Naveen Polishetty Visit Khairatabad Ganesh: ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న యువ హీరో నవీన్ పోలిశెట్టి

IMG 20230918 WA0329 e1695057941336

 

తాను నటుడు అవ్వాలనే కోరిక వినాయక చవితి ఉత్సవాల్లోనే పుట్టిందని అన్నారు యువ హీరో నవీన్ పొలిశెట్టి. నవరాత్రి ఉత్సవాల్లో కనిపించే సందడి, అక్కడ జరిగే హంగామా తనలో నటుడు ఉన్నాడని తెలిసేలా చేసిందన్నారు.

IMG 20230918 WA0328

ఇవాళ వినాయక చవితి సందర్బంగా ఖైరతాబాద్ మహాగణపతిని నవీన్ పొలిశెట్టి దర్శించుకొని పూజలు నిర్వహించారు. నవీన్ కు ఉత్సవ సమితి సభ్యులు సాదర స్వాగతం పలికి సత్కరించారు.

IMG 20230918 WA0327

అనంతరం ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాల్లో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న నవీన్ పొలిశెట్టి… తన తాజా చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయవంతమైనందుకు గణేశుడికి కృతజ్ఞలు తెలిపాడు. ఈ ఏడాది కొలువుదీరిన విద్యామహాగణపతి… భక్తులకు మంచి విద్య, ఉన్నతి కల్పించాలని ప్రార్థిస్తున్నట్లు నవీన్ పేర్కొన్నారు.

IMG 20230918 WA0009

నవీన్ పోలిశెట్టి రాకతో ఖైరతాబాద్ గణేశుడి వద్ద సందడి నెలకొంది. ఉత్సవ సమితి సభ్యులతోపాటు పలువురు భక్తులు నవీన్ తో సెల్ఫీలు తీసుకుంటూ ఆనందించారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *