Nachinavadu Movie Poster Launch:  నచ్చినవాడు చిత్రం నుంచి ‘కదిలే కాలం ఆగిందే’ పాటను విడుదల చేసిన ఎమ్ ఎల్ ఏ అరికెపూడి గాంధీ

Nachinavadu Movie Poster Launch Copy e1692523921880

ఏనుగంటి ఫిల్మ్ జోన్ పతాకం పై లక్ష్మణ్ చిన్నా హీరోగా నటిస్తూ స్వయ దర్శకత్వం వహించిన తొలి చిత్రం “నచ్చినవాడు”. సంగీత దర్శకుడు మిజో జోసెఫ్ స్వరపరిచిన ‘కదిలే కాలం ఆగిందే’ అనే మెలోడీ ప్రేమ గీతని ప్రముఖ గాయకుడు జావేద్ అలీ పాడగా, యువ పాటల రచయిత హర్షవర్ధన్ రెడ్డి రచించారు, ఈ పాటను బి ఆర్ ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్ ఎల్ ఏ అరికెపూడి గాంధీ గారు విడుదల చేశారు. ఆయన పాట వీక్షించి సినిమా మంచి విజయం సాధించాలి అని కోరుకున్నారు.

Nachinavadu Movie Poster Launch1

 హీరో, దర్శక నిర్మాత లక్ష్మణ్ చిన్నా మాట్లాడుతూ..“నచ్చినవాడు” చిత్రం నుంచి ఈరోజు ‘కదిలే కాలం ఆగిందే’ అనే మెలోడీ పాటను బి ఆర్ ఎస్ పార్టీ శేరిలింగంపల్లి ఎమ్ ఎల్ ఏ అరికెపూడి గాంధీ గారి చేతుల మీదుగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసాం. అరికెపూడి గాంధీ గారు పాట చాలా బాగుంది అని సంగీత దర్శకుడు మెజ్జో జోసెఫ్ ని కొనియాడారు.

Nachinavadu Movie Poster Launch3

సినిమా మంచి విజయం సాధించాలి అని తన శుభాకాంక్షలు తెలియజేశారు. స్త్రీ సెల్ఫ్ రెస్పెక్ట్ కథాంశంతో నిర్మించబడిన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికి నచ్చుతుంది, త్వరలోనే విడుదల చేస్తాం” అని తెలిపారు.

చిత్రం పేరు : నచ్చినవాడు

నటి నటులు :

లక్ష్మణ్ చిన్నా, కావ్య రమేష్, కె. దర్శన్, నాగేంద్ర అరుసు, లలిత నాయక్, ప్రేరణ బట్, ఏ.బి. అర్.పి. రెడ్డి, ప్రవీణ్ మరియు తదితరులు.

Nachinavadu Movie Poster Launch2

సాంకేతిక వర్గం: 

పబ్లిసిటీ డిజైనర్ : అనిల్, సాయి

సౌండ్ ఎఫెక్ట్స్ : ఎతిరాజ్

కలారిస్ట్ : R. గోపాల కృష్ణన్

ఆర్ట్ డైరెక్టర్ : నగేష్, గగన్

DOP : అనిరుద్

ఎడిటర్ : K.A.Y. పాపా రావు

అసోసియేట్ డైరెక్టర్ : మనోజ్ కుమార్, విశ్వనాధ్, ఫణికుమార్

పి ఆర్ ఓ : పాల్ పవన్

డిజిటల్ పి ఆర్ ఓ : విజయ్ నాగ్ యార్లగడ్డ (విజయ్ డిజి టెక్ )

కొరియోగ్రఫీ : ఆర్య రాజ్ వీర్

సాహిత్యం – హర్షవర్ధన్ రెడ్డి

సంగీతం – మెజ్జో జోసెఫ్

కథ, కథనం, దర్శకత్వం : లక్ష్మణ్ చిన్నా

నిర్మాతలు : లక్ష్మణ్ చిన్నా,వెంకటరత్నం

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *