Nikhil Opens FNCC All India Open tournament  : హీరో నిఖిల్ చేతుల మీదగా ఎఫ్ ఎన్ సి సి ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ! 

IMG 20240309 WA0074 e1710001426166

ఎఫ్ ఎన్ సి సి నిర్వహించు 12 ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ ఓపెనింగ్ నేడు హీరో నిఖిల్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. సౌత్ ఇండియా లోనే ఇది బిగ్గెస్ట్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు 69 టీములు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా చైనాలో జరిగిన టోర్నమెంట్స్ లో సిల్వర్ మెడల్స్ గెలిచిన పలువురిని ఎఫ్ ఎన్ సి సి ఘనంగా సత్కరించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో నిఖిల్ గారు, ఎఫ్ ఎన్ సి సి వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మల రంగారావు గారు, సెక్రటరీ శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రెటరీ శ్రీ వి ఎస్ ఎస్ పెద్దిరాజు గారు, శ్రీ ఏడిద సతీష్ (రాజా) గారు, ఫార్మర్ క్రికెటర్ మరియు ముంబై మాస్టర్స్, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ఫ్రాంచెస్ కో ఓనర్ శ్రీ చాముండేశ్వరనాథ్ గారు పాల్గొన్నారు.

IMG 20240309 WA0075

ఎఫ్ ఎన్ సి సి వైస్ ప్రెసిడెంట్ రంగారావు గారు మాట్లాడుతూ : ఈ టోర్నమెంట్లో పాల్గొనే టీమ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. మన ముఖ్యఅతిథి హీరో నిఖిల్ గారిని టోర్నమెంట్ ఓపెన్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అన్నారు.

IMG 20240309 WA0072

హీరో నిఖిల్ గారు మాట్లాడుతూ : ముందుగా నన్ను ఈవెంట్ కి పిలిచినందుకు శ్రీ ముళ్లపూడి మోహన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక యాక్టర్ ని కానీ ఇలా ఈవెంట్ కి వచ్చి స్పోర్ట్స్ మెన్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది.

మాలాంటి యాక్టర్స్ని ఇలాంటి ఫంక్షన్స్ కి పిలిచి స్పోర్ట్స్ మెన్స్ తో కలిపి మాకు కూడా ఒక మైండ్ రిఫ్రిషింగ్ ఈవెంట్ లాగా చేయడం చాలా ఆనందంగా ఉంది. స్పోర్ట్స్ టోర్నమెంట్ లో ఇంటర్నేషనల్ వరకు వెళ్లి ఇండియా కోసం గోల్డ్ సిల్వర్ మెడల్స్ గెలిచిన ఆటగాళ్లని కలవడం వాళ్ళని సత్కరించడం ఆనందం గా ఉంది.

ఇప్పుడు ఈ బ్రిడ్జి టోర్నమెంట్ ద్వారా ఆడుతున్న టీమ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఇప్పుడున్న యువత ఈ బ్రిడ్జ్ టోర్నమెంట్ గురించి తెలుసుకోవాలి. దీని ద్వారా ఇంకా ఎక్కువ మంది యువకులు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

IMG 20240309 WA0070

ఎఫ్ ఎన్ సి సి సెక్రెటరీ ముళ్ళపూడి మోహన్ గారు మాట్లాడుతూ : ఎంతో బిజీగా ఉన్నా మా ఆహ్వానాన్ని మన్నించి బ్రిడ్జ్ టోర్నమెంట్ ఓపెనింగ్ కి వచ్చిన హీరో నిఖిల్ గారికి మా ఎఫ్ ఎన్ సి సి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంత ఘనంగా ఈవెంట్ ని ఆర్గనైజ్ చేసి ఏర్పాట్లు చేసినందుకు రమణమూర్తి గారికి ధన్యవాదాలు.

బ్రిడ్జ్ టోర్నమెంట్ ని స్పాన్సర్ చేస్తూ మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న నవయుగ ఇంజనీరింగ్ శ్రీ విశ్వేశ్వర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ ని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మా ప్రయత్నాన్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.

గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసాము అందరి సపోర్ట్ తో ముందు ముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *