Nithin – Dilraju combo 3Rd Movie Tittle & First look Unveils: హీరో నితిన్ బర్త్ డే స్పెషల్ గా ‘తమ్ముడు’ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ లోగో విడుదల !

IMG 20240330 WA0025 e1711779654574

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టకుున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యానర్ నుంచి క్రేజీ కాంబినేషన్‌లో ఎంటర్‌టైనర్ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. యూత్ స్టార్ నితిన్, ఎంసీఏ, వకీల్ సాబ్ చిత్రాల డైరెక్టర్ శ్రీరామ్ వేణు కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘తమ్ముడు’. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

శనివారం యంగ్ టాలెంటెడ్ హఈరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా ‘తమ్ముడు’ సినిమా నుంచి మేకర్స్ టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. టైటిల్ లోగో, పోస్టర్ చూస్తుంటే చాలా క్రియేటివ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్పెషల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం అన్నీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను మెప్పించటానికి యూనిక్‌గా రూపొందుతోంది.

IMG 20240330 WA0069

‘తమ్ముడు’ చిత్రంలో నితిన్ లుక్ చాలా కొత్తగా ఉంది. పోస్టర్‌ను గమనిస్తే ఓ బస్సు మీద చిన్నిపాటి గడ్డంతో నితిన్ కూర్చుని ఉన్నారు. ఆయన చేతిలో సుబ్రహ్మణ్యస్వామి ఆయుధమైన శూలం ఉంది. ఆయన చూపులు చాలా తీక్షణంగా ఉన్నాయి. బస్సును ఓ మహిళ డ్రైవ్ చేస్తోంది. బస్సులో సీనియర్ నటి లయ కనిపిస్తున్నారు.

టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. గత చిత్రాలకు భిన్నంగా నితిన్ ఈ చిత్రంతో మెప్పించ బోతున్నారని తెలుస్తుంది. అలాగే డైరెక్టర్ శ్రీరామ్ వేణు రొటీన్‌కు భిన్నంగా ఎంటర్‌టైనర్‌తో మెప్పించ నున్నారు.

సమీర్ రెడ్డి సినిమాటోగ్రాపర్‌గా వర్క్ చేస్తున్నారు. కాంతార, విరూపాక్ష చిత్రాల సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీత సారథ్యం వహిస్తుండగా ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.

దిల్, శ్రీనివాస కళ్యాణం వంటి సినిమాల తర్వాత శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నితిన్ చేస్తోన్న మూడో సినిమా ‘తమ్ముడు’. అలాగే నానితో ఎంసీఏ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ చిత్రాల తర్వాత దర్శకుడు శ్రీరామ్ వేణు ఈ బ్యానర్‌లో చేస్తున్న మూడో చిత్రమిది. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్‌తో రాబోతున్న సినిమా కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నటీనటులు

నితిన్,

సాంకేతిక వర్గం:

బ్యానర్ – శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, నిర్మాతలు – దిల్ రాజు, శిరీష్, రచన, దర్శకత్వం – శ్రీరామ్ వేణు, సినిమాటోగ్రఫీ – సమీర్ రెడ్డి, మ్యూజిక్ – బి.అజనీష్ లోక్‌నాథ్, ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి, పి.ఆర్.ఒ -వంశీ కాకా, జి.ఎస్.కె మీడియా, డిజిటల్ – విష్ణు తేజ్ పుట్ట

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *