Upendra Gadi Adda Movie Review & Rating:  ‘ఉపేంద్రగాడి అడ్డా’ రివ్యూ ఎలా ఉంది అంటే ? 

Upendra Gadi Adda Movie Review by 18F Movies 7 e1701437673337

 

మూవీ : ఉపేంద్రగాడి అడ్డా  (Upendra Gadi Adda)

విడుదల తేదీ: డిసెంబర్‌ 1, 2023,

నటి నటులు: కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ, మురళీధర్‌ గౌడ్‌, అప్పారావు, కిరీటి దామరాజు, సంధ్య జనక్‌ తదితరులు,

నిర్మాణ సంస్థ: ఎస్‌ఎల్‌ ఎస్‌ క్రియేషన్స్‌,

నిర్మాత: కంచర్ల అచ్యుతరావు,

దర్శకత్వం: ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌. కె ,

ఉపేంద్రగాడి అడ్డా’ రివ్యూ (Upendra Gadi Adda Review):

కొత్త నటుడు కంచర్ల ఉపేంద్ర హీరోగా సావిత్రి కృష్ణ హీరోయిన్ గా ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వంలో ఎస్‌.ఎస్‌.ఎల్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై కంచర్ల అచ్యుతరావు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఈ సినిమా ఈ శుక్ర వారం అనగా డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఎస్‌.ఎస్‌.ఎల్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై తన కుమారుడు కంచర్ల ఉపేంద్రను హీరోగా పరిచయం చేస్తూ కంచర్ల అచ్యుతరావు నిర్మించిన చిత్రం  ‘ఉపేంద్రగాడి అడ్డా’. మొదటి సినిమా కె తన పేరును చేర్చి ఉపేంద్ర గాడి అడ్డా అంటూ యువత ని ఆకర్శించే ప్రయత్నం చేశాడు.

Upendra Gadi Adda Movie Review by 18F Movies 5

కధ పరిశీలిస్తే (Story Line): 

జీవితానికి ,బరువు బాధ్యత అంటూ ఏమి లేకుండా హ్యాపీగా తిని తిరిగే బంజారాహిల్స్‌ బస్తీకి చెందిన యువకుడు ఉపేంద్ర. స్నేహితులతో కలిసి ఆ బస్తీని అడ్డాగా చేసుకుని తిన్నమా.. పడుకున్నామా.. తెల్లారిందా అన్నట్లు సాగిపోతుంటుంది అతని జీవితం. ఇలాసాగుతున్న తరుణంలో అతని స్నేహితుడి సలహా మేరకు కోటీశ్వరుడి కూతురుని చూసి లైన్‌లో పెట్టి హై ఫై జీవితాన్ని అనుభవించాలనేది ఉపేంద్ర అండ్‌ కో ప్లాన్‌.

డబ్బు ఉన్న అమ్మాయిని మెయిన్టైన్ చేయాలి అంటే డబ్బు కావాలి కదా.. డబ్బు కోసం  పక్క బస్తీలో ఉన్న ఓ రౌడీ షీటర్‌ దగ్గర అధిక వడ్డీకి అప్పు చేసి, పబ్బులు చుట్టూ తిరుగుతూ చివరకు సావిత్రి అనే అమ్మాయిని లైన్‌లో పెడతాడు. ఆమెకు తాను కోటీశ్వరుడి కొడుకునని అబద్ధం చెపుతాడు. ఆ అబద్ధాన్ని నిజం చేయటానికి మెయింటెనెన్స్‌కు డబ్బు కోసం అప్పులు చేస్తారు. అలా కేవలం డబ్బుకోసమే ప్రేమించాలనుకున్న అతను సావిత్రని నిజంగానే ప్రేమిస్తాడు. దీంతో తన గురించి ఆమెకు నిజం చెప్పేస్తానని బయలుదేరుతాడు ఉపేంద్ర.

తాను ప్రేమించిన అమ్మాయికి నిజం చెప్పేశాడా?

ఆ అమ్మాయి ఎలా రియాక్ట్‌ అయ్యింది?.

ఇలాంటి కధ లోకి  దుబాయ్‌కి అమ్మాయిలను కిడ్నాప్‌ చేసి అమ్మేస్తున్న వారు ఎవరు ?

ఆ అమ్మాయల ముఠా చేతిలో చిక్కుకున్న తన చెల్లెల్ని, ప్రియురాల్ని ఎలా కాపాడుకున్నాడు?

కోటీశ్వరుడు అవ్వాలనే తన ఆశను నెరవేర్చుకున్నాడా? లేదా ? 

చివరాకరకు ఉపేంద్ర కోటీశ్వర రాలు అమ్మాయి ప్రేమను పొందెడా ?  

అనే ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే ఈ ఉపేంద్ర గాడి అడ్డా సిన్మా వెండితెరమీద చూడాల్సిందే.

కధనం పరిశీలిస్తే (Screen – Play):

Upendra Gadi Adda Movie Review by 18F Movies 2

ఉపేంద్ర గాడి అడ్డా సిన్మా కధ పాతదే అయినా హీరో ని కమర్షియల్‌ స్టార్‌గా నిలపడం కోసం రాసుకొన్న కధనం (స్క్రీన్ – ప్లే ) విశయం లో దర్శకుడు విజయం సాదించినట్టే.  ఇంకా ప్రస్తుత యువత సోషల్ మీడియా వలన ఎలా పాడైపోతున్నారో చూపించే ప్రయత్నం జరిగింది.

అయితే ఒకటి రెండు స్ట్రాంగ్ సీన్స్ ద్వారా దర్శకుడు సోషల్‌ మీడియాకు సంబంధించి జరుగుతున్న ఆరచకాలను  ఇంకొంత ఎన్‌లార్జ్‌ చేస్తే బాగుండేది. అలాగే మొదటి అంకం ( ఫస్టాఫ్‌) లో అక్కడక్కడా కొన్ని సీన్స్  లాగ్‌ అనిపించినప్పటికీ తరువాత వచ్చే సీన్‌తో దాన్ని కవర్‌ చేశాడు దర్శకుడు.

మరో డ్యూయెట్‌ కూడా ఉంటే మాస్ ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారు. ఓవరాల్‌గా చెప్పాలంటే చిన్న మెసేజ్‌తో కూడిన పక్కా కమర్షియల్‌ అడ్డా… ఈ ‘ఉపేంద్రగాడి అడ్డా’.

దర్శకుడు, నటి నటులు ప్రతిభ పరిశీలిస్తే:

దర్శకుడు ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. రాసుకొన్న కధ ఈ  ఉపేంద్ర గాడి అడ్డా సిన్మా ను కథ పరంగా చూస్తే ఇదొక ఫక్తు కమర్షియల్‌ సినిమా లా చేశాడు. కమర్షియల్‌ అంశాలతో పాటు సోషల్‌ మీడియా వేదికగా చేసుకుని కొందరు అమ్మాయిలను ఎలా వేధిస్తున్నారు. వారిని ఎలా ట్రాప్‌ చేస్తున్నారు అనే విషయాన్ని చర్చించటం ద్వారా సోషల్‌ మెసేజ్‌ను  కొంచెం కమర్షియల్ ఫార్మెట్ లో చెప్పే ప్రయత్నం లో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

టైటిల్‌ రోల్‌ పోషించిన కంచర్ల ఉపేంద్ర డెబ్యూ మూవీతోనే తన వరకు సినిమాకు న్యాయం చేశాడు. పాటల విషయంలో కానీ.. ఫైట్స్‌, డైలాగ్స్‌ వంటి వాటిలో మాగ్జిమమ్‌ ఎఫర్ట్‌ పెట్టాడని చెప్పాలి. ఒక కమర్షియల్‌ హీరోకు కావాల్సిన కటౌట్‌తో పాటు, డాన్స్‌, ఫైట్స్‌, డైలాగ్‌ డెలివరీ బాగుండటం ఉపేంద్రకు కెరీర్‌కు కలిసివచ్చే అంశాలు. అలాగే అతను క్లోజప్‌లో నాగచైతన్యను, లాంగ్‌ షాట్స్‌లో తారకరత్నలను పలుమార్లు గుర్తు చేశాడు.

హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌ పోకిరి సినిమాలో మహేష్‌ ఇంట్రడక్షన్‌ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని చేసినట్లు ఉంది. అలాగే పాటల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. తొలి సినిమాతోనే కమర్షియల్‌ ఫార్మాట్‌ను చక్కగా ఫాలో అయ్యాడు.

ఉపేంద్ర నటిస్తున్న మరో 4 ప్రాజెక్ట్‌లు సెట్స్‌ మీద ఉండటం, అతని తొలి చిత్రం ఇదే కావడంతో హీరో ఉపేంద్ర మీద బాధ్యత ఎక్కువగా పడింది అనిపిస్తుంది.

హీరోయిన్‌గా చేసిన సావిత్రికృష్ణ అటు రిచ్‌ అమ్మాయిగా, ఇటు సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా తన నటనతో మెప్పించింది. రీల్స్‌ మోజులో పడి చిక్కుల్లో పడ్డ అమ్మాయిగా నటించిన హీరో చెల్లెలు పింకీ పాత్రధారి, హీరో తల్లి, తండ్రులు, అతని స్నేహితులు తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి.

Upendra Gadi Adda Movie Review by 18F Movies 3

సాంకేతిక నిపుణుల ప్రతిభ పరిశీలిస్తే: 

నిర్మాత కంచర్ల అచ్యుతరావు చిన్న సినిమా కదా అనే ఏదో చుట్టేసే పని పెట్టుకోకుండా కొడుకును కమర్షియల్‌ స్టార్‌గా నిలబెట్టుకోవటానికి తనవంతు ప్రయత్నం చేశారు. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన పెట్టిన ఖర్చు మనకు కనపడుతుంది.

ఊటీలో చేసిన డ్యూయెట్‌ సాంగ్‌, పబ్‌ సాంగ్స్‌, ఫైట్స్‌ వంటివి వాటికి పెట్టిన ఖర్చు మెచ్చుకోదగింది. తన కుమారుడితో మరో 4 సినిమాలు నిర్మిస్తుండడం కొడుకు నటనపై ఆయనకున్న నమ్మకానికి నిదర్శనం.

Upendra Gadi Adda Movie Review by 18F Movies 4

18F మూవీస్ టీమ్ ఓపీనియన్ : 

ఆర్యన్‌ సుభాన్‌ ఎస్‌.కె. దర్శకత్వం వహించిన ఈ చిత్రం పేరుకే చిన్న సినిమా అయినప్పటికీ ప్రతి ఫ్రేమ్‌ వీలైనంత రిచ్‌గా కనపడేలా చూసుకున్నాడు. కెమెరా పనితనం, డైలాగ్స్‌, సాంగ్స్‌, ఫైట్స్‌ వంటివి దర్శకుడికి 24 క్రాఫ్ట్స్‌పై ఉన్న పట్టును తెలియచేస్తాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. దర్శకుడిగా తన కెరీర్‌తో పాటు కమర్షియల్‌గా ఉపేంద్ర కూడా మంచి బేస్‌ పడేలా చూసుకున్నాడు.

దర్శకుడు  సోషల్ మెసేజ్ ఉన్న చిన్న కధ ను కొంచెం కమర్షియల్ హంగులు దృశతిలో పెట్టుకొని,  తాను చెప్పాలనుకున్న మెసేజ్‌కు కమర్షియల్‌ బౌండరీస్‌ కరెక్ట్‌గా గీసుకుని వాటిని ఏమాత్రం క్రాస్‌ చేయకుండా చూసుకున్నాడు. ఓవరాల్ గా యువత చేసే చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకొక తప్పదు అని చెప్పే పద్దతి బాగానే ఉంది.

Upendra Gadi Adda Movie Review by 18F Movies

చివరి మాట: మెసేజ్ తో ఉన్న మాస్ అడ్డా ! 

18F RATING: 2 .75 / 5

   * కృష్ణ ప్రగడ.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *