నాగ చైతన్య, సాయి పల్లవి ల ‘తండేల్’ నుంచి శివ శక్తి సాంగ్ ! 

IMG 20250104 WA0208 scaled e1736001523380

 యువ సామ్రాట్ నాగ చైతన్య మచ్ అవైటెడ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘తండేల్‘. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లు బ్లాక్ బస్టర్ నోట్‌లో ప్రారంభమయ్యాయి. ఫస్ట్ సింగిల్ “బుజ్జి తల్లి” సెన్సేషనల్ హిట్ అయింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ప్రోమోతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మేకర్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెకండ్ సింగిల్ “నమో నమః శివాయ” లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.

మహాదేవ్‌ స్మరణతో కూడున్న శివ శక్తి పాట బ్రెత్ టేకింగ్ మాస్టర్ పీస్. ఈ సాంగ్ డ్యాన్స్, డివొషన్, గ్రాండియర్ విజువల్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.

రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఎలక్ట్రిఫైయింగ్ బీట్స్ ఆకట్టుపడేస్తున్నాయి. ట్రాక్ పవర్ ఫుల్, భక్తి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. జొన్నవిత్తుల సాహిత్యం శివుని సర్వశక్తి, ఆధ్యాత్మికత సారాంశాన్ని అద్భుతంగా చూపించింది, అనురాగ్ కులకర్ణి వోకల్స్ డైనమిక్‌గా వున్నాయి. హరిప్రియ సోల్ ఫుల్ వోకల్స్ తో ఆకట్టుకుంది.

IMG 20250104 WA0193

శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ మరొక హైలైట్, ఇది మరపురాని అనుభూతిని కలిగిస్తుంది. డ్యాన్స్ ద్వారా భక్తి గాథను అందంగా వివరిస్తూ, శివునికి పవిత్రమైన బ్యాక్ డ్రాప్ లో కొరియోగ్రఫీ ఆకట్టుకుంది.

‘లవ్ స్టోరీ’లో తమ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న లీడ్ పెయిర్ నాగ చైతన్య, సాయి పల్లవి ఈ పాటలో మెస్మరైజ్ చేశారు. నాగ చైతన్య పవర్ ఫుల్ ప్రెజెన్స్, సాయి పల్లవి అత్యద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ ప్రేక్షకులుని అలరించాయి.

గ్రాండ్ సెట్స్ ఎక్స్ పీరియన్స్ ని మరింత పెంచుతుంది. సెట్ డిజైన్, మ్యాజెస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లు కన్నుల విందుగా వున్నాయి.

నమో నమః శివాయ పాట కళాత్మక, ఆధ్యాత్మిక కలయిక తో లార్డ్ శివ గ్లోరీని సెలబ్రేట్ చేస్తుంది. ఈ ట్రాక్ బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్‌లలో ఒకటిగా నిలవనుంది.

ఈ మూవీకి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు, షామ్‌దత్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటర్‌. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

నటీనటులు:

నాగ చైతన్య, సాయి పల్లవి..,

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: చందూ మొండేటి, సమర్పణ: అల్లు అరవింద్, నిర్మాత: బన్నీ వాసు, బ్యానర్: గీతా ఆర్ట్స్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, డీవోపీ: షామ్‌దత్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్: శ్రీనాగేంద్ర తంగాల, పీఆర్వో: వంశీ-శేఖర్, మార్కెటింగ్: ఫస్ట్ షో.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *