ఓ భామ అయ్యో రామ – “ప్రేమ వాకిలిలో ఓ రామున్ని మలిచిన భామ కథ”

InShot 20250711 140915471 e1752226495878

18F Movies సమీక్ష : ఓ భామ అయ్యో రామ

 1.పరిచయం:

ఓ భామ… అయ్యో రామ!

పేరులోనే ఉన్నదీ వెతుకు వ్యథ, నవ్వుల మధ్య నిండిన నిస్సహాయత.

సుహాస్ వెండితెర జర్నీ చూస్తే.. కలర్ ఫోటో నుంచి ఉప్పు కప్పురంబు వరకూ నటుడిగా జీవితపు ఒత్తిడి నుంచి ఉన్నత శిఖరం వైపు వేస్తున్న అడుగులు..(ఒక్కో సినిమా తో) యూట్యూబ్ తాడు పట్టుకొని నిలిచి సాధించు కుంటూ హీరోగా ఎదిగి

ఇప్పుడు “ఓ భామ అయ్యో రామ”అంటూ తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించాడు మా 18F మూవీస్ మీడియా టీం రివ్యూ చదివి తెలుసుకుందామా.. !

30dlpt
2.కథ – కథనం:

.రామ్ (సుహాస్) చిన్నప్పుడే తల్లి చనిపోతుంది. దీంతో మేనమామ (అలీ) దగ్గర పెరిగి పెద్దవాడవుతాడు. మేనమామకు కూడా తన మేనల్లుడు జీవితంలో సెటిల్ కావాలన్నదే కోరికగా ఉంటుంది.

ఈ క్రమంలో రామ్ కు ఓ రోజు సత్యభామ (మాళశిక మనోజ్) తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తూ యాక్సిడెంట్ చేస్తుంది. దీంతో రామ్ అతన్ని ఆమె ఇంట్లో సురక్షితంగా చేరుస్తాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య బాండింగ్ ఏర్పడుతుంది.

అదే సమయంలో సత్యభామ తండ్రి (పృథ్వీ) ఆమెకు ఓ ఎన్ఆర్ఐ సంబంధం చూస్తాడు. ఈ క్రమంలో సత్యభామ రోడ్డు ప్రమాదంలో గాయపడుతుంది.

ఆ తర్వాత ఏం జరిగింది. వీరి ప్రేమ ఫలించిందా.. ?

చివరకు వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది.?

 రామ్ కు చిన్నప్పటి నుంచి కొన్ని చేదు జ్ఞాపకాలు కు కారణం ఏంటి?

 ఆ చేదు జ్ఞాపకాలకు కథానాయికి కి ఏమైనా సంబంధం ఉందా? 

అనేదే మిగిలిన మూవీ స్టోరీ

ఆమె సత్యం చెప్తుంది, అతడు కలలు కంటాడు.

ఆమె జీవితాన్ని గణితం చేస్తే, అతడు కవిత్వం చేస్తాడు.

ఇద్దరి మధ్య ఈ భావ ప్రపంచాల ఘర్షణే ఈ సినిమా గుండె తడిపే మూలతత్వం.

ప్రేమలోని తియ్యతనాన్ని మాత్రమే కాదు… విస్మృతి, ఒంటరితనాన్ని కూడా చూపించ గలిగిన కథ. చివర్లో ఒక రియర్ ట్విస్ట్ ప్రేక్షకుడి మానసిక స్థితిని ఊహించని దారిలోకి తీసుకెళుతుంది. ఇది ఓ ట్రాజెడీ కాదు, ఓ నిజాయితీతో కూడిన ప్రేమ కథ.

3. దర్శకుడు, నటుల ప్రతిభ:

రామ్ గోదల – తక్కువ మలుపులతో ఎక్కువ భావాలను పండించిన తీరు మెచ్చుకోదగ్గది. ఒక ప్రేమ కథను హాస్యంతో కాకుండా, హృదయంతో చెప్పడమంటేనే ధైర్యం కావాలి.

సుహాస్ – అతని అభినయం… సైలెన్స్‌లో పలికే మాట. ఒకటో రెండు చోట్ల ఎమోషన్లు కాస్త మిగిలిపోతున్నా, చాలాచోట్ల కళ్లతోనే గుండె మాట చెప్పాడు.

మాల్వికా మనోజ్ – ఓ మోడర్న్ యువతి పాత్రలో జీవించింది. తానెవరికి అవసరమో తెలిసిన, తన ప్రేమని తన భాషలోనే చెప్పగల అమ్మాయిగా మెప్పించింది. కెమెరా ముందు కొత్తదనాన్ని మించి ఆత్మను నిండించింది.

అలీ – అతని పాత్ర చిన్నదైనా, అతని భావావేశం పెద్దదిగా నిలుస్తుంది. ఓ మేనల్లుడి మాయం నెపథ్యంలో నటనలో నిజాన్ని నింపాడు.

 4.సాంకేతిక నిపుణుల కృషి:

🎶 సంగీతం – రధన్:

“నీవే నా నేలవేడి…” లాంటి పాటలు మనసు తడిపే మెలోడీలు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్‌ను మృదువుగా మలచింది.

🎥 సినిమాటోగ్రఫీ – మణికందన్:

రెండు హృదయాల మధ్య దూరాన్ని ఫ్రేముల్లో చూపగలిగాడు. వర్షం పడుతున్న వీధి… నిస్సహాయంగా నిలబడిన రామ్… కవిత్వమై కనిపిస్తుంది.

✂️ ఎడిటింగ్భావన్  షా మొదటి లొ నిదానంగా మొదలెట్టి మధ్యలో మరలా పేస్ కొద్దిగా నిదానించగా, క్లైమాక్స్‌కు సమీపంలో మళ్లీ ప్రాణం పోసిన విధానం బాగుంది.

 18F మూవీస్ టీం ఒపీనియన్:

ఈ సినిమా ప్రేమ కథల్లో కొత్త కోణాన్ని చూపించదలచుకుంది. “ఎవరు మనల్ని ప్రేమిస్తున్నారన్నద, మన ప్రేమలో ఎంత నిజం ఉంది?” అనే ప్రశ్నను మన ముందుంచుతుంది.

కోన్నిచోట్ల తక్కువ యాక్టివిటీ ఉన్నా, భావప్రధానత అధికంగా ఉంది. మాస్‌కి కాకపోయినా, భావజాలం తెలిసిన వారికి మాత్రం నిస్సందేహంగా హృదయ హారతిగా నిలుస్తుంది.

🎯 చివరాఖరకు ముగింపు:

“ఓ భామ అయ్యో రామ” – ఒక హాస్య ప్రధాన ప్రేమకథ అనిపించినా, ఇది అసలు లోతైన మానసిక ప్రేమ పోరాటం. ఓరే, ఆమె రాలేదు కదా… అన్న మౌనం అంతం అయిన చోటే ఈ సినిమా మొదలవుతుంది!

ప్రేమలో మునిగే వారితో పాటు,  ఫ్యామిలీ అందరూ కలిసి చూసి ఎంజాయ్ చేసే పెద్ద ఎమోషనల్ కథ ఉన్న చిన్న సినిమా…

రేటింగ్: 2.75 / 5

  * కృష్ణ ప్రగడ. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *