,డేట్: 26-01-2024,
నటీనటులు: హన్సిక మోత్వానీ,
దర్శకత్వం: రాజు దుస్సా,
నిర్మాత: బొమ్మక శివ,
నిర్మాణ సంస్థ : రు ద్రాన్స్ సెల్యులాయడ్స్ ,
సినిమాటోగ్రాఫర్: కిషోర్ బోయిడపు,
సంగీతం : సామ్ సీఎస్,
ఎడిటర్ : శ్యామ్ వాడవళి.
105 మినిట్స్ మూవీ రివ్యూ (105 Min Movie Review):
ఈ వారం రిపబ్లిక్ డే హాలిడే కలిసి వచ్చినా తెలుగు లో పెద్ద సినిమా రిలీజ్ ఏమి లేక పోవడం వలన అర డజను చిన్న సినిమాలు మరియు రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో గ్లామర్ డాళ్ హన్సిక మోత్వానీ
ప్రధాన పాత్రలో ప్రయోగాత్మక చిత్రంగా 105 మినిట్స్ అనే సిన్మా ఒకే పాత్రతో ఒకే షాట్ అనే కాన్సెప్ట్ తో నిర్మించారు. ఈ పాయింట్ చాలా కొత్తగా అనిపించడం, టిజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచడం తో సినీ ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి.
హన్సిక మోత్వానీ గ్లామర్ కూడా ఈ సినిమాకు ఆకర్షణగా మారడంతో సినీ ప్రేమికులకు చూడాలనే ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. ఇన్ని అంచనాల మధ్య ఈ వన్ నాట్ ఫైవ్ మినిట్స్ (105 Minuttees) చిత్రం ఈ శుక్రవారం దియేటర్స్ లో విడుదల అవుతుండగా, ప్రొడ్యూసర్స్ కి సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకం తో ఓక రోజు ముందుగా అనగా గురువారమే మీడియా కి ప్రీమియర్ షో వేసి చూపించారు. మరి ఈ 105 మినిట్స్ సిన్మా ఎలా ఉందో మా 18F మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకొందామా !

కధ పరిశీలిస్తే (Story Line):
జాను (హన్సిక) అనే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఒక రోజు జాను కారులో ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తున్న టైంలో ఆమె కి దారి పొడవునా ఊహించని దృశ్యాలు కనబడతాయి. దీంతో జాను షాక్ కు గురవుతుంది. తర్వాత ఆమె ఇంటికి వెళ్ళాక కూడా ఓక తెలియని అజ్ఞాత వాయిస్ భయపెడుతూ, జానుని చిత్రహింసలకు గురిచేస్తుంది. ఒక్కో సారీ ఒక్కో రకంగా ఊహాతీతంగా పంచ భూతాలు (భూమి, ఆకాశం, వాయువు, అగ్ని మరియు జలము (వర్షం) సాక్షిగా భయ పెడతారు. ఇంకా ఇంట్లో ఆమె కాలికి గొలుసుతో బంధించి రకరకాలుగా వేధిస్తూ ఉంటుంది.
ఈ చిత్ర హింసలు నుండి తప్పించుకోవాలని జాను ఎంత ప్రయత్నించినా ఆ అజ్ఞాత వాయిస్ (ఆత్మ) విడిచిపెట్టదు. అంతేకాదు ఓ దశలో ఆ ఆత్మ పెట్టే చిత్రహింసలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్టుగా భవిస్యాత్ లో జరగ బోయేది కూడా జానుకి టీవిలో చూపిస్తుంది.
కనిపించని శత్రువు పెట్టె చిత్ర హింసలు భరించలేక నిజంగానే ఆత్మహత్య చేసుకోవడానికి జాను రెడీ అవుతుంది.
ఆసలు జాను ఎవరు? ఎందుకు తను చిత్ర హింసలకు గురి అవుతుంది?
అసలు జానుని చిత్రహింసలు పెడుతున్న అజ్ఞాత వాయిస్ (ఆత్మ) ఎవరిది?
జానునే ఆ అజ్ఞాత వాయిస్ (ఆత్మ) ఎందుకు టార్గెట్ చేసింది?
జానును ఎందుకు బంధించ బడింది? జానును బంధించడానికి కారణం ఏమిటి?
అజ్ఞాత వాయిస్ (ఆత్మ) నుంచి జాను తప్పించుకోవడానికి ప్రయత్నాలు ఎలా చేసింది?
అజ్ఞాత వాయిస్ (ఆత్మ) నుండి ఆమె తప్పించుకొన్నదా?
లేదా టివి లో చూపించినట్టు ఆత్మ హత్య చేసుకొందా ?
చివరకు జాను జీవితానికి ఎలాంటి ముగింపు లభించింది అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలి అంటే వెంటనే 105 మినిట్స్ ఆడుతున్న దియేటర్ క్ వెళ్ళి వెంటనే చూసేయండి.

కధనం పరిశీలిస్తే (Screen – Play):
జాను కారు డ్రైవ్ చేసుకొంటూ వెళ్లే ఓ సీన్‌తో కధనం (స్క్రీన్ – ప్లే ) ఇంట్రెస్టింగ్‌గానే మొదలవుతుంది. దర్శకుడు ఓక కొత్త పాయింట్‌తో కథను రాసుకొని, ఇంటరెస్టింగ్ కధనం తో కధనం సాగదీశాడు. కానీ కధ లో క్లారిటీ లేకపోవడం, ఒకే పాత్ర చుట్టూ కెమెరా తిరగడం కొంత వరకూ బాగానే ఉన్నా, రెగ్యులర్ కధనం తో నడపాటం వలన కొంచెం బోరింగ్ ఫీల్ అవుతారు. కధనం లో కూడా వేరియేషన్స్ లేకపోవడం వల్ల రెగ్యులర్ సస్పెన్స్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.
కానీ సినిమాటోగ్రాఫర్ టెక్నిక్ తో హన్సిక ఫెర్ఫార్మెన్స్‌తో కొన్ని సీన్లుచాలా ఇంటరెస్టింగ్ గా ఉన్నాయి. సినిమా మొత్తం భయం, భాధ తో కూడిన స్ట్రగుల్ తో హన్సిక పాత్ర ఉండటం వలన గ్లామర్ కోరుకొనే కొంత మంది ప్రేక్షకుల కు నచ్చక పోవచ్చు. ఆ ఇంటి లొని అజ్ఞాత వాయిస్ (ఆత్మ) నుంచి తప్పించుకొనే క్రమంలో సీన్లు మరింత కొత్త కధనం తో రాసుకోవాల్సి ఉందనే ఫీలింగ్ కలుగుతుంది.
దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:
దర్శకుడు రాజు దుస్సా వ్రాసుకొన్న పాయింట్ కొత్తగా ఉంది, కానీ దానిని ఆసక్తికర కధనం తో మలచడంలో పూర్తిస్థాయిలో ప్రేక్షకులలో ఉత్కంట రేకెత్తించాడా అంటే కొంచెం అవునని, కొంచెం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే పాత్ర అందులోనూ చాలా తక్కువ డైలాగ్స్ తో సీన్స్ ఉండటం వలన కథనంలో ల్యాగ్ అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు రిపీట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
దర్శకుడిని ఓక రకంగా మెచ్చుకోవచ్చు.. కొత్త పాయింట్ తో డెఫెరెంట్ కధనం తో ప్రయోగం చేశాడు అని చెప్పవచ్చు. సినిమాటోగ్రాఫర్ తో ఎన్నో రోజులు వర్క్ షాప్ చేస్తే కానీ ఇలాంటి షాట్స్ తియ్యలేరు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం చేసినందుకు దర్శకుడిని మెచ్చుకోవచ్చు.
హన్సిక మోత్వానీ తప్ప ఈ సినిమాలో ఎవ్వరూ ఉండరు. ఒకే పాత్ర తో ఒకే షాట్ గా తీశారు కాబట్టి , హన్సిక మోత్వానీ ఒక్కరే మొత్తం సినిమా అంతా తన బుజాలపై మోస్తూ అద్భుతంగా చేసింది. సుమారు రెండు గంటల పాటు ఒకే పాత్ర మీద సినిమా కధని చిత్రీకరిస్తున్నప్పుడు ఆ నటి / నటుడు సరైన నటన కనపరిచకపోతే ప్రేక్షకులు కనీసం చివరి వరకు కూడా థియేటర్లలో కూర్చోడానికి ఇష్టపడరు.
కానీ ఈ సినిమా లో హన్సిక మోత్వానీ చాలా గొప్పగా నటించిది అని చెప్పవచ్చు. సినిమా మొదటి అంకం (ఫస్ట్ పార్ట్) నుండి చివరి అంకం (రెండవ పార్ట్ ) వరకు హన్సికలో భయం, నిస్సహాయత మరియు బాధ మాత్రమే చూపించడంమరో రకంగా బోర్ అని చెప్పాలి. ఎమోషన్ తో పాటు కొంచెం గ్లామర్ / రొమాంటిక్ గా చూపించి ఉంటే యూవ ప్రేక్షకులు కనెక్ట్ ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికి ఆస్కారం ఉండేది.
సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలకు స్క్రీన్ – ప్లే, ఫోటోగ్రఫీ, సంగీతం మరియు ఎడిటింగ్ , నాలుగు మెయిన్ పిల్లర్స్ లాంటివి. ఈ నాలుగు పిల్లర్స్ తమ జాబ్ కరెక్ట్ గా చేస్తే సినిమా రిసల్ట్ అద్భుతంగా ఉంటుంది.
సినిమాటోగ్రాఫర్ కిషోర్ బోయిడపు సినిమాటోగ్రాఫర్ వర్క్ కి మంచి మార్కులే వేయొచ్చు. కొన్ని సీన్స్ అయితే చాలా చక్కగా హై టెక్నికల్ వాల్యూస్ తో తీశాడు. ముఖ్యంగా మాట్లాడుకోవాలి అంటే టన్నెల్ ఎపిసోడ్, రేయన్ ఎఫెక్ట్ సీన్ చాలా బాగా కొంపోజ్ చేశాడు అని చెప్పవచ్చు. 15 to 20 మినిట్స్ లెంత్ షాట్స్ కూడా ఎక్కడ బోర్ లేకుండా లైట్స్ కనపడకుండా 360 డిగ్రీ యాంగిల్స్ లో కెమెరా నడిపిన విధానం బాగుంది.
సంగీత దర్శకుడు సామ్ సి యెస్ kuda కొంతవరకు న్యాయం చేశారని చెప్పొచ్చు. చక్కని విజువల్స్ కి మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కుదిరినట్టు ఉంది.
ఎడిటర్ శ్యామ్ వాడవళి కూడా తన నైపుణ్యం తో చక్కగా ఎడిట్ చేశాడు. షాట్ కి షాట్ కి మధ్య జంప్ తెలియకుండా బాగా ఎడిట్ చేశాడు. కానీ లెన్త్ విశయం లోనే ఇంకా బాగా ట్రిమ్ చేసి ఉండవలసింది. టెక్నికల్ గా 105 మినిట్స్ అన్నారు కానీ ఓపెనింగ్ అండ్ ఎండ్ టైటల్స్ తో కలిపి అల్మోస్ట్ టూ అవర్స్ ఉంది.
నిర్మాణ సంస్థ పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి అని చెప్పవచ్చు. కొన్ని చోట్ల చిన్న చిన్న టెక్నికల్ గ్లిట్స్ ఉన్నా కానీ ఇలాంటి ప్రయోగాత్మక చిత్రాన్ని నిర్మించిన నిర్మాతను మెచ్చుకోక తప్పదు.
18F మూవీస్ టీమ్ ఓపీనియన్ :

మొత్తానికి ఈ ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’ (One Not Five Minuttess) చిత్రం డిఫరెంట్ జోనర్ లో చాలా ప్రయోగాత్మకంగా ఉంది అని చెప్పవచ్చు. డిపరెంట్ సినిమాలు ఇష్ట పడే సినీ లవర్స్ ఈ 105 మినిట్స్ సినిమాలను ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా తోటల గా దియేటర్ ఎక్స్పెరియన్స్ లో చూడవలసిన సినిమా. ఒకే ఒక క్యారెక్టర్ చుట్టూ కొన్ని ఎమోషన్స్‌తో అల్లుకొన్న కథ కాబట్టి ఎంత గొప్పగా తీసినా ఒకే పాత్ర చుట్టూ కథనం తిరుగుతుంది కాబట్టి సినిమా చూసే ప్రేక్షకులకు రెగ్యులర్ సినిమా గా అనిపిస్తుంది.
ప్రతి ప్రేక్షకుడిని టచ్ చేసే అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే పాత్రతో ఓ ఇంటి పరిసరాలలో సాగే సినిమా కాబట్టి.. కొంచెం బోర్ అనిపిస్తుంది. కానీ ఈ సినిమాకు సినిమాటోగ్రఫి,మ్యూజిక్, ఎడిటింగ్ మరియు ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగా కుదిరాయి.
హన్సిక మోత్వానీ తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేసే ప్రయత్నం చేసింది. ఎక్కువగా ఆశించకుండా ఓ ఎక్స్‌పెరిమెంటల్ సినిమా చూడాలి అనుకొనే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఓక సారీ అయితే ట్రై చేయండి.