Okkade No 1 Movie Song launch: ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ చేతుల మీదుగా‘ ఒక్కడే నెం.1 పాట విడుదల.

IMG 20230913 WA0043

 

క్లాసిక్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ పారిశ్రామికవేత్త తల్లాడ వెంకన్న హీరోగా నటించిన చిత్రం ‘ఒక్కడే 1’. సుదిక్షా,సునీత,, మధువని కథానాయికలుగా నటించగా, శ్రీపాద రామచంద్రరావు దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా లోని ఓ పవర్ ఫుల్ పోలీస్ పాటను ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ ఆవిష్కరించారు.

IMG 20230913 WA0045

ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ“ఎన్టీఆర్, చిరంజీవి వంటి స్టార్స్ పోలీస్ పాత్రల్లో మెప్పించారు. అలాగే వెంకన్నగారు కూడా పోలీస్‌ ఆఫీసర్‌ కారెక్టర్ లో కనిపిస్తున్నారు. ఎవ్వరి మీద ఆధారపడకుండా., వెంకన్నగారు హీరోగా నటిస్తూ సినిమా నిర్మించడం.. అందులోనూ సిన్సియర్‌ పోలీస్‌ క్యారెక్టర్‌ చేయడం అభినందనీయం. ఇప్పుడు ప్రదర్శించిన పాటకూడా చాలా బాగుంది. సంగీతం, సాహిత్యం, కొరియోగ్రఫీ, కెమెరా వర్క్‌ అద్భుతంగా ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను అకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. “అని అన్నారు.

IMG 20230913 WA0042

 

చిత్ర హీరో వెంకన్న మాట్లాడుతూ…ముందుగా మా కోరికను మన్నించి మా పాటను ఆవిష్కరించిన ప్రసన్న కుమార్ గారికి , రామసత్యనారాయణ గారికి నా ధన్యవాదాలు. నాకు పోలీస్‌ ఆఫీసర్‌ కావాలని చాలా బలమైన కోరిక ఉండేది. కానీ కొన్ని అనివార్య కారణాలవలన కాలేక పోయాను. ఇప్పుడు ఈ సినిమా ద్వారా ఆ కోరిక తీర్చుకుంటున్నా. ట్రైలర్‌లో మీరు చూసింది చాలా తక్కువ. సినిమాలో ఇంకా చాలా మంచి కంటెంట్‌, ట్విస్ట్‌లు ఉంటాయి. ఈ వయస్సులో నేను హీరోగా చేయడం ఏంటి అనుకోలేదు.

మన టాలీవుడ్‌ సీనియర్‌ హీరోలను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేశాను. దర్శకుడు శ్రీపాద రామచంద్రరావు గారు బాగా డీల్‌ చేశారు . ఈ సినిమాను హిందీ, కన్నడ, తమిళ్‌, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. యూనిట్‌ అందరం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అన్నారు.

IMG 20230913 WA0044

తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ…వెంకన్నగారిలో ఇంత ప్యాషన్‌ ఉందని నేను ఊహించలేదు. ఖచ్చితంగా మంచి నటుడు అవుతారు. చిన్న బడ్జెట్‌తో పెద్ద సినిమా తీశారు. ఆయన నాతో అన్నట్టు సక్సెస్‌ అవుతున్న 5 శాతం మందిలో ఈయన కూడా ఉంటారు. పాటలు, సంగీతం, కొరియోగ్రఫీ చాలా బాగుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.

సాంకేతిక వర్గం: 

ఈ చిత్రానికి ఎడిటర్‌: నందమూరి హరి`యన్‌.టి.ఆర్‌, సంగీతం: రామ్‌ తవ్వా, కొరియోగ్రఫీ: సాగర్‌ వేలూరు, లిరిక్స్‌: శ్రీనివాస్‌, ఫైట్స్‌: రాజ్‌కుమార్‌, కృష్ణంరాజు, శ్యాం, కెమెరా: డి. యాదగిరి, ఆర్‌.ఆర్‌. చిన్నా (చెన్నై), వి.ఎఫ్‌.ఎక్స్‌: చందు ఆది Ê టీమ్‌, పి.ఆర్‌.ఓ: బి. వీరబాబు, నిర్మాతలు తల్లాడ శ్రీలక్ష్మి, తల్లాడ సునీల్‌, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీపాద రామచంద్రరావు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *