ఎంతో అభిరుచితో, సినిమా రంగంలోనికి ప్రవేశించి…బడ్జెట్ సినిమాలను తీసిన చిన్న నిర్మాతలు తమ సినిమాలు విడుదల విషయంలో ఎలాంటి భీతి చెందాల్సిన అవసరం లేదని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి జాయింట్ సెక్రటరీ, సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ భరోసా వ్యక్తం చేశారు.
ఎన్నో ఏళ్లుగా చిన్న నిర్మాతలు పడుతున్న కష్టాలు అన్నీ,ఇన్నీ కావని ఆయన వెల్లడించారు. సినిమా తీయడం ఒక ఎత్తయితే, థియేటర్లలో తాము తీసిన సినిమాను థియేటర్లలో విడుదల చేసుకోవడం మరో ఎత్తయిందని ఆయన చెప్పుకొచ్చారు. కొన్నేళ్లుగా చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్న ఈ దయనీయ పరిస్థితులు తనను ఎంతో కలచివేశాయని, అందుకే అనేక సందర్భాలలో పలు వేదికలపై చిన్న సినిమాల మనుగడ విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చానని ఆయన వివరించారు.
ఈ నేపథ్యంలోనే చిన్న సినిమాలను తీసిన నిర్మాతలు ఎవరైనా సరే విడుదల విషయంలో థియేటర్స్ మొదలుకుని పబ్లిసిటీ తదితర అన్ని రకాల సహాయ సహకారాలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఆసక్తిగల నిర్మాతలు దిగువ అడ్రస్సులో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో సంప్రదించవచ్చు.
ఫ్లాట్ నెంబర్: 202, హాసినీ రెసిడెన్సీ, జయప్రకాశ్ నగర్, ఎల్లారెడ్డి గూడ, హైదరాబాద్-500073.