#RAPO22 Update : రాజమండ్రి షెడ్యూల్ పూర్తి చేసుకొన్న రామ్ 

IMG 20250320 WA0056 e1742476459658

ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలు.

హీరోగా రామ్ కీ  22వ చిత్రమిది. అందుకని #RAPO22ను వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ ముగించుకుని చిత్ర బృందం హైదరాబాద్ వచ్చింది.

IMG 20250320 WA0051

రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్‌ స్టాప్‌గా డే అండ్ నైట్ షూటింగ్ చేసింది RAPO22 యూనిట్. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకా ఇంపార్టెంట్ టాకీ సీన్స్ షూటింగ్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లను అంతే అందంగా క్యాప్చర్ చేశామని చిత్ర బృందం చెబుతోంది.

రాజమండ్రిలో జరిగిన చిత్రీకరణలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సహా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితర తారాగణం మీద సినిమా చిత్రీకరించారు. మార్చి 28వ తేదీ నుంచి హైదరాబాద్ షెడ్యూల్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు.

IMG 20250320 WA0050

రామ్ జంటగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ ఇతర తారాగణం.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నూని, మ్యూజిక్: వివేక్ – మెర్విన్, సీఈవో: చెర్రీ, ప్రొడక్షన్ హౌస్: మైత్రి మూవీ మేకర్స్, ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, కథ – కథనం – దర్శకత్వం: మహేష్ బాబు పి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *