విడుదల తేదీ : డిసెంబర్ 23, 2022
నటీనటులు: నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్, అజయ్, సరయు, శత్రు
దర్శకుడు : సూర్యప్రతాప్ పల్నాటి
నిర్మాత: బన్నీ వాస్
సంగీత దర్శకులు: గోపి సుందర్
సినిమాటోగ్రఫీ: వసంత్ (రత్న వేలు Patch-work)
ఎడిటర్: నవీన్ నూలి,
నిర్మాణ సంస్థలు: GA-2, సుకుమార్ రైటింగ్స్ ,

18 పేజెస్ తెలుగు రివ్యూ (18 Pages Movie Review):
కార్తికేయ-2 సినిమా తర్వాత నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ హీరోహీరయిన్లుగా నటించిన చిత్రం 18 పేజీస్. సుకుమార్ స్కూల్ నుండి వచ్చి 21 f సినిమాకు దర్శకత్వం వహించిన సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో రెండవ సినిమా గా వచ్చిన ఈ సినిమాకి దర్శకుడు సుకుమార్ కథ అందించాడు.
సుక్కూ పరివేక్షన లో కార్తికేయ -2 సినిమా రిలీజ్ కి ముందే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయినా కార్తికేయ -2 హిట్ తో వచ్చిన ఇమేజ్ కి తగ్గట్టుగా నికిల్, అనుపమ లతో కొంత పార్టు ఇంకా బెట్టర్ క్వాలిటి కోసం ఖర్చుకి తగ్గకుండా రీ ఘాట్ చేసి ఈ రోజు విడుదల విడుదల చేశారు.
మరి సుక్కూ కలం నుండి వచ్చిన అక్షరాల 18 పేజెస్ కధ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో మా 18F MOVIES టీం సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందామా !
కధ ను పరిశీలిస్తే (story line):

సిద్ధు (నిఖిల్ సిద్ధార్థ్) ఒక సాప్ట్ వేర్ ఉద్యోగి. గతం లో ఒక అమ్మాయిని ప్రేమించి మోసపోయి బ్రేక్ అప్ అయ్యి భాదపడుతూ ఉంటాడు. కొన్ని సంగటనల కారణంగా ఆ బాధ తో సిద్దు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య నందిని (అనుపమ పరమేశ్వరన్) కి సంబందించిన ఓ డైరీని చదువుతాడు.
సిద్ధు నందని వ్రాసిన డైరీ లొని కొన్ని పేజెస్ లొని ఆలోచనలకు పూర్తిగా కనెక్ట్ అయిపోతాడు. ఈ మధ్యలో సిద్ధు, నందిని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటాడు. పూర్తిగా సిద్దు, నందిని రాసిన 18 పేజెస్ లా మారిపోయాక..
సిద్దు జీవితం ఎలా టర్న్ అయింది ?,
అసలు సిద్దు – నందిని మధ్య ఎందుకు ప్రేమ పుట్టింది ?,
సిద్దు, నండినిని ఎలా కలిశాడు ?
డైరీ లో ఆ 18 పేజెస్ సిద్దుని ఎలా మార్చాయి ?
నందిని ఎవరూ ? ఎందుకు ట్రైలర్ లో చూపించినట్టు ప్రవర్తించింది ?
సిద్దు, నందీని ఎప్పుడు కలిశారు ?
అసలు కలిశారా ? లేదా ?
మొదటి కలయికలోనే గొప్ప ప్రేమికులుగా ఎలా మారిపోయారు ?
అనే ప్రశ్నలు 18 పేజెస్ సినిమా ట్రైలర్స్, ప్రమోషన్ ల వీడియొలలో మీకు కూడా అనిపిస్తే, ఆ ప్రశ్నలు ఇంటెరస్ట్ క్రియేట్ చేస్తే మీరు తప్పకుండా 18 పేజెస్ సినిమా దియేటర్ కి వెళ్ళి చూడాలి. అంత ఓపిక డబ్బులు లేవు అనుకొంటే మా 18 పేజెస్ సినిమా సమీక్షా ఇక్కడ చదివి అసంతృప్తితో ఓటిటి రిలీజ్ వరకూ ఆగాలి.
కధకుడు,దర్శకుడి,నటి నటుల ప్రతిభ పరిసిసలిస్తే:

కధకుడు: ప్రస్తుత డిజిటల్ జనరేషన్ యూత్ లో కేవలం ఫీలింగ్స్ తో ప్యూర్ లవ్ లో పడటం, పైగా ప్రేమించడానికి కారణం ఉండకూడదు, ఎందుకు ప్రేమంచామో రీజన్స్ వెతుక్కోకూడదు అనే కోణంలో సుక్కూ రాసిన ఈ ఫీల్ గుడ్ లవ్ డ్రామాలో మంచి ఎమోషనల్ లవ్ స్టోరీ తో పాటూ గుడ్ ఎమోషన్స్ తో డీసెంట్ లవ్ ట్రీట్మెంట్ తో కొంత మంది అమర పరఎముకులను కత్తి పడేస్తుంది.
దర్శకుడు: సూర్యప్రతాప్ పల్నాటి ఈ 18 పేజెస్ సినిమాలో లవర్స్ మధ్య అద్భుతమైన ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుందో చాల చక్కగా చూపించాడు. మళ్లీ అంతలోనే ఆ పాత్రల మధ్య ఆలోచనలను, జ్ఞాపకాలను, అనుభవాలను కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. సుకుమార్ రాసిన కథలో కొన్ని ఎమోషనల్ సీన్స్ తన దర్శక ప్రతిభ తో చక్కగా ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా బాగా ప్రెసెంట్ చేశాడు.
హీరో: నిఖిల్ సిద్దార్థ్ హీరోగా కూడా నటించిన 18 పేజెస్ కధ లో మంచి టైమింగ్ తో కూడిన ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా నటించి మెప్పించాడు. సినిమాలోని కోర్ ఎమోషన్ని నిఖిల్ తన హావభావాలతోనే బాగా పలికించే ప్రయత్నం చేశాడు.
హీరోయిన్: అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా లీడ్ రోల్ లో చాలా బాగా నటించి ఆకట్టుకుంది.
ఇతర నటులు: పోసాని కృష్ణ మురళి, అజయ్, గోపరాజు రమణ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇక ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు.
కధ లో కధనం పరిశీలిస్తే (screen – Play):

ఆర్య, 100% లవ్ సినిమాలతో అద్బుత ప్రేమకధలు చెప్పే దర్శకుడిగా ముద్ర పడిన సుకుమార్ రాసుకొన్న ఈ 18 పేజెస్ సినిమా కథాంశం, రాసిన కథ బాగున్నప్పటికీ.. కథనం (స్క్రీన్ – ప్లే ) మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా చాలా స్లోగా సాగ తీసినట్టు సాగుతుంది.
ముఖ్యంగా రెండవ అంకం (సెకెండ్ హాఫ్ ) లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో బాగా స్లోగా సాగతీయ బడినట్టు అనిపించింది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా రెగ్యులర్ గానే ఉన్నాయి కానీ కొత్తగా అనిపించలేదు.
దర్శకుడు ప్రతాప్, సుక్కూ స్క్రీన్ – ప్లే ల లొని కమర్షియల్ అంశాలను దృష్టిలో పెట్టుకోకుండా ఓన్లీ ప్రేమ సన్నివేశాలతోనే సినిమాని నడపించే ప్రయత్నం లో నరేశన్ దారి తప్పినట్టు అనిపించింది. అలాగే కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి.
మొత్తానికి దర్శకుడు స్క్రిప్ట్ లో ఉన్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ అండ్ బోరింగ్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది సినిమా రిసల్ట్ కొంచెం పాజిటివ్ గా ఉండేది.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

18 పేజెస్ సినిమా సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా ఆకట్టుకున్నాడు. అయితే, స్క్రీన్ ప్లే పరంగా ఈ సినిమా ఆకట్టుకోదు.
సంగీత దర్శకుడు గోపి సుందర్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది.
ఎడిటర్ నవీన్ నూలి అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది.
వసంత్ సినిమాటోగ్రఫీ గురించి కొంచెం ఎక్కువ మాట్లాడాలి. సినిమా సీన్స్ స్లో పేజ్ లో సాగుతున్నప్పుడు ఫోటోగ్రఫీ అందంగా తీసిఉంటే ఆడియన్స్ విసువల్స్ అయినా ఎంజాయ్ చేసేవారు. కానీ ఇక్కడ లో బడ్జెట్ వలన ఏమో రత్న వేలు పేచవర్క్ సీన్స్ తప్పా మిగిలిన సినిమా విసువల్స్ మంచి మూడ్ క్రియేట్ చేయలేక పోయింది.
ఇక నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి అనాలా లేక ఏమి అనాలో తెలియదు.ఎలాంటి సమీక్షాయినా చిన్న సినిమా నిర్ మోహమటంగా రాసినట్టు ఇక్కడ పెద్ద సంస్థల సినిమాలకు రాయలేము. అలా రాస్తే వారి నెక్స్ట్ సినిమాల ఇన్ఫో మాకు రాకుండా చేస్తారు. అందుకే పెద్ద నిర్మాణ సంస్థ లు సినిమాల సమీక్షా లో ఎక్కువగా వ్రాయలేము.
కానీ ఇక్కడ రాయాలి అనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద సంస్థలు చేసే సినిమాలు చాలా ఎక్కువ ప్రోమోసన్స్ తో పాటూ ప్రేక్షకులలో ఎన్నో అంచనాలు శృస్తిస్తాయి.
అలా అందరూ పెద్ద నిర్మాణ సంస్థల నుండి మంచి సినిమాల కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ నిర్మాణ సంస్థలు ఆడియన్స్ ఎక్స్పెక్ట్సన్స్ దృస్తిలో పెట్టుకొని మంచి కధ, కధనాలతో సినిమాలు తియ్యలి.
GA-2 గతం లో తీసిన గీత గోవిందం సూపర్ సక్సెస్ తర్వాత తీసిన సినిమాలు అన్నీ ప్రేక్షక – వీక్షణ కు దూరంగా ఉండిపోయాయి. ఇప్పటికైనా పేరున్న దర్శక – కధకులను కాకుండా కొత్తగా వచ్చే యువ రచయితల కధలు విని ప్రెస్ ఐడియా లతో వచ్చే నూతన దర్శకులకు అవకాశం ఇవ్వాలి.
18f మూవీస్ టీం ఒపీనియన్:

నికిల్ అనుపమల జంట నటించిన సినిమా 18 పేజెస్ అంటూ వచ్చిన ఈ ఫీల్ గుడ్ లవ్ డ్రామాలో స్వచ్చమైన ప్రేమ కథ, కొన్ని ప్రేమ సన్నివేశాలు అలాగే ట్రూ ఎమోషన్స్ అండ్ క్లైమాక్స్ మరో ప్రేమ లోకం లోకి తెసుకుపోతుంది. నిఖిల్ సిద్దార్థ్ – అనుపమ పరమేశ్వర్ ల నటన తో చాలా బాగా ఆకట్టుకున్నారు. అయితే, కొన్ని చోట్ల స్క్రీన్ – ప్లే మరీ స్లోగా, రొటీన్ గా సాగడం సినిమాకి చాలా మైనస్ అయ్యింది. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం యువతలో ఓ వర్గం సినీ జనాలను బాగా మెప్పిస్తోంది. ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తుంది.
టాగ్ లైన్: నందిని డైరీ లో ఆ 18 పేజెస్ చాలా ఎమోషనల్ గురూ !
18 f Movies రేటింగ్: 2.25 / 5
* కృష్ణ ప్రగడ.