NACCHINDI GIRLFRIENDU MOVIE TELUGU REVIEW & RATING: నచ్చింది గర్ల్ ఫ్రెండూ… సినిమా నచ్చేది కొందరికే

నచ్చింది 1

సినిమా: నచ్చింది గర్ల్ ఫ్రెండూ 

విడుదల తేదీ : నవంబర్ 11, 2022

నటీనటులు: ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్, మధునందన్, శ్రీకాంత్ అయ్యంగార్, సుమన్

దర్శకుడు : గురు పవన్

నిర్మాత: అట్లూరి నారాయణరావు

సంగీత దర్శకులు: గిఫ్టన్ ఎలియాస్

సినిమాటోగ్రఫీ: సిద్దం మనోహర్

ఎడిటర్: సాగర్ ఉడగండ్ల

 

ఈ శుక్ర వారం సమంత యశోద సినిమా తో పాటు  థియేటర్స్ లోకి వచ్చిన చిత్రాల్లో  చిన్న చిత్రం నార్మల్ బజ్ తో విడుదల అయ్యిన చిత్రం “నచ్చింది గర్ల్ ఫ్రెండూ”.

మరి “నచ్చింది గర్ల్ ఫ్రెండూ” చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందామా.

నచ్చింది రివ్యూ తెలుగు

కథ ని పరిశీలిస్తే:

వైజాగ్ లో ఉండే యువకుడు రాజారామ్(ఉదయ్ శంకర్) తన చదువు  లో బి కామ్ కంప్లీట్ చేసి ఫైనాన్షియల్ ఫండ్ మేనజర్ గా లైఫ్ లో గొప్పగా మారాలి అనుకుంటాడు. అయితే ఓ రోజు తన ఫ్రెండ్ చెర్రీ(మధునందన్) ఓ అర్జెంట్ గా ఇంటర్వ్యూ కి అటండ్ అవ్వాలి అని రాజారం నాన్న రేకమెండేసన్ తో అతన్ని ఓ చోట డ్రాప్ చేయడానికి  రాజారామ్ బయలుదేరుతాడు.

మరి ఈ రోడ్డు జర్నీ లో రాజారామ్, హీరోయిన్ సాండీ(జెన్నిఫర్ ఇమ్మానుయేల్) ని చూసి లవ్ లో పడి శాండి చుట్టూ తిరుగుతూ తన ఫ్రెండ్ కి ఉన్న ఇంటర్వ్యూ మర్చిపోతాడు. ఇక ఇలా అంతా బాగానే నడుస్తుంది అనే సమయంలో ఓ షాకింగ్ అంశం చోటు చేసుకుంటుంది.

మరి ఆ షొకింగ్ అంశం ఎంటి?

తన ఫ్రెండ్ ఇంటర్వ్యూ  ఏమయ్యింది?

శాండి ప్రేమను పొందాడా ?

శాండి కి వచ్చిన కస్టాలు ఏమిటి ?

ఇంతకీ శాండి హీరోయిన్ నా నెగిటివ్ ఛాయలు ఉన్న అమ్మయా? 

చివరికి ఈ కథ ఎలా ఎండ్ అవుతుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్నిసినిమా దియేటర్స్ లో  చూడాల్సిందే.

నచ్చింది రివ్యూ తెలుగు

కధ కధనం (SCREENPLAY) పరిశీలిస్తే:

ఈ చిత్రంలో కాస్త ఆసక్తిగా ఆడియెన్స్ కి కొత్తగా అనిపించే అంశం దర్శకుడు ఎంచుకున్న స్టాక్ మార్కెట్ లో  సామాన్యుల ఇన్వెస్ట్ మెంట్  అంశం అని చెప్పొచ్చు. దీనితో దీని కోసం తెలియని చాలా మందికి తెలీని అంశాలు తెలిపేలా చేసారు దర్శకుడు గురు పవన్ .

అందులోని లొసుగులు మధ్యతరగతి ఫ్యామిలీ లు, యువత  ఎదుర్కొనే సమస్యలను డీసెంట్ గా, క్లారిటీగా  చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

95ACCB35 AA27 4045 8FAC 7E00F1228C77

నటి నటుల నటన దర్శకత్వం పరిశీలిస్తే: 

నటీ నటుల నటన చూస్తే  నటుడు ఉదయ్ శంకర్ డీసెంట్ పెర్ఫామెన్స్ ని కనబరిచాడు. తన కామెడీ టైమింగ్ తో  హాస్యం పండించే సన్నివేశాలు బాగా పండాయి.

అలాగే నటుడు మధుతో సన్నివేశాల్లో నటన, కామిడీ టైమింగ్ బాగుంది.  హీరోయిన్ జెన్నీ తెలుగు లో మొదటి సినిమా అయినా తన   నటన, తన లుక్స్ లతో ఆకట్టుకుంటుంది.

మరో సీనియర్ నటుడు  శ్రీకాంత్ అయ్యంగర్ రెండో అంకం లో తనకిచ్చిన రోల్ ని సూపర్బ్ నటన తో నటించి మెప్పించారు. అలాగే కమెడియన్ పృథ్వీ తదితర నటులు తమ పాత్రలకి న్యాయం చేకూర్చారు నటిస్తూ మెప్పించారు.

ఇక దర్శకుడు గురు పవన్ విషయానికి వస్తే తాను సినిమాలో తీసుకున్న సోషల్ ఎలిమెంట్ బాగుంది. దానిపై కొన్ని సీన్స్ బాగున్నాయి.

మొత్తం ఫైనాన్షియల్ ఇష్యూ, స్టాక్ మార్కెట్ విసయాలు కలిపి  పూర్తి స్థాయి సినిమాలా మెప్పించే విధానంలో తాను సక్సెస్ కాలేకపోయాడు అని చెప్పక తప్పదు.

ఇంకా బెటర్ వర్క్ అంటే ఫస్ట్ ఆఫ్ అంత త్రిల్లర్ ఫార్మాట్ లో వెళ్ళి ఉంటే కొంచెం గ్రిప్పింగ్ ఉండి చూడడానికి ఇంటరెస్ట్ క్రియేట్ అయ్యేది.  లవ్, ఇతర మూవింగ్ సీన్స్ ని రోడ్ఎం-కాం న్యాచురల్ ఇష్యూ స్  తో సీన్స్  ని నింపి బాగా హ్యాండిల్ చేసి ఉన్నట్టయితే సినిమాకి మంచి ఫలితం దక్కి ఉండేది.

నచ్చింది 3

సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:

ఈ “నచ్చింది గర్ల్ ఫ్రెండూ” సినిమా  నిర్మాణ విలువలు పర్వాలేదు అనెల ఉన్నాయి. అలాగే టెక్నీకల్ టీం లో అయితే సంగీతం అందించిన  గిఫ్టన్ మ్యూజిక్  ఇంప్రెసివ్ గా ఉంది.

అలాగే సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అక్కడక్కడా బ్లర్ షాట్స్ ఉన్నా లో బడ్జెట్ లో ఉన్నంతలో పరవాలేదు అనిపించాడు. ఎడిటింగ్ మాత్రం ఇంకా బాగా చేయించాల్సింది దర్శకుడు.

35A85944 8C41 4245 93D7 7A8BEAED11C7

18F మూవీస్ టీం ఒపీనియన్:

“నచ్చింది గర్ల్ ఫ్రెండూ” లో మంచి లైన్ అలాగే నటీ నటుల పెర్ఫామెన్స్ లు ఆకట్టుకుంటాయి కానీ పూర్తి స్థాయి సినిమాగా అయితే ఈ చిత్ర కధనం మెప్పించదు. ఫస్ట్ ఆఫ్ లో కొంచెం బెటర్ గా కథనం ని నడిపి ఉంటే ఈ చిత్రానికి బెటర్ రిజల్ట్ వచ్చేది.

డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇంకా కొన్ని సీన్స్ లో కాంటినూటి ఇష్యూ లు పట్టించుకోలేదు.  దర్శక పరివేక్షణ లేకపోవడంతో ఇలాంటి కంటి నూటి మరియు కొన్ని సీన్స్ లో పాటు బిగించి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. ప్రస్తుతం మా 18 f  టీం ఒపీనియన్ ప్రకారం ఈ చిత్రం బిలో యావరేజ్ గా నిలిచిపోతుంది అనుకొంటున్నాము.

మీరు సినిమా లవర్స్ అయితే ఒకసారి ట్రై చేయండి. లేకపోతే 4 to 5 వీక్స్ లో ఓ టి టి లో చూడవచ్చు. ఫైనాన్షియల్ ఇంటరెస్ట్ ఉన్నవాళ్ళు అంటే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ మెంట్ చేసే వాళ్ళు, బి కామర్స్ స్టూడెంట్స్ తప్పక చూడ వలసిన సినిమా.

18F మూవీస్ రేటింగ్: 2.5/5  

* కృష్ణ ప్రగడ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *