‘ఒక పథకం ప్రకారం’ సక్సెస్ మీట్‌లో హీరో సాయి రామ్ శంకర్ !

IMG 20250208 WA0143 e1739020471707

సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు సాయి రామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఒక పథకం ప్రకారం’. వినోద్ విహాన్ ఫిల్మ్స్ – విహారి సినిమా హౌస్ ప్రై.లి. బ్యానర్స్ మీద గార్లపాటి రమేష్ తో కలిసి దర్శకుడు వినోద్ కుమార్ విజయన్ నిర్మించారు .

ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీలక్ష్మి ఫిలిమ్స్‌పై బాపిరాజు ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. సినిమాకు వస్తున్న స్పందన పట్ల యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన ఆఫర్‌తో సినిమా మీద అందరికీ ఆసక్తి ఏర్పడింది. దీంతో సినిమాకు మంచి ఓపెనింగ్ వచ్చాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి వస్తున్న ఆదరణను చూసిన చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన ప్రీమియర్ షోలో 18 మంది మీడియా సభ్యులు విలన్ ఎవరనేది ఇంటర్వెల్ కంటే ముందు సీక్రెట్ చిట్స్ ద్వారా తెలిపారు.

ఒక్కొక్కరికీ వెయ్యి రూపాయల చొప్పున 18 వేల రూపాయలను దర్శక నిర్మాతలు ఇచ్చారు.

IMG 20250208 WA0142

హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.. ‘‘ఒక పథకం ప్రకారం’ సినిమాను చాలా చోట్ల రిలీజ్ చేశారు. చూసిన ప్రతీ ఒక్కరూ అద్భుతంగా ఉందని అంటున్నారు. మేం అనుకున్నట్టుగానే అందరికీ రీచ్ అయింది. సముద్రఖని పాత్రకు అందరూ కనెక్ట్ అవుతున్నారు. పెద్ద ఓపెనింగ్స్ అని చెప్పను గానీ.. మా కథ, మా సినిమా బలంగా ఉందని చెప్పగలను.

మా మూవీని చూసిన వారంతా మెచ్చుకుంటున్నారు. ఇకపై మీడియా సపోర్ట్ చేసి మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మా అందరికీ ఈ సినిమాతో గుర్తింపు వచ్చింది. విలన్‌ను కనిపెడితే పది వేలు ఇస్తామని ప్రకటించాం. చాలా చోట్ల లక్కీ డిప్ ద్వారా ఆడియెన్స్‌కు డబ్బులు ఇచ్చాం. ప్రేక్షకుల దగ్గరకు మా సినిమాను మరింతగా తీసుకెళ్లేందుకు మీడియా సహకరించాలి’’ అని అన్నారు.

దర్శక, నిర్మాత వినోద్ విజయన్ మాట్లాడుతూ.. ‘‘ఒక పథకం ప్రకారం’ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అన్ని చోట్ల నుంచి మాకు ఆదరణ లభిస్తోంది. మీడియా మరింతగా సపోర్ట్ చేస్తూ మా సినిమాను ఆడియెన్స్ వద్దకు తీసుకెళ్లాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత గార్లపాటి రమేష్ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *