Nenu Keerthana Movie Poster Launch : చిమటా ప్రొడక్షన్స్ “నేను-కీర్తన” ఫస్ట్ లుక్ & టీజర్ విడుదల!

IMG 20240404 WA0059 e1712226869774

టీజర్ చూస్తుంటే కొత్త దర్శకుడితో కొత్త నిర్మాణ సంస్థ తీసిన సినిమా అనిపించడం లేదని, హీరోగా చిమటా రమేష్ బాబు(సి.హెచ్.ఆర్)కి చాలా మంచి భవిష్యత్ ఉందని “నేను-కీర్తన” ఫస్ట్ లుక్ మరియు టీజర్ విడుదల వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టి.ప్రసన్నకుమార్, వీరశంకర్, యాటా సత్యనారాయణ అన్నారు.

చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై చిమటా రమేష్ బాబు (“సి.హెచ్.ఆర్”)ను దర్శకుడిగా పరిచయం చేస్తూ… చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) – రిషిత – మేఘన హీరోహీరోయిన్లుగా… చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ) సమర్పణలో చిమటా లక్ష్మికుమారి నిర్మించిన “నేను-కీర్తన” చిత్రం ఫస్ట్ లుక్ అండ్ టీజర్ విడుదల వేడుక హైద్రాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది.

IMG 20240404 WA0061

తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్న కుమార్, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, “రజాకర్” దర్శకుడు యాటా సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) రూపంలో ఓ మల్టీ టాలెంటెడ్ హీరో తెలుగు తెరకు పరిచయమవుతుండడం సంతోషదాయకమని, ఫస్ట్ లుక్ లో, టీజర్ లో సక్సెస్ కళ ప్రస్పుటంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.

“నేను-కీర్తన” చిత్రాన్ని తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తనే హీరోగా, దర్శకుడిగా తెరకెక్కించానని, ఈ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచే చిన్న చిత్రాల జాబితాలో మల్టీ జోనర్ చిత్రంగా మలచిన “నేను-కీర్తన” చిత్రం కచ్చితంగా చేరుతుందని, కులుమనాలిలో చిత్రీకరించిన పాటలు, ఆరు రోప్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్) ఆశాభావం వ్యక్తం చేశారు.

IMG 20240404 WA0060

“నేను-కీర్తన” చిత్రంలో నటించడం చాలా సంతృప్తినిచ్చిందని సీనియర్ నటులు విజయ్ రంగరాజు, జబర్దస్త్ అప్పారావు పేర్కొన్నారు. ఇందులో నటించే అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు హీరోయిన్ రిషిత కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎల్.రాజా, రాజ్ కుమార్, ఎర్రచీర సుమన్ బాబు తదితరులు పాల్గొని “నేను – కీర్తన” ఘన విజయం సాధించాలని ఆకాక్షించారు.

నటి నటులు:

సంధ్య, జీవా, విజయరంగ రాజు, జబర్దస్త్ అప్పారావు, జబర్దస్త్ సన్నీ, రాజ్ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి…

సాంకేతిక వర్గం:

పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, డి.ఐ: భాను ప్రకాష్, వి.ఎఫ్.ఎక్స్: నవీన్, ఎస్.ఎఫ్.ఎక్స్: ఎ. నవీన్ రెడ్డి, పోరాటాలు: నూనె దేవరాజ్, నృత్యాలు: అమిత్ కుమార్ – సి.హెచ్.ఆర్, సంగీతం: ఎం.ఎల్.రాజా, ఛాయాగ్రహణం: కె. రమణ, కూర్పు: వినయ్ రెడ్డి బండారపు, సమర్పణ: చిమటా జ్యోతిర్మయి (యు.ఎస్.ఎ), నిర్మాత: చిమటా లక్ష్మికుమారి, రచన – దర్శకత్వం: చిమటా రమేష్ బాబు (సి.హెచ్.ఆర్.).

IMG 20240404 WA0059

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *