Nene Naa Movie Update: ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న స్టార్ హీరోయిన్ రెజీనా నటించిన “నేనేనా” చిత్రం

nene naa poster 1 e1692446190712

2012లో రిలీజైన ఎస్ఎంఎస్ (శివ మనసులో శృతి) సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది రెజీనా కసాండ్రా . తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంది. ముఖ్యంగా రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట, పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి చిత్రాలతో మంచి పేరును సాధించుకుంది.

nene naa poster

రెజీనా ప్రస్తుతం ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో “సూర్పనగై” అనే సినిమాను చేస్తుంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్ , జై ప్రకాష్ వంటి కీలక నటులు నటిస్తున్నారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. జాంబిరెడ్డి సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ పై ఈ చిత్రం తెరకెక్కింది.

కాగా, అన్ని పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రానికి క్లీన్ U/A సర్టిఫికేట్ ను సెన్సార్ సభ్యులు ఇచ్చారు. సినిమా విభిన్నంగా ఉందని, మంచి కంటెంట్‌తో వస్తుంది అంటూ మూవీ యూనిట్‌ని సెన్సార్ సభ్యులు అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *