‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ తో పాన్ ఇండియా సినిమా ‘దేవర’ చేస్తున్న స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, దేవర సినిమా ని అనుకొన్న టైమ్ కంటే ఎక్కువ టైమ్ షూటింగ్ కి తీసుకొంటూ ఎందుకు డిలే చేస్తున్నాడా అని ఎన్ టి ఆర్ ఫాన్స్ చాలా భాధ పడిపోతున్నారు. ఇప్పటి వరకూ ఎంత భాగం షూటింగ్ పూర్తి చేసుకుందో కూడా తెలియదు. దేవర ని రెండు పార్టులుగా రిలీజ్ చేస్తాము అని దర్శకుడు చెప్పినప్పటినుండి, ఫాన్స్ లో ఎనర్జీ వచ్చినా సినిమా లేట్ ని తట్టుకో లేకపోతున్నారు.
ఐతే, ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా క్లైమాక్స్ షూట్ ను స్టార్ట్ చేయబోతున్నారని తెలిసింది. ఈ రోజు ఎన్ టి ఆర్ గోవా కి బయలుదేరి వెళ్లారు. గోవా లో కొన్ని క్లైమాక్స్ కి సంభందించిన ఎక్స్టేరియల్ షాట్స్ తీసి వచ్చే నెల సెట్స్ లో క్లైమాక్స్ చేయడానికి ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్లైమాక్స్ ఘాట్ లో సైఫ్ అలీఖాన్ – ఎన్టీఆర్ లు కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ రెండు పార్టులు కలిపి ఒకే సారీ షూటింగ్ చేస్తున్నారా అన్న అనుమానం కొంతమంది ఫాన్స్ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
కాగా దేవర కథ సముద్రం నేపథ్యంలో జరుగుతుందనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కర్ని ఆశ్చర్యానికి గురిచేస్తుందట. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ కూడా అదిరిపోతోందట. అందుకు తగ్గట్టుగానే తన పాత్ర కోసం తారక్ కూడా డిఫరెంట్ మేకోవర్ ట్రై చేశాడు.
మొత్తానికి ఈ సినిమా కోసం కొరటాల కూడా బాగా కసరత్తులు చేశాడు. ఇప్పటికే, ఎన్టీఆర్ – కొరటాల కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పెద్ద హిట్ కావడంతో ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. దేవర మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది.
దేవర కి జోడీగా శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వి కపూర్ నటిస్తుంది. ఈ దేవర సినిమా జాన్వి కి సౌత్ ఇండస్ట్రి లో మొదటి సినిమా. దేవర యొక్క ఇతర అప్ డేట్స్ కోసం మా 18fms.com ఫాలో అవుతూ ఉండండి.