మూవీ: మిస్టర్ ప్రేగ్నెంట్ (MrPregnent):
విడుదల తేదీ : ఆగస్టు 18, 2023
నటీనటులు: సోహెల్, రూప కొడువయూర్, సుహాసిని మణిరత్నం, వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర తదితరులు
దర్శకుడు : శ్రీనివాస్ వింజనంపాటి
నిర్మాతలు: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి
సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీ
ఎడిటర్: ప్రవీణ్ పూడి
మిస్టర్ ప్రేగ్నెంట్ మూవీ రివ్యూ:
బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా వచ్చిన తాజా చిత్రం `మిస్టర్ ప్రెగ్నెంట్`. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి దర్శకత్వం వహించారు. రూపా కొడువయుర్ హీరోయిన్‌గా నటించింది. ఈ మిస్టర్ ప్రెగ్నెంట్`సిన్మా అప్పిరెడ్డి, రవీందర్‌రెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి మైక్ మూవీస్ పతాకంపై సంయుక్తంగా నిర్మించారు.
కాగా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి తెలుగు సిన్మా ప్రేక్షకులును ఈ మిస్టర్ ప్రెగ్నెంట్ సిన్మా ఏ మేరకు మెప్పించిందో మా 18f మూవీస్ టీం సమీక్ష చదివి తెలుసుకుందామా !
కథ ని పరిశీలిస్తే (Story line):
గౌతమ్ (సోహెల్) ఓ అనాథ. చిన్నప్పటినుండి కస్ట పడుతూ ప్రస్తుత జనరేసన్ ఇష్టపడే టాటూ ఆర్ట్ ని వృత్తిగా చేసుకొని సిటీ లో టాప్ టాటూ ఆర్టిస్ట్ గా ఫుల్ క్రేజ్ తెచ్చుకుంటాడు. పైగా టాటూ కాంపిటీషన్స్‌లోనూ విన్ అవుతాడు. మరోవైపు గౌతమ్ ను చదువుకునే రోజుల నాటి నుంచే మహి (రూపా కొడువయూర్) ప్రాణంగా ప్రేమిస్తుంది.
కానీ, గౌతమ్ ఆమె ప్రేమను సీరియస్ గా తీసుకొడు. అయితే, ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం తనను అంతగా ఇస్తా పడుతున్న మహి మనసు ని అర్దం చేసుకొని పెళ్లి చేసుకొంటాను కానీ , పిల్లలను కనవద్దు అంటాడు. అలా అయితేనే పెళ్లి చేసుకొంటాను అని కండిషన్ పెడతాడు.
అసలు గౌతమ్ పిల్లల్ని కనకూడదు అని ఎందుకు నిర్ణయించుకుంటాడు ?,
గౌతమ్ (సోహెల్) జీవితంలో జరిగిన విషాదం ఏమిటి ?,
ప్రేమను ఒప్పుకోని పిల్లలను వద్దు అనడానికి కారణం ఏమిటి ?
గౌతం మహీ పెళ్లి చేసుకొన్నారా ? మహీ పరిస్థితి ఏమిటి ?
చివరకు తనే గర్భం మోయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ?,
డాక్టర్ వసుధ (సుహాసిని మణిరత్నం) పాత్ర ఏమిటి ?,
చివరికి `మిస్టర్ ప్రెగ్నెంట్’ గా గౌతమ్ (సోహెల్) జర్నీ ఎలా సాగింది ?
మగవాడు గర్బం దాల్చదాన్ని కాలనీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకొన్నారు
మహీ తల్లిదండ్రులు ఎలా అంగీకరించారు ?
అనే ప్రశ్నలు మీకు ఇంటరెస్టింగ్ అనిపిస్తే ఎంటనే మీ దగ్గరలోని దియేటర్ కి ఇంట్లో ఆదావరిని అందరినీ తీసుకొని వెళ్ళండి.
కధ ను నడిపే కధనం పరిశీలిస్తే (Screen– Play):
మేల్ ప్రెగ్నెన్సీ అనే పాయింట్ వినడానికే విచిత్రంగా ఉన్న ఈ కాన్సెప్ట్ తో చేసిన సినిమా ప్రయోగం బాగానే ఉన్నప్పటికీ.. మొదటి అంకం (ఫస్ట్ హాఫ్) లో అంత ఎఫెక్టివ్ గా సీన్స్ యొక్క కధనం నడవలేదు. సినిమాలో కధ వస్తువు చిన్నదే అయినా కథనం తో మవప్పించవచ్చు కానీ దర్శకుడు రెగ్యులర్ గా, రొటీన్ కధనం (స్క్రీన్ ప్లే ) రాసుకోవడం వలన కొన్ని చోట్ల బోరింగ్ అనిపించి అదే ఈ సినిమాకి మైనస్ అయ్యాయి.
ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. కధ ను ముందుకు నడపడం కోసం అలాంటి సీన్స్ రాసుకొన్నాడా అని పిస్తుంది. ఇక హీరో మిస్టర్ ప్రెగ్నెంట్ గా మారడానికి సంబంధించిన సీన్స్ ఇంకా స్ట్రాంగ్ గా చూపించాల్సింది.
హీరోకి చిన్నప్పుడు జరిగిన విషాదం గురించి ముందే టైటిల్స్ లో వివరించి స్క్రీన్ ప్లేను నడిపి ఉండి ఉంటే.. ఆడియన్స్ మరింతగా కథలోకి ఇన్ వాల్వ్ అయ్యేవాళ్ళు. అయితే, సినిమాలో కొన్ని చోట్ల నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి.. దీనికి తోడు రెండవ అంకం (సెకండ్ హాఫ్) స్క్రీన్ ప్లే కూడా రొటీన్ మీడియా చర్చా వేదికల చుట్టూనే నడుస్తోంది.
ముఖ్యంగా సినిమా మొదటి అంకం లో ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ ను తగ్గించిన లేదా మరో రకమైన కధనం రాసుకొని ఉంటే సినిమా రిజల్ట్ మరో లా ఉండేది.
దర్శకుడు మరియు నటి నటుల ప్రతిభ పరిశిలిస్తే:
దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగున్నాయి. మగవాళ్లు ప్రెగ్నెంట్ అవ్వడమనే ఓ కొత్త ప్రయోగంతో వచ్చిన ఈ `మిస్టర్ ప్రెగ్నెంట్` చిత్రంలో కొన్ని ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి.
అలాగే, హీరో పాయింట్ ఆఫ్ వ్యూ లో వచ్చే డైలాగ్స్, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, ముఖ్యంగా తన భార్యకు ఏ ఆపద జరగకుండా తానే ప్రెగ్నెంట్ తీసుకోవడం.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు.. క్లైమాక్స్, క్లైమాక్స్ లో హీరో చెప్పే డైలాగ్స్ బాగున్నాయి.
సోహెల్ హీరోగా వచ్చిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామాలో గౌతం పాత్ర లో సోహెల్ బాగానే నటించాడు. తన స్టైలిష్ లుక్స్ , యాక్షన్ తో కూడా సోహెల్ అదరగొట్టాడు. అన్నిటికీ మించి సోహెల్ ఈ సినిమాలో మిస్టర్ ప్రెగ్నెంట్ గా ఫ్రెష్ గా కనిపించాడు.
హీరోయిన్ డాక్టర్ రూప కొడువయూర్ కూడా బాగానే నటించింది. ఆమె హోమ్లీ లుక్స్ బాగున్నాయి. కొన్ని ఎమోషనల్ సీన్స్ లో మహీ పాత్ర లో జీవించింది అని చెప్పవచ్చు.
సుహాసిని మణిరత్నం చాలా రోజుల తర్వాత తన పాత్రతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. లేడి డాక్టర్ గా మెంతర్ గా అద్భుత మైన నటనతో మెప్పించారు.
ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. వైవా హర్ష, బ్రహ్మాజీ, అభిషేక్, రాజా రవీంద్ర కాసేపు నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:
దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఓ కొత్త పాయింట్ తో ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ కమర్షియల్ సినిమాను చూసిన ఫీలింగే వస్తుంది.
శ్రవణ్ భరద్వాజ్ సంగీతం విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం బాగుంది. రెండు పాటలు కూడా చాలా బాగున్నాయి.
నిజార్ షఫీ సినిమాటోగ్రఫి ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ చాలా ఎఫెక్టివ్ గా తీశారు.
ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
నిర్మాతలు అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి లను ఇటువంటి డేరింగ్ పాయింట్ తో సినిమా తీసినందుకు మెచ్చుకోవాలి.
18F మూవీస్ టీం ఒపీనియన్:
మిస్టర్ ప్రెగ్నెంట్` చిత్రంలో మెయిన్ పాయింట్ , ఎమోషనల్ సన్నివేశాలు, క్లైమాక్స్ మరియు బ్రహ్మాజీ episode కామెడీ ఆకట్టుకున్నాయి. సోహెల్ తన నటనతో గౌతం పాత్రలో తో ఆకట్టుకున్నాడు. అయితే, చాలా చోట్ల లాజిక్స్ మిస్ అవ్వడం, కొన్ని సీన్స్ స్లో నేరేషన్ తో సినిమా సాగడంతో కొంచెం బోరింగ్ అనిపించవచ్చు . ఫైనల్ గా ఈ చిత్రం యొక్క ప్రధాన కథాంశం, కొన్ని ఎమోషనల్ అండ్ కామెడీ సీన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి.
ముఖ్యంగా ఆడవారికి బాగా నచ్చే సినిమా ఇది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ మనసుతో పాటు మిగిలిన ఆడవాళ్ళ మనసును కూడా దోచుకుంటుంది. దర్శకుడి ఆలోచనకు, నిర్మాతల గట్స్ కి హ్యాట్స్ప్ చెప్పాల్సిందే !
టాగ్ లైన్: ఆడవాళ్ళు మీకు జోహార్లు !
18F Movies రేటింగ్: 2.75 / 5
* కృష్ణ ప్రగడ.