టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన డీవీవీ ఎంటర్ టైన్మెంట్ రాజమౌళి – రామ్ చరణ్ – యన్ టి ర్ ల RRR సినిమా తో వచ్చిన ఫేమ్ ని కాష్ చేసుకొనే పనిలో పడి సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ టాప్ హీరోలతో పాటు క్రేజీ దర్శకులతో సినిమాలు చేయడానికి రెఢీ అయ్యి వరసగా సినిమాలు చేసుకొంటూ పోతున్నారు.
ప్రస్తుతం, పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబో లో ఓజి ( ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ) మూవీ చేస్తూన్నారు. నిన్ననే ఓజి రిలీజ్ డేట్ కూడా ఎనన్స్ చేసేశారు. నాచురల్ స్టార్ నాని – వివేక్ ఆత్రేయ కాంబో లో తెరకెక్కుతున్న సరిపోదా శనివారం చిత్రం కూడా శర వేగంగా షూటింగ్ జరుగుతుంది.
ఈ సరిపోదా శనివారం చిత్రం త్వరలో అంటే దసరా – దీపావళి సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం వస్తున్న న్యూస్ ఏంటంటే, సుజీత్ చెప్పిన లైన్ నచ్చి నాని మరో సినిమాను ఇదే నిర్మాణ సంస్థ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.
డైరెక్టర్ సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఓజీ సినిమా రెండు పార్ట్శ్ గా ఉండబోతుంది. మొదటి పార్ట్ ఘాట్ అల్మోస్ట్ కాంప్లెట్ అయిపోయింది అంటున్నారు చిత్ర యూనిట్. పవర్ స్టార్ ఇంకో నాలుగు, ఐదు రోజులు డేట్స్ ఇస్తే ఓ జి మొదటి పార్ట్ ఘాట్ కాంప్లెట్ అయిపోతుంది.
ఓజి చిత్రం రిలీజ్ డేట్ ను మేకర్స్ సెప్టెంబర్ 27 న విడుదల చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ చిత్రం తరువాత డైరెక్టర్ సుజిత్, హీరో నాని ను డైరెక్ట్ చేయనున్నారు. అది కూడా డీవీవీ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ లోనే. ఈ చిత్రం పై సాలిడ్ బజ్ వినిపిస్తోంది.
అయితే ఈ సినిమా పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు, తమిళ సూపర్ స్టార్ విజయ్ DVV ఎంటర్టైన్మెంట్ లో ఓక సినిమా చేస్తున్నట్టు న్యూస్ వచ్చింది. ఈ విదంగా క్రేజీ కాంబోలతో పాటు క్రేజీ సినిమాలు నిర్మించాలని దానయ్య డిసైడ్ అయ్యారని ఫిల్మ్ నగర్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.