Tremendous response to Nenevaru trailer: నేనెవరు ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్

WhatsApp Image 2022 11 30 at 12.12.17 PM 1

“నేనెవరు” చిత్రం విడుదల కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు ఈ చిత్ర హీరో-హీరోయిన్లు కోలా బాలకృష్ణ – సాక్షి చౌదరి. ఈ చిత్రం అద్భుతంగా రావడం కోసం నిర్మాతలు భీమినేని శివప్రసాద్ – తన్నీరు రాంబాబు ఎంత తపన పడ్డారో తాము ప్రత్యక్షంగా చూశామని, దర్శకుడు నిర్ణయ్ పల్నాటి ప్రతి ఫ్రేమును ప్రత్యేక శ్రద్ధతో తీర్చిదిద్దారని వారు తెలిపారు. ఈ చిత్రం తన తండ్రి (కోలా భాస్కర్) ఎడిటింగ్ చేసిన ఆఖరి చిత్రం కావడం వలన తాను చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నానని కోలా బాలకృష్ణ అన్నారు. “నేనెవరు” చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ, ఈ చిత్రానికి పని చేసిన సాంకేతిక నిపుణులకు చాలా మంచి పేరు తెస్తుందని సాక్షి చౌదరి పేర్కొన్నారు.

FinZkciUYAEG3Ow

ఈ చిత్రంలోని పాటలకు, టీజర్ మరియు ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడం... “నేనెవరు” చిత్రం సాధించబోయే ఘన విజయానికి సంకేతంగా భావిస్తున్నామని అన్నారు.

WhatsApp Image 2022 11 30 at 12.12.16 PM

నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు సంయుక్తంగా నిర్మించిన “నేనెవరు” డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.

FdGkUZqakAAdenO

లవ్ – సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రానికి పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. తనిష్క్ రాజన్, గీత్ షా, బాహుబలి ప్రభాకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రాధగోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

FdGkTFJaIAIn410

ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం “నేనెవరు” కావడం విశేషం.

FdGkTxfakAYSmr5

ఈ చిత్రానికి కెమెరా: సామల భాస్కర్, ఫైట్స్: రియల్ సతీష్, కొరియోగ్రఫీ: చంద్రకిరణ్.జె, పి.ఆర్.ఓ: ధీరజ్ – అప్పాజీ, పబ్లిసిటీ డిజైన్స్: వాల్స్ అండ్ ట్రెండ్స్, పోస్ట్ ప్రొడక్షన్: ప్రసాద్ లాబ్స్, ఎడిటింగ్: కోలా భాస్కర్, పాటలు: కృష్ణకాంత్, సంగీతం: ఆర్.జి.సారథి, సహనిర్మాతలు: పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి, నిర్మాతలు: భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు, దర్శకత్వం: నిర్ణయ్ పల్నాటి!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *