OMG ( ‘ఓ మంచి ఘోస్ట్’) అంటూ వస్తున్న సినీమా విడుదల ఇప్పుడంటే! 

IMG 20240613 WA0052 e1718254998397

వెన్నెల కిషోర్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్’. హారర్, కామెడీ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఆధరణ ఎప్పుడూ ఉంటుంది. థియేటర్లోనూ, ఓటీటీలోనూ ఈ జానర్‌ సినిమాలను ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు.

ఇక నవ్వించడంలో వెన్నెల కిషోర్, భయపెట్టడంలో నందితా శ్వేత ఎంతగా నటించేస్తుంటారో అందరికీ తెలిసిందే. ఈ సూపర్ కాంబినేషన్ లో మార్క్‌సెట్ నెట్‌వర్క్స్ బ్యానర్‌పై శంకర్ మార్తాండ్ దర్శకత్వంలో ‘ఓ మంచి ఘోస్ట్’ అనే చిత్రం జూన్ 21న రాబోతోంది.

ఈ చిత్రంలో షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, హాస్యనటుడు రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. డా.అబినికా ఇనాబతుని నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం నిర్మించగా.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించారు.

IMG 20240613 WA0054

ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్, లిరికల్ సాంగ్‌, టీజర్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి బజ్ ఏర్పడిన ఈ చిత్రాన్ని జూన్ 21న విడుదల చేయనున్నారు.

ఎన్నో హిట్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన అనూప్ రూబెన్స్ ‘ఓ మంచి ఘోస్ట్‌’కు మంచి ఆర్ఆర్, పాటలు ఇచ్చారు. ఈ చిత్రానికి అనూప్ మ్యూజిక్ ప్లస్ కానుంది. సినిమా అంతా కూడా నవ్విస్తూ, భయపెట్టిస్తూ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేలా కనిపిస్తోంది.

ఇక థియేటర్లో చాలా రోజుల తరువాత వెన్నెల కిషోర్ తన నటనతో అందరినీ నవ్వించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక షకలక శంకర్, రఘుబాబు వంటి ఆర్టిస్టులతో మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

నటీనటులు :

వెన్నెల కిషోర్, నందితా శ్వేత, షకలక శంకర్, నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ్, రఘుబాబు తదితరులు

సాంకేతిక సిబ్బంది :

బ్యానర్: మార్క్‌సెట్ నెట్‌వర్క్‌,ప్రొడ్యూసర్: డా.అబినికా ఇనాబతుని,డైరెక్టర్: శంకర్మా ర్తాండ్,,మ్యూజిక్,డైరెక్టర్:, అనూప్,రూబెన్స్,సినిమాటోగ్రాఫర్: ఐ, ఆండ్రూ,ఆర్ట్,డైరెక్టర్:, సుప్రియ, ఎడిటర్:ఎం.ఆర్.వర్మ,కొరియోగ్రాఫర్: బాబా భాస్కర్,విజువల్ ఎఫెక్ట్స్: విక్టర్, కళ్యాణ్, విజయ్,PRO: SR ప్రమోషన్స్ (సాయి సతీష్),.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *