తమన్ చేతుల మీదుగా “మిస్టర్ ఇడియ‌ట్‌”  లిరికల్ సాంగ్ రిలీజ్ !

IMG 20241104 WA0080 e1730737286481

 మాస్ మహరాజ్ రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా న‌టిస్తోన్న‌ సినిమా “మిస్టర్ ఇడియ‌ట్‌“. ఈ చిత్రంలో సిమ్రాన్ శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. జేజేఆర్ ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్ఎల్ పీ పతాకంపై శ్రీమతి యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమాను నిర్మిస్తున్నారు.

పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సోషల్ మీడియా ద్వారా “మిస్టర్ ఇడియ‌ట్‌” సినిమా నుంచి ‘కావాలయ్యా..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘కావాలయ్యా..’ సాంగ్ కంపోజిషన్, పిక్చరైజేషన్ చాలా బాగుందన్న తమన్..హీరో మాధవ్ తో పాటు ఎంటైర్ మూవీ టీమ్ కు బెస్ట్ విశెస్ అందించారు.

‘కావాలయ్యా..’ పాటను అనూప్ రూబెన్స్ మంచి బీట్ తో కంపోజ్ చేయగా భాస్కరభట్ల క్యాచీ లిరిక్స్ అందించారు. గాయని మంగ్లీ ఎనర్జిటిక్ గా పాడారు. ‘కళ్లల్లోకి కళ్లు పెట్టి అదోలా చూశావయ్యా, మాటల్తోనే మనసుకు మందే పెట్టావయ్యా, తస్సాదియ్యా, తస్సాదియ్యా, పచ్చి పచ్చిగ చెప్పాలంటే పిచ్చిగ ఫిదా అయ్యా, పూవుల్తోటి పొట్లం గట్టి మేరె దిల్ దియా, చూస్కోవయ్యా, తీస్కోవయ్యా, కావాలయ్యా, నువ్వే కావాలయ్యా…’ అంటూ ఆకట్టుకునేలా సాగుతుందీ పాట

IMG 20241103 WA0077

నటీనటులు :

మాధ‌వ్‌, సిమ్రాన్ శ‌ర్మ‌, తదితరులు

టెక్నికల్ టీమ్:

డైలాగ్స్ – శ్యామ్, వంశీ,సంగీతం అనూప్ రూబెన్స్,లిరిక్స్ – శివశక్తి దత్తా, భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్,కొరియోగ్రఫీ – భాను, జిత్తు, వెంకట్, పృథ్వీస్టంట్స్ – రాజేశ్ లంక,సినిమాటోగ్రఫీ – రామ్ రెడ్డి,ఆర్ట్ – కిరణ్ కుమార్ మన్నె,ఎడిటింగ్ – విప్లవ్ నైషధం,పీఆర్వో – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్),నిర్మాత – జేజేఆర్ రవిచంద్,రచన, దర్శకత్వం – గౌరి రోణంకి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *