ఉదయ్ శంకర్ : నటుడుగా తన ప్రయాణం ఆటకదరా శివ తో మొదలు పెట్టి మిస్ మ్యాచ్ అంటూ త్రిల్లర్ కథ తో పాటు డిఫరెంట్ కథలతో ఆకట్టుకుంటున్న యువ హీరో ఉదయ్ శంకర్ హీరో గా నటిస్తున్న కొత్త సినిమా “నచ్చింది గర్ల్ ఫ్రెండూ” అంటూ నవంబర్ 11 న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
లవ్ తో వచ్చే థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ మూవీని దర్శకుడు గురు పవన్ తెరకెక్కిస్తున్నారు. శ్రీరామ్ ఆర్ట్స్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో.. అట్లూరి నారాయణ రావు నిర్మిస్తున్నారు.
ఈ నెల 11న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ ని విక్టరీ వెంకటేష్ విడుదల చేసారు.
ఇంటెన్స్ లవ్ థ్రిల్లర్ కథతో ఒక రోజు అంటే సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకూ జరిగే కథ అంటూ దర్శకుడు గురు పవన్ తెలియజేశారు.
ఇక ట్రైలర్ రివ్యూ చేస్తే… ఫిబ్రవరి 13..నా లైఫ్ లో మర్చిపోలేని రోజు, నేను ప్రేమించిన అమ్మాయిని కలిసిన రోజు కూడా అదే అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది.
హీరోయిన్ ను లవ్ లో పడేసేందుకు హీరో చేసే ప్రయత్నాలతో సాగిన ట్రైలర్ ..అమ్మాయిలకు మోసం చేయడం మాత్రమే వచ్చు ప్రేమించడం రాదని చెబుతూ టర్నింగ్ తీసుకుంది.
ట్రైలర్ లాంచ్ లో విక్ట్తరి వెెంకటేష్ మాట్లాడుతూ: ట్రైలర్ చాలా బాగుంది. కాన్సెప్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజువల్స్ బాగున్నాయి. ఈసినిమా లో ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని తెలిసింది.
ఉదయ్ శంకర్ కి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నాను. టీం కి నా బెస్ట్ విషెష్ అన్నారు.
దర్శకుడు గురు పవన్ మాట్లడుతూ ఇది నాకు రెండో సినిమా, మొడటి సినిమా అవకాశం కోసం చాలా కష్ట పడ్డాను. మొదటి సినమా టైం లో ఉదయ్ నీ కలిశాను. అప్పుడు ఓక లైన్ చెప్పను..
నా మొదటి సినిమా రిలీజ్ అయిన రెండు ముడు రోజుల తర్వాత కలసి కథ చెప్పను, ఉదయ్ కి చాల బాగా నచ్చింది. అప్పుడు అట్లూరి నారాయణ రావు గారు గురించీ చెప్తే వెళ్లి కలిశాను.
అలా ఈ నచ్చింది గర్ల్ ఫ్రెండు సినిమా స్టార్ట్ అయ్యింది. ఈ సినీమా మొత్తం వైజాగ్ లో షూట్ చేశాము.
వైజాగ్ బీచ్ రోడ్ నుండి బిమిలి వరకూ జరిగే చిన్న రోడ్ జర్నీ లో అమ్మాయితో లవ్, అమ్మాయి నచ్చి, ఆ అమ్మాయి ప్రాబ్లమ్స్ నీ సాల్వ్ చేసే హీరొ పాత్ర లో ఉదయ్ శంకర్ నటించాడు.
మా ఈ కొత్త ప్రయత్నం ను ప్రేక్షకులు ఆదరిస్తారు అని అనుకొంటున్నాను ఆని దర్శకుడు గురు పవన్ చెప్పారు.