అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం సుకుమార్ రైటింగ్ మీద నమ్మకం తో రఫ్ గెటప్ గెడ్డంతో లారీ నడుపుతూ స్మగ్లర్ లా నటించాడు. మరి ఇప్పుడు నితిన్ అలానే రఫ్ గెటప్ గెడ్డంతో మరేడిమిల్లి అడవులలో ఏమి చేస్తున్నాడు ?
ఇలా నితిన్ గెడ్డం తో నటిస్తున్న సినిమా ఎవరి కోసం అని రాయాగానే మా సినీ జనాలకు గుర్తు వచ్చేది పుష్ప సినిమా కోసం అంటారా ?
కాదు కాదు, ఈ సంగతులు పుష్ప సినిమా గురించి కాదు. నితిన్ హీరోగా వక్కంతం వంశీ తీస్తున్న కొత్త సినిమా సంగతులు. మొన్ననే ఒక సెడ్యూల్ మారేడిమిల్లి అడవిలో స్టార్ట్ అయ్యింది.
వక్కంతం వంశీ కథల్లో ఇప్పటికే తెలుగు లో హిట్ అయిన సినిమా కధల పాత్రలు ఉంటాయి అనేది తాను రాసిన లేక తీసిన గత చిత్రాలు చూస్తే తెలుస్తుంది. గతం లో వచ్చేసిన సినిమా కథలు ఛాయలు వుంటాయన్న సినీ ప్రేక్షకులకు తెలుసు.
అవి ఏమిటి అంటే రవితేజ కిక్ లో అర్జున్ జెంటిల్ మన్, అల్లు అర్జున్ సినిమా నా పేరు సూర్యలో వజ్రం సినిమా గురుతులు వుంటాయి.
అలానే ఇప్పుడు నితిన్ తో చేయబోతున్న సినిమాలో అల్లు అర్జున్ పుష్ప గురుతులు వుంటాయో, వుండవో కానీ ప్రస్తుతం చెప్పలేము కానీ మారేడుమిల్లిలో ఘాట్ చేస్తున్నది అలాంటి ఎపిసోడ్ నే అని మా ప్రతినిధి మాకు పంపిన సమాచారం .
.
ఆ ఒక్క ఎపిసోడ్ చిత్రీకరణ తో నే సినిమా మొత్తం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పడం మా ఉద్దేశం కాదు. కానీ ఈ న్యూస్ మాకు వచ్చినట్టే ఇతర రేపోర్టర్స్ కి కూడా వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియా లో ఇదే టాపిక్ తో చర్చ జరుగుతుంది.
కానీ మాకు అందిన సమాచారం ఏంటంటే ఈ ఎపిసోడ్ మాత్రమే ఇలా వుంటుందని, మిగిలిన సినిమా కథ వేరు అని తెలుస్తోంది. ఈ ఓక్క సీన్ కోసమే హీరో గెడ్డం పెంచాడనిఇన్ సైడ్ యూనిట్ సబ్యుల టాక్.
మొత్తంచాలా రోజుల తర్వాత వక్కంతం వంశీ మెగా ఫోన్ పట్టుకొని డైరెక్టర్ సీట్ లో కుర్చీని నితిన్ కి యాక్షన్ చెప్పేస్తున్నాడు. మరి రెండు మూడు రోజులు అరకు అడవుల్లో ఫస్ట్ షెడ్యూలు పూర్తి చేసి సినిమా యూనిట్ ని నెక్స్ట్ సెడ్యూల్ కోసం హైదరాబాద్ కు షిప్ట్ చేస్తారు ఆట.
ఈ గెడ్డం గెటప్ ఓన్లీ కొన్ని సీన్ లకు మాత్రమే అంటూ, తరువాత కథ వేరేలా ఉంటుంది అని చెప్తున్నారు. చూద్దాం ఈ గెడ్డం ఎపిసోడ్ మెయిన్ కధ కు లింకు ఏమిటి అన్నది తెలియాల్సి వుంది.
ఈ వక్కంతం వంశీ – నితిన్ సినిమా కు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు మరియు నితిన్ హోమ్ బ్యానర్ శ్రేస్టా మూవీస్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు, మిగిలిన నటి నటులు, సాంకేతిక వర్గం వివరాలు తెలియాలి.