Navdeep  LOVE Mouli Release Date locked: న‌వ‌దీప్ 2.O ల‌వ్, మౌళి మూవీ విడుద‌ల ఎప్పుడంటే !

IMG 20240402 WA0048 e1712063516811

సూప‌ర్ టాలెంటెడ్ యాక్టర్ నవదీప్ కొంత విరామం తరువాత హీరోగా, స‌రికొత్త‌గా న‌వ‌దీప్ గా 2.Oగా క‌నిపించ‌బోతున్న చిత్రం లవ్,మౌళి. విభిన్న‌మైన, వైవిధ్య‌మైన ఈ చిత్రానికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కుడు. ఈ చిత్రాన్ని నైరా క్రియేషన్స్ మరియు శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్ తో క‌లిసి నిర్మాణ పనులు టాలీవుడ్ టాలెంటెడ్ టెక్నిషియన్స్ కి అడ్డాగా మారిన సి స్పేస్ భాధ్యతలు తీసుకుంది.

IMG 20240402 WA0050

ఈ చిత్రం నుంచి వ‌చ్చిన ప్ర‌తి అప్‌డేట్ వినూత్నంగా అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 19న విడుద‌ల చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది చిత్ర‌యూనిట్‌. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ

ఈ చిత్రంలోచాలా డిఫ‌రెంట్‌గా నవదీప్ కనిపించడంతో ఈ సినిమా న‌వ‌దీప్ 2.Oగా అభిమానులంతాఒక ఢిఫరెంట్ కాన్నెప్ట్ తొ వుంటుంద‌ని మంచి అంచ‌నాల‌తో ఈ సినిమా గురించి ఎదురుచూస్తున్నారు. నేడు విడుద‌లైన పాట‌ల‌ను చూస్తుంటే వీరి అంచ‌నాల‌ను మ‌రింత పెంచే విధంగా వుంది. ఎందుకుంటే న‌వ‌దీప్‌ను స‌రికొత్త‌గా చూసిన వాళ్లంతా ఈసినిమాతో ఆయ‌న కొత్త ట్రెండ్ క్రియేట్ చెయ్య‌బోతున్నాడ‌ని అంటున్నారు. నా లైఫ్ లో జ‌రిగిన ప్రేమ‌క‌థ‌ల‌కు ఫ‌లిత‌మే ఈ సినిమా క‌థ‌.

IMG 20240402 WA0049

నేను పాన్ ఇండియా లెవ‌ల్‌లో ప్రేమించేవాడ్ని. ప్రేమ అనే టాపిక్‌లో సో మెనీ వెరియేష‌న్స్ వున్నాయి. నా స్వీయ అనుభ‌వాలే ఈ సినిమా క‌థ, ఈ నెల 19న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. విభిన్న ప్రేమ‌క‌థ‌లు కోరుకునే ప్రేక్ష‌కులంద‌రికి మా ల‌వ్‌, మౌళి మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుంది. అన్నారు

IMG 20240402 WA0047

నటీనటులు:

నవదీప్, పంఖురి గిద్వానీ, భావన సాగి, మిర్చి హేమంత్, మిర్చి కిరణ్ తదితరులు..

సాంకేతిక నిపుణులు:

బ్యానర్.. నైరా క్రియోషన్స్ అండ్ శ్రీకర స్టూడియోస్, నిర్మాణం .. సి స్పేస్, ర‌చ‌న -దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ : అవనీంద్ర, సంగీత దర్శకులు: గోవింద్ వసంత, పాట‌ల రచన.. అనంత శ్రీరామ్, ఆర్ట్.. కిరణ్ మామిడి, పిఅర్ఓ : ఏలూరు శ్రీను- మధు మడూరి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *