“హరి హర వీరమల్లు”తొ నిధి అగర్వాల్  రోమెన్స్!

IMG 20250215 WA0097 e1739595603949

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న “హరి హర వీరమల్లు” చిత్రంతో హీరోయిన్ గా నటిస్తోంది నిధి అగర్వాల్. ఆమె ఫస్ట్ టైమ్ పవర్ స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ఈ సినిమా నుంచి ఈరోజు సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు.

ఈ నెల 24న ఈ పాట రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ లో నిధి అగర్వాల్ బ్యూటిఫుల్ మేకోవర్ తో ఆకట్టుకుంటోంది. పాటలో లిరిక్స్ లాగే ఆడియెన్స్ మనసు కొల్లగొట్టేలా నిధి కనిపిస్తోంది.

కొల్లగొట్టినాదిరో పాట రిలీజ్ అనౌన్స్ మెంట్ పోస్టర్ స్టిల్…నిధి అగర్వాల్ హరి హర వీరమల్లు కు వర్క్ చేసిన ఫస్ట్ డే షూటింగ్ నుంచి తీసినది కావడం విశేషం.

పవర్ స్టార్ తో వర్క్ చేయడం తన కెరీర్ లో మర్చిపోలేని ఎక్సిపీరియన్స్ అని, ఈ సినిమాతో తాను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు మరింతగా చేరువవుతానని నమ్మకంతో ఉంది నిధి అగర్వాల్.

మార్చి 28న హరి హర వీరమల్లు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *