Narakasura Movie Update:  డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా రక్షిత్ అట్లూరి “నరకాసుర” సినిమాలోని ‘నిన్ను వదిలి..’ లిరికల్ సాంగ్ రిలీజ్

IMG 20230921 WA0188

 

పలాస ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న సినిమా నరకాసుర. అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో నరకాసుర మూవీ రిలీజ్ కాబోతోంది.

IMG 20230921 WA0017

తాజాగా నరకాసుర చిత్రం నుంచి నిన్ను వదిలి అనే లిరికల్ సాంగ్ ను స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందన్న ఆయన మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. తమ సినిమాలోని నిన్ను వదిలి పాటను రిలీజ్ చేసిన అనిల్ రావిపూడికి నరకాసుర టీమ్ మెంబర్స్ కృతజ్ఞతలు తెలిపారు.

IMG 20230920 WA0079

శ్రీరామ్ తపస్వి సాహిత్యాన్ని అందించిన ఈ పాటను ఏఐఎస్ నాఫాల్ రాజా బ్యూటిఫుల్ కంపోజిషన్ లో విజయ్ ప్రకాష్, చిన్మయి శ్రీపాద హార్ట్ టచింగ్ గా పాడారు. ‘నిన్ను వదిలి నేనుండగలనా..నన్ను వదిలి నీవుండగలవా..ఇది నీ వాంఛ గాదే, నాకు ఏ వాంఛ లేదే..పంచభూతమ్ములు అనుకున్నా..విధిని ఆపవులే..’అంటూ ప్రేమలోని ఎమోషనల్ బాండింగ్ చూపిస్తూ సాగుతుందీ పాట. అందమైన ఈ పాటను అంతే అందంగా పిక్చరైజ్ చేసినట్లు లిరికల్ సాంగ్ లోని విజువల్స్ ద్వారా తెలుస్తోంది.

IMG 20230920 WA0095

నటీనటులు – రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు

సాంకేతిక నిపుణులు :

బ్యానర్స్ : సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిల్మ్ మేకర్స్

నిర్మాత : డాక్టర్ అజ్జా శ్రీనివాస్

ఎడిటింగ్ : సిహెచ్ వంశీకృష్ణ

సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి

సంగీతం : ఏఐఎస్ నాఫాల్ రాజా

యాక్షన్ : రోబిన్ సుబ్బు

పిఆర్ఓ : జీఎస్ కే మీడియా

రచన, డైరెక్షన్ : సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *