Mr Pregnant heroine special: వెండితెరపై అద్భుతం రూప కొడువాయూర్.. అచ్చ తెలుగమ్మాయికి అవకాశాలు వెల్లువ !

IMG 20230902 WA0100

 

రూప కొడువాయుర్ పేరు ఇంటుంటే ఏదో మలయాళ అమ్మాయి లా ఉన్నా అచ్చమైన తెలుగు అమ్మాయి. చక్కని తెలుగు మాట్లాడే అందాల ముద్దుగుమ్మ రూప. పేరులోనే కాదు రూపంలో కూడా అందమే. చక్రాల్లాంటి కళ్లతో , బుగ్గలపై డింపుల్స్ తో, చందమామ నవ్వినంత స్వచ్చంగా కనిపిచ్చే ఈ అమ్మాయి వెండితెరపై అలరిస్తోంది.

చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టంతో క్లాసికల్ డ్యాన్స్ ను నేర్చుకుంది. తరువాత ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయింది. వృత్తిరిత్య డాక్టర్ అయిన రూప తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

20230902 164853

2020లో వచ్చిన ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ నేటీవ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ. తన మొదటి సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయినప్పటికి కేవలం తన నటనాప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. అలాగే వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తుంది.

IMG 20230902 WA0101

ROOPA prasthutham లండన్ లో MD(Doctor Of Medicine) చేయడానికి ప్లాబ్ 2 పరీక్షకు సన్నద్దం అవుతున్నారు.

హీరో సోహెల్ జోడిగా రూప కొడువాయూర్ నటించిన తాజా చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. ఈ సినిమా నేరుగా బిగ్ స్క్రీన్లో విడుదల అవడంతో హీరోయిన్ కు మంచి పేరు వచ్చింది. సినిమాలో తన నటన చూసి ముగ్దులయ్యారు. బేసిగ్గా తాను క్లాసికల్ డ్యాన్సర్ కావడంతో సూనసాయంగా నటించగలదు.

20230902 165006

అద్భుతమైన హవభావాలు పలికిస్తుంది. అదే తనకు ప్లస్ అయింది. అందుకే స్క్రీన్లో తాను ఎంత సమయం ఉన్నా అలా చూస్తూ ఉండి పోతాము. ఎంత మంది ఉన్నా రూప ప్రత్యేకంగా కనిపిస్తుంది. మంచి అవకాశలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతుంది.

IMG 20230902 WA0102

ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు రూప కొడవయూర్ లీడ్ రోల్ లో నటించిన ఒక యాక్షన్ సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ డిసెంబర్లో తెలుగు, తమిళ్ రెండు భాషల్లో విడుదలకు ముస్తాబు అవుతోందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ నెలలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ఇండస్ట్రిలో పేరు మోసిన బడా Pan India Distribution సంస్థ ద్వారా విడుదలకు సిద్దం అవుతుందని సమాచారం.

20230902 165353

తెలుగు అమ్మాయిలను పరిశ్రమకు ఆహ్వానించే దర్శక నిర్మాతలకు రూప కొడువాయూర్ ఒక కళాఘని చెప్పవచ్చు. సరైన సినిమా పడితే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు. మరి మంచి పాత్రలతో రూప అలరించాలని విష్ చేద్దాం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *