Mukhya Gamanika Movie Pre Release Highlights : ముఖ్య గమనిక మూవీ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశ్వక్ సేన్ ఏమన్నారంటే !

Mukhya Gamanika Movie Pre Release Highlights e1708431745742

విరాన్ ముత్తంశెట్టి హీరోగా లావణ్య హీరోయిన్ గా శివిన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజశేఖర్ మరియు సాయి కృష్ణ నిర్మాతలుగా కొత్త దర్శకుడు వేణు మురళీధర్. వి దర్శకత్వంలో వస్తున్న సినిమా ముఖ్య గమనిక. ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు, టీజర్ మరియు ట్రైలర్ కు భారీ స్పందన లభిస్తోంది. హీరో విశ్వక్ సేన్ ముఖ్యఅతిథిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ సినిమాని ఫిబ్రవరి 23న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు.

Mukhya Gamanika Movie Pre Release Highlights2

ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ : విరాన్ నేను జిమ్ ఫ్రెండ్స్. చాలా మంచి వ్యక్తి. వెనక ఎంత బ్యాగ్రౌండ్ ఉన్న తన సొంత కష్టం మీద పైకి రావాలనుకుంటున్నాడు. విరాన్ నన్ను అన్నా అంటాడు కానీ నేను విరాన్ని అన్నా అని పిలవాలి. ఫిబ్రవరి 23న ఈ సినిమా రిలీజ్ అవుతుంది విరాన్ కి ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని టీమ్ అందరికీ కూడా పెద్ద విజయం అందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

డైరెక్టర్ వేణు మురళీధర్ మాట్లాడుతూ : ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చి మా సినిమాను సపోర్ట్ చేస్తున్న విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాను అంటే కారణం అల్లు అర్జున్ గారు. విరాన్ ముత్తంశెట్టి ఈ సినిమా ఒప్పుకోవడం నా అదృష్టం. సమయాన్ని కరెక్ట్ గా పాటించే వ్యక్తి. హీరోయిన్ లావణ్య చాలా బాగా చేసింది. కిరణ్ అందించిన మ్యూజిక్ చాలా బాగా వచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమాతో నాకు సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఆశీర్వదించాలని ఈ సినిమాని మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

Mukhya Gamanika Movie Pre Release Highlights1

హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ : ఫిబ్రవరి 23న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులకి నచ్చే అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నాయి. లవ్ డ్రామా సస్పెన్స్ మంచి మ్యూజిక్ అన్నీ ఉన్నాయి. నాకు హీరోయిన్ గా ఇంతక మంచి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ వేణు మురళీధర్ గారికి మా ప్రొడక్షన్ టీం శివిన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ కి కృతజ్ఞతలు. విరాన్ చాలా మంచి వ్యక్తి మంచి సపోర్టివ్. అలాగే ఈవెంట్ కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసిన విశ్వక్ సేన్ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాని మంచి సక్సెస్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.

mukhya 1

హీరో విరాన్ ముత్తంశెట్టి మాట్లాడుతూ : మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వేణు గారికి నా ప్రొడ్యూసర్స్ కి చాలా థ్యాంక్స్. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఎడిటింగ్ సినిమాటోగ్రఫీ అన్ని చాలా బాగుంటాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. షూటింగ్లో బిజీ ఉండి కూడా నాకోసం వచ్చారు విశ్వక్ అన్న ఆయన కు చాలా థాంక్స్.

నా వెనకే ఉండి నన్ను సపోర్ట్ చేసే అల్లు అర్జున్ గారికి నా కజిన్ శిరీష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఇలా మాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :

విరాన్ ముత్తంశెట్టి, లావణ్య, ఆర్యన్ మరియు చిత్రం భాష.

టెక్నీషియన్స్ :

బ్యానర్ : శివిన్ ప్రొడక్షన్స్,ప్రొడ్యూసర్స్ : రాజశేఖర్ మరియు సాయి కృష్ణ,మ్యూజిక్ డైరెక్టర్ : కిరణ్ వెన్న,ఎడిటర్ : శివ శర్వాణి,డిఓపి మరియు డైరెక్టర్ : వేణు మురళీధర్. వి,పి ఆర్ ఓ : ధీరజ్ -ప్రసాద్ , గుదిబండ్ల గణేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *