Om Bheem Bush Movie Review & Rating: సమ్మర్ లో ఛిల్ బ్రోస్ నవ్వుల మంత్రం ఓం భీమ్ బుష్ !

om bheem bush movie review by 18F mivies 6 e1711085319684

చిత్రం: ఓం భీమ్ బుష్ 

విడుదల తేదీ : మార్చి 22, 2024

నటీనటులు: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుంద్, అయేషా ఖాన్, ప్రియా వడ్లమాని, శ్రీ‌కాంత్ అయ్యంగార్ తదితరులు.

దర్శకుడు: శ్రీ హర్ష కొనుగంటి

నిర్మాత: సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్

సంగీత దర్శకులు: స‌న్నీ ఎంఆర్

సినిమాటోగ్రాఫర్‌: రాజ్ తోట

ఎడిటింగ్: విష్ణు వర్షన్ కావూరి

మూవీ: ఓం భీమ్ బుష్ రివ్యూ  (Om Bheem Bush Movie Review) 

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన  హర్రర్ – కామిడీ ఎంటర్టైనర్ ‘ఓం భీమ్ బుష్’ టిజర్ ట్రైలర్ తో ప్రేక్షకులలో చాలా హోప్స్ క్రియేట్ చేసింది. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో మా 18F మూవీస్ టీం    సమీక్ష చదివి తెలుసుకుందామా !

om bheem bush movie review by 18F mivies 2

కధ పరిశీలిస్తే (Story Line): 

క్రిష్ అనబడే కృష్ణ కాంత్ (శ్రీవిష్ణు), వినయ్ గుమ్మడి (ప్రియదర్శి), మాధవ్ రేలంగి (రాహుల్ రామకృష్ణ) మంచి ఫ్రెండ్స్ . కష్టపడకుండా తమకున్న తెలివితో కింగ్స్ లా బతకాలనే కోరికతో  లెగసీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రంజిత్ వినుకొండ (శ్రీకాంత్ అయ్యంగార్) వద్ద పీహెచ్‌డీ చేసి గొప్ప సైంటిస్టుల కావాలని ప్రొపెసర్ ని తమ తెలివితో మెప్పించి-ఒప్పించి జాయిన్ అవుతారు.

యూనివర్సిటీలో జాయిన్ అయిన రెండవ రోజునుండే వారు తమ పిచ్చి అల్లరి చిల్లరి పనులతో కొన్ని సంవత్శరాలు గడిపేస్తారు. వారి అల్లరి, పిచ్చి చేష్టలు భరించలేని  ప్రొఫెసర్ రంజిత్, వాళ్ళ తరుపున తానే ఎగ్జామ్స్ రాసి సర్టిఫికేట్స్ ఇచ్చి యూనివర్సిటీ నుండి పంపించేస్తారు. దాంతో బ్యాంగ్ బ్రోస్ ముగ్గురూ  వినయ్ గుమ్మడి ఊరు వెళ్దాము అని డిసైడ్ అయ్యి ప్రయాణిస్తూ మధ్యలో  భైరవపురం అనే ఊర్లో ఓ పాడుపడిన బంగ్లాలో క్షుద్ర పూజలు చేసే బైరాగి (షాన్ కక్కర్) గ్రూప్‌ను చూస్తారు.

ఆ భైరగి మనుషులు క్షుద్ర పూజలతో ఊరి ప్రజలకు చేస్తున్న గుప్త నిధుల అన్వేషణ, భూత ప్రేతాత్మలను భందించడం వంటి పనులు చూసి అలాంటివి తమ తెలివి తో పాటు చదివిన సైన్స్ అండ్ టెక్నాలజీ ని జోడించి ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని  ఆ గ్రామంలో బ్యాంగ్ బ్రో A to Z సొల్యూషన్ అనే ఏజెన్సీ పెడుతారు.

తర్వాత కధలో జరిగే కొన్ని అనుకోని మలుపులతో భైరవ పురం ఊరి సర్పంచ్ తోను, బైరాగులు తోను సవాల్ చేసి ఊర్లో పాడుబడిన బంగ్లాలో నివసించే సంపంగి అనే దెయ్యాన్ని వెళ్లగొట్టి అక్కడ ఉన్న వేల కోట్లు విలువచేసే గుప్త నిధులు తీసుకు వస్తామని బంగ్లా లోకి వెళతారు. ఈ కధలో ఇంకా ..

బ్యాంగ్ బ్రో’ స్ ని ప్రొఫెసర్ ఎందుకు వర్సిటీ నుంచి ఎందుకు తరిమివేశాడు?

భైరవపురం వెళ్లే క్రమంలో పాడుబడ్డ బంగ్లాలో జరిగిన సంఘటనలు ఏమిటి? 

భైరగుల క్షుద్ర పూజలు వారి జీవితాలను ఎలా మలుపు తిప్పాయి?

ఊర్లో  బ్యాంగ్ బ్రోస్  ముగ్గురిని దేవుళ్లుగా కొలిచేలా వారు ఏం చేశారు?

గ్రామానికి పట్టి పీడించే సంపంగి  అసలు కధ ఏమిటి ?

పాడుబడ్డ బంగళాలో నిధుల కోసం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది?,

  బంగ్లాలోకి వెళ్లిన ఆ ముగ్గురికి సంపంగి నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?

పిశాఛి సంపంగిని ఈ  బ్యాంగ్ బ్రోస్ త్రయం వస పరుచుకొన్నారా ?

ఆ ఊరికి సంపంగి నుంచి వచ్చే కష్టాలు తొలిగాయా?

గ్రామ సర్పంచ్ ఛాలెంజ్‌ గెలిచి జలజ (ప్రీతి ముకుందన్)ను పెళ్లి చేసుకొన్నాడా?

అనే ప్రశ్నలు ఇంటరెస్ట్ గా ఉంది వాటికి సమాధాలు తెలుసుకోవాలి అంటే వెంటనే ఓం భీమ్ బుష్ సినిమా దియేటర్ కి వెళ్ళి చూసేయండి. అప్పటివరకూ మా సమీక్ష చదివి కొంచెం తెలుసుకోండి.

om bheem bush movie review by 18F mivies 1

కధనం పరిశీలిస్తే (Screen – Play):

ఓం భీమ్ బుష్ సినిమా కధ లో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఉన్నప్పటికీ, ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు శ్రీహర్ష కోనుగంటి కొన్ని చోట్ల తడబడ్డాడు. కొన్ని సీన్స్ రొటీన్ ఫార్ములా లో సాగడం వలన కొన్ని సీన్స్ స్లో గా సాగినట్టు అనిపించింది. టెక్నికల్ గా, వెరే సినిమా తో పోల్చిచూస్తే కొన్ని సీన్స్ స్లో అనిపిస్తాయి తప్ప సామాన్య ప్రేక్షకుడిగా సినిమా చూస్తుంటే చాలా సీన్స్ కి మనకు తెలియకుండానే క్లాప్స్, విజిల్స్ పడతాయి.

సినిమా కధనం (స్క్రీన్ ప్లే) ఫుల్ ఫన్ తో రోలర్ కోస్టర్ రైడ్ లా సాగింది. కొన్ని సీన్స్ హై కి తీసికెళ్తే ఒకటి రెండు సీన్స్ మాత్రం స్లో గా సాగాయి.  అలాగే, సినిమాలో లాజిక్స్ ఆశించకుండా చూస్తే దర్శకుడి కధ – కధనం ( స్క్రీన్ – ప్లే)  రైటింగ్ లో ఫుల్ మ్యాజిక్ కనిపిస్తుంది.

నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని ముందే మనకు మూవీ మేకర్స్ చెప్పినా, కొన్ని కీలక సన్నివేశాలను లాజికల్ గా నే వ్రాసుకోవడం తో ఏది మ్యాజిక్ ఏది లాజిక్ అనేది అర్దం కానీ అయోమయం లో ప్రేక్షకుడు ఉండిపోతాడు. దర్శకుడు పూర్తిగా బ్రోస్ సినిమా కధ గానే కధనాన్ని నడపడం వలన హీరోహీరోయిన్ల మధ్య ప్రేమకు సంబంధించిన ట్రాక్ కు పెద్దగా స్కోప్ లేదు.

om bheem bush movie review by 18F mivies 5

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి వ్రాసుకొన్న కథలో ఫుల్ కామెడీని మెయింటైన్ చేసినప్పటికీ, ఆదే  జోష్ కోసం దర్శకుడు కొన్ని సీన్స్ ని రొటీన్ సినిమాటిక్ వే లో వ్రాసుకోవడం వలన కొత్త దనం తో కూడిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్  కంటిన్యూ చేయలేకపోయాడు. కాకపోతే కధ కోసం తీసుకొన్న పాయింట్ ఈ మధ్యకాలం లో వెండి తెరమీద చూడనిది, విననది.

‘ఓం భీమ్ బుష్’ సినిమాలో కామెడీ సీక్వెన్సెస్ హైలైట్ గా నిలిచాయి.ఇప్పుడు ఆ పాయింట్, సీన్స్ గురించి మా సమీక్షలో వ్రాస్తే ఫస్ట్ టైమ్ చూసే సినిమా ప్రేక్షకుడి థ్రిల్ మిస్ అవుతారు కాబట్టి ఇక్కడ ఇంతకంటే ఎక్కువ కధలోకి వెళ్ళకుండా రాస్తున్నాను.  ఇలాంటి ఆలోచనతో దర్శకుడు కధ, పాత్రలు రావడం ఓక ఎత్తు ఐతే, ఈ పాత్రలకు జీవం పోసే నటులు దొరకడం మరో హై.

ఇక నటుల గురించి మొదలు పెడితే  మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ టైమింగ్ తో చాలా బాగా అలరించారు. వారి నటన తో ఈ సినిమా కధ బాగా పండింది అని చెప్పవచ్చు.

శ్రీ విష్ణు తన బాడీ లాంగ్వేజ్ తో పాటు తన మాడ్యులేషన్ తో కూడా మెప్పించాడు. కృష్ణకాంత్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. క్రిష్ పాత్ర కోసం శ్రీ విష్ణు నోటినుంచి వచ్చిన కొన్ని వాడిక భాషలోని పదాలు కొంచెం శృతి మించినా పాత్ర స్వభావం తో చూస్తే ఒకే అనిపిస్తాయి, ఇంస్టెంట్ కామిడీ వన్ లైనర్ గా మిగిలిపోతాయి.

om bheem bush movie review by 18F mivies 10 e1711085403563

శ్రీ విష్ణు హీరోఇజం అనేది పక్కన పెట్టి పాత్ర కోసం నటిస్తూ,  సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఒకటి రెండు సీన్స్ లో కోర్ ఎమోషన్నికూడా  తన హావభావాలతోనే నటించి మెప్పించాడు.

ముఖ్యంగా సినిమాలో కృష్ణ కాంత్ (‘శ్రీ విష్ణు) వినయ్ గుమ్మడి (ప్రియదర్శి) మదన్ రేలంగి (రాహుల్ రామకృష్ణ) ల మధ్య వచ్చే పంచ్ లు పేలాయి. అన్ని సీన్స్ లోను ట్రయో కనిపించి నవ్వులు పీయించారు. రెండవ అంకం (సెకండ్ హాఫ్) లో వీరి కాంబినేషన్ లో వచ్చే హారర్ సీన్స్ బాగున్నాయి.

హీరోయిన్ ప్రీతి ముకుందన్ కూడా బాగానే నటించింది. కాకపోతే ఆమె పాత్రకు పెద్దగా నిడివి లేదు. ఉన్నంతలో చక్కగా కనిపించింది.

om bheem bush movie review by 18F mivies 7

ప్రియదర్శికి జోడిగా నటించిన మరో హీరోయిన్ రత్తాలు (అయేషా ఖాన్) తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ఓ స్పెషల్ సాంగ్ లో మెరిసిన ప్రియా వడ్లమాని ఆకట్టుకుంది.

మిగిలిన నటులగురించి చూస్తే,  సునైనా, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.

ఇక సంపంగి పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన ట్రాక్.. అలాగే నిధితో ముడి పడిన సీన్స్.. మరియు సంపంగితో పాటు మిగిలిన పాత్రలు.. మొత్తానికి ఈ సినిమాలో కొన్ని కామెడీ ఎలిమెంట్స్ బాగా మెప్పించాయి

om bheem bush movie review by 18F mivies

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే:

ఓం భీమ్ బుష్ సిన్మా టెక్నికల్ గా చూసుకుంటే సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది.

 మ్యూజిక్ డైరెక్టర్ స‌న్నీ ఎంఆర్ సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. పాటలు క్యాచి ట్యూన్స్ లేకపోయినా దియేటర్ లో విజువల్స్ తో పాటు ఆకట్టుకొన్నాయి. BGM ఇంకా బెటర్ గా ట్రై చేసి ఉంటే బాగుణ్ణు.

డిఓపి రాజ్ తోట సినిమాటోగ్రఫీ వర్క్ అయితే సినిమాకి హైలైట్ గా నిలిచింది. నైట్ ఎఫెక్ట్ షాట్స్ మరియు హర్రర్ సీన్స్ లో అయితే నవ్విస్తూ భయపెట్టారు. ఆర్ట్ వర్క్ కూడా పోటోగ్రఫీ కి బాగా ప్లస్ అయ్యింది.

ఎడిటర్ విష్ణు వర్షన్ కావూరి ఎడిటింగ్ సినిమాకి తగ్గట్టు ఉంది. క్రిష్పి  కట్స్ వలన కామిక్ టైమింగ్ కానీ హర్రర్ ఎలిమెంట్స్ కానీ ఇంప్రస్సావ్ గా ఉన్నాయి.

నిర్మాతలు సునీల్ బలుసు, వి సెల్యులాయిడ్స్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. చిన్న సినిమా లాజిక్ లెస్ మైండ్ లెస్ కధ అనుకోకుండా కధను నమ్మి క్వాలిటి గా నిర్మించడం గ్రేట్ అని చెప్పవచ్చు.

om bheem bush movie review by 18F mivies 8

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

అప్పట్లో బ్రోచేవారెవరు !  అంటూ హిలాయారియస్ కామిడీ ని పంచిన ట్రయో శ్రీ విష్ణు – ప్రియదర్శి – రాహుల్ మరలా ఇప్పుడు బాంగ్ బ్రోస్ గా మారి   ‘ఓం భీమ్ బుష్’ అంటూ వచ్చిన ఈ సిన్మా కాన్సెప్ట్, కామెడీ సీక్వెన్సెస్ బ్యాక్ డ్రాప్ కరెక్ట్ గా సెట్ అయ్యాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా  ‘శ్రీవిష్ణు – ప్రియదర్శి – రాహుల్ రామకృష్ణ’లు పాత్రలలో విలీనం  అలాగే, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. ఇంకా రాహుల్ ఫేస్ కనబడితేనే హాల్ లో నవ్వులు జల్లులు పడుతున్నాయి అంటే తను అంత బాగా నటించి మెప్పించాడు అని చెప్పవచ్చు.

అయితే, రెండవ అంకం లో ముఖ్యంగా దెయ్యం తో డేటింగ్ ఐడియా బాగున్నా అవే సీన్స్ కొంచెం స్లో అనిపించింది. మొదటి అంకం లో కూడా కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, చివరాకరకు మైండ్ లెస్ కామిడీ ఎంజాయ్ చేసిన ప్రేక్షకుడికి   క్లైమాక్స్ లాజికల్ గా రొటీన్ గా సాగడం తో ఎంతో ఆశించిన వారికి ఇంతేనా అనిపిస్తుంది. అన్ని మర్చిపోతే అయిగా నువవుకొంటూ వన్ లైనర్ డైలాగ్స్ నెమరు వేసుకొంటూ హాలు బయటికి రావచ్చు.

బ్యాంగ్ బ్రోస్ కి మంచి విందు బోజనం లాంటి కామెడీ ఎలిమెంట్స్ తో పాటు కొన్ని బోల్డ్ షాట్స్  యువతను సినిమా దియేటర్స్ కి రప్పించే ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. ఓవరాల్ గా ఈ చిత్రం యూత్ ని, కామెడీ కోరుకొనే ప్రేక్షకులతో పాటు అందరినీ బాగా ఆకట్టుకుంటుంది. ఇలాంటి వన్ లైనర్ కామిక్ జోక్స్ అందరితో కలిసి దియేటర్ లో బాగా ఎంజాయ్ చేయవచ్చు. డోంట్ మిస్ ఈట్ ఓం భీమ్ బుష్ ఇన్ దియేటర్స్ . 

om bheem bush movie review by 18F mivies 4

 

చివరి మాట: బ్రోస్ దెయ్యం తో డేటింగ్ ఐడియా కేక !

18F RATING: 3.25  / 5

   * కృష్ణ ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *