malli pelli posters e1690963695817

 

ప్రముఖ నటుడు డాక్టర్ వికె నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి మళ్ళీ పెళ్లి( తెలుగు), మట్టే మదువే ( కన్నడ) చిత్రాన్ని థియేటర్లు, OTT ప్లాట్‌ఫారమ్‌లలో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో ఇంజక్షన్ దావా వేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్‌లు లేని కారణంగా కొట్టివేస్తూ 2023 ఆగస్టు 1న తీర్పును వెలువరించింది.

malli pelli posters Pavitra lokesh 71 e1690963727648

 మళ్ళీ పెళ్లి సినిమాల విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు పేర్కొంది.

malli pelli posters Pavitra lokesh 3

తెలుగు, కన్నడ భాషలలో మళ్ళీ పెళ్లి సినిమా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో విడుదలైయింది. ఈ తీర్పు ప్రకారం అన్ని OTT ప్లాట్‌ఫారమ్‌లు, శాటిలైట్‌ల ద్వారా ఈ సినిమాని నిర్మాతలు స్వేఛ్చగా ప్రసారం చేయవచ్చు.

మరో కేసులో నరేష్, కుటుంబ సభ్యులు, రమ్య రఘుపతి ని నరేష్ నానక్‌రామ్‌గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది.
రమ్య రఘుపతి, నరేష్ పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్ పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు ..రమ్య రఘుపతి పై గృహ నిషేదం కేసు పెట్టడం జరిగింది. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది.

malli pelli posters Pavitra lokesh 12

నరేష్, అతని కుటుంబం అందించిన సాక్ష్యాల ప్రకారం, రమ్య రఘుపతి అక్కడ నివాసం లేదు. ప్రాపర్టీని వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది. రమ్య కోసం వస్తున్న గుర్తు తెలియని వ్యక్తుల వలన అక్కడ నివసించే సీనియర్ సిటిజన్స్, నరేష్ అసౌకర్యంతో పాటు అందోళనకు గురి అవుతున్నారని కూడా కోర్టు పేర్కొంది.

ఇటీవలే పవర్ టీవీ అనే కన్నడ ఛానల్ చేత ఇల్లీగల్ గా నరేష్ ఇంటి మీద, పవిత్ర మీద స్టింగ్ ఆపరేషన్ లు జరిపిన విషయం అందరికి తెలిసిందే. నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలు కలిసి జీవించడం లేదని కోర్టు నిర్ధారించింది.

malli pelli posters Pavitra lokesh 21 e1690963783611

కోర్టు ఇచ్చిన తీర్పు నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్య భర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దు చేయబడుతుంది.

రమ్య రఘుపతి పై సైబర్ మాల్వేర్, సైబర్ ఎటాక్ కు సంబంధించి సైబర్ కోర్టు, సైబర్ సెల్‌లో సైబర్ క్రైమ్ కేసు పెండింగ్‌లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *