Narakasura Movie Update: కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా “నరకాసుర” సినిమాలోని లిరికల్ సాంగ్ రిలీజ్ !

IMG 20231022 WA0116 e1697967192306

 

“పలాస” ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా “నరకాసుర”. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో నరకాసుర మూవీ రిలీజ్ కాబోతోంది.

తాజాగా “నరకాసుర” చిత్రం నుంచి ‘గ్రీవము యందున‘ అనే లిరికల్ సాంగ్ ను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందన్న ఆయన మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. తమ సినిమాలోని ‘గ్రీవము యందున..’ పాటను రిలీజ్ చేసిన హీరో కిరణ్ అబ్బవరంకు “నరకాసుర” టీమ్ మెంబర్స్ థ్యాంక్స్ చెప్పారు

IMG 20231021 WA0046

వడ్డేపల్లి కృష్ణ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను ఏఐఎస్ నాఫాల్ రాజా బ్యూటిఫుల్ కంపోజిషన్ లో స్టార్ సింగర్ శంకర్ మహదేవన్ పాడారు. ‘గ్రీవము యందున కాలమునే..కంఠము యందున గరళమునే.. దాచిన దానవ పక్షమువే..మా యడ న్యాయము మరచితివే..’అంటూ నిందాస్తుతిలో పరమ శివుడిని ప్రశ్నిస్తూ సాగుతుందీ పాట. శివభక్తుల గెటప్ లతో ఆధ్యాత్మిక భావన కలిగించేలా ఈ పాటను పిక్చరైజ్ చేశారు. ఈ పాటకు పొలాకి విజయ్ ఆకట్టుకునే కొరియోగ్రఫీ చేశారు. నరకాసుర చిత్రంలో కీలక సందర్భంలో ఈ పాట వస్తుందని, సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని “నరకాసుర” మూవీ టీమ్ చెబుతున్నారు.

నటీనటులు:-

రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు

సాంకేతిక నిపుణులు :

బ్యానర్స్ : సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిల్మ్ మేకర్స్, నిర్మాత : డాక్టర్ అజ్జా శ్రీనివాస్, సహ నిర్మాత : కారుమూరు రఘు, ఎడిటింగ్ : సిహెచ్ వంశీకృష్ణ, సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి, సంగీతం : ఏఐఎస్ నాఫాల్ రాజా, యాక్షన్ : రోబిన్ సుబ్బు, కొరియోగ్రఫీ : పొలాకి విజయ్, లిరిక్స్ : వడ్డేపల్లి కృష్ణ, పిఆర్ఓ : జీఎస్ కే మీడియా, రచన, డైరెక్షన్ : సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *