New Brand ambassador for Rotary club: రోటరీ క్లబ్ మనోజ్ఞ కార్యక్రమ బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ యాక్టర్ కృష్ణ చైతన్య

IMG 20230815 WA0242

 

వందేళ్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోన్న సంస్థ రోటరీ. తాజాగా ఈ సంస్థ మెంటల్ హెల్త్ పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు మనోజ్ఞ పేరుతో వరుస కార్యక్రమాలు చేపట్టింది. ఈ మనోజ్ఞ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా యంగ్ యాక్టర్ కృష్ణ చైతన్య ఎంపికయ్యారు. ఒక మంచి సామాజిక సేవా కార్యక్రమానికి ప్రచారకర్తగా ఎంపికవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కృష్ణ చైతన్య చెప్పారు.

IMG 20230815 WA0241

మనోజ్ఞ కార్యక్రమ ప్రారంభోత్సవంలో రోటరీ డిస్ట్రిక్ట్ 3150 గవర్నర్ డాక్టర్ బి శంకర్ రెడ్డి, కార్యక్రమ కో ఆర్డినేటర్ గా పనిచేస్తున్న డిస్ట్రిక్ట్ ఛైర్ మెంటల్ హెల్త్ రోటరేరియన్ డాక్టర్ వాసుప్రద కార్తిక్, సపోర్టింగ్ పార్టనర్ గా వ్యవహరిస్తున్న సీఎండీ మా హాస్పిటల్స్ రోటరేరియన్ మిస్ సునీత కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *