సినిమా: టాప్ గేర్
విడుదల తేదీ : డిసెంబర్ 30, 2022
నటీనటులు: ఆది సాయి కుమార్, రియా సుమన్, బ్రహ్మాజీ
దర్శకుడు : శశికాంత్
నిర్మాత: కె.వి.శ్రీధర్ రెడ్డి
సంగీత దర్శకులు: హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
ఎడిటర్: ప్రవీణ్ పూడి
టాప్ గేర్ తెలుగు రివ్యూ (Top Gear Movie Review):
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “టాప్ గేర్”. ఈ ఏడాది తాను నటించిన మరో చిత్రం ఇది కాగా ఈ చిత్రం ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది.
మరి ఈ చిత్రం ఎలా ఉందో మా టీం తో పాటూ చూసిన సినీ లవర్స్ ని ఏ మేరకు మెప్పించిందో మా 18F MOVIES టీం సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందామా !

కధ ను పరిశీలిస్తే (story line):
.సిద్ధార్థ్(మైమ్ గోపి) ఓ పెద్ద డ్రగ్ డీలర్ కాగా ఈ క్రమంలో తాను ముంబై నుండి సింగపూర్ కి పారిపోవాలని ప్లాన్ చేసుకుంటాడు. ఈ ప్లానింగ్ లో డీల్ నిమిత్తం హైదరాబాద్ కి వచ్చి పోలీస్ రైడింగులో చిక్కుకొంటాడు. ఇక మరోపక్క అర్జున్(ఆది సాయికుమార్) అప్పుడే పెళ్లి చేసుకొని ఓ క్యాబ్ కి ఓనర్ కమ్ డ్రైవర్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు.
అనూహ్యంగా క్యాబ్ డ్రైవరు అర్జున్ ఈ డ్రగ్ రాకెట్ లో చిక్కుకోగా నెక్స్ట్ తన భార్య ఆధ్య(రియా సుమన్) ని కాపాడుకోవడం కోసం ఆ డ్రగ్ లీడర్ చెప్పినట్టు చెయ్యాల్సి వస్తుంది.
మరి ఈ రాకెట్ నుంచి తాను అర్జున్ ఎలా బయటకి వస్తాడు?
తన భార్య ఆద్య ని కాపాడుకోగలుగుతాడా?
డ్రగ్ లీడర్ సిద్ధార్థ్ అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చాడు ?
హైదరాబాద్ పోలీస్ లు తనను ఎలా గుర్తిపట్టారు ?
అసలు మాల్ దొంగిలించిన డేవిడ్ ఎవరు ?
అర్జున్ కి డేవిడ్ కి సంబందం ఉందా ?
అర్జున్ డేవిడ్ ని పట్టుకొన్నాడా ?
ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా ఇంటెరస్ట్ క్రియేట్ చేస్తే ఆ ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంటే ఈ టాప్ గేర్ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.
దర్శకుడి,నటి నటుల ప్రతిభ పరిసిసలిస్తే:
దర్శకుడు: కథ రాసుకోవడంలో దర్శకుడు తన ఐక్యూ వాడినా కధనం (స్క్రీన్ -ప్లే) లో మాత్రం ఈడేయలను క్యూ లో పెట్టడం మర్చిపోయాడు. అన్నీ నిర్మాతలకు అనుకూలంగా రాసుకోవడం వల్ల ఎక్కడా చాలెంజ్ కనపడదు. హీరోయిన్ వాకీటాకీ అందుకున్నప్పుడే క్యాబ్ డ్రైవరు అర్జున్ రెండు హత్యలు చేసి తప్పించుకున్నాడని వినపడడం సీన్ అనుకూలంగా రాసుకోవడానికి పరాకష్ట.
ఫస్టాఫులో హైలీ ట్రయిన్ద్ బ్లాక్ కమాండోలు లేజర్ గన్స్ తో వచ్చినా విలన్ చిన్న గాజు గ్లాస్ విసిరి డైవెర్ట్ చేసి ప్రతిదాడితో సింపుల్ గా హతమార్చడం మరో చిన్నపిల్లల వీడియొ గేమ్ లా ఉంది. ఇలాంటి సీన్స్ సగటు తెలుగు సినిమా ప్రేక్షకుడికి అర్ధం అయ్యేలా రాశాడా ?. తెలుగు లో ఉన్న హాలీవుడ్ దర్శకులే దీనికి భాష్యం రాయాలి.
ఎడిటింగ్ ని మాత్రం మెచ్చుకోవాలి. ఎక్కడా సాగతీత లేకుండా త్వరగా ముగించాడు ఈ బాలలచిత్రాన్ని.
హీరో: ఆది నటన బాగానే ఉంది కానీ ఈ సినిమా కి కథా-కథనాల ఎంపికే దెబ్బతీసింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో క్యాబ్ డ్రైవర్ గా, భర్తగా మంచి ఎమోషన్స్ ని పండించాడు. తన లుక్స్ పరంగా కూడా డీసెంట్ గా కనిపించాడు.

హీరోయిన్: రియా సుమన్ చూడ్డానికి బాగుంది కానీ హీరోయిన్ గా నటించడానికి పెద్ద పాత్ర ని ఇవ్వడం లో దర్శకుడు విపమయ్యాడు.
ఇతర నటులు: మెయిన్ విలన్ గా చేసిన మైమ్ గోపి మాత్రం నిండుగా ఉన్నాడు. పాత్రకి తగ్గట్టుగా సరిపోయాడు. ఏసీపీగా శత్రు విగ్రహం బాగానే ఉన్నా అత్యంత పేలవమైన క్యారెక్టర్ కావడంతో తేలిపోయాడు.
బ్రహ్మాజి, సత్యం రాజేష్ లు కాసేపు కనిపించి నవ్వించే ప్రయత్నం చేసినా వాళ్ల మార్కు పాత్రలు కాకుండా సుపారీ హంతకుల్లాగ కాసేపు కనిపించి రెవర్స్ గేర్ లో టపా కట్టేశారు. దువ్వాసి మోహన్ లాంటి వాళ్లు ప్యాడింగ్ ఆర్టిస్టులుగా దర్శనమిచ్చినా, వాళ్ళను శవాలు చేసి పడుకోబెట్టేశాడు.

కధ లో కధనం పరిశీలిస్తే (screen – Play):
ఈ సినిమా పేరుకి “టాప్ గేర్” కానీ అసలు కథ ఇంటెర్వల్ కి చేరినా కూడా ఫస్ట్ గేర్లో నే ఉంటుంది. కమల్ హాసన్ విక్రమ్ లెవెల్ లో డ్రగ్ మాఫియా లో కధ ఓపెన్ చేసినా కధనం తో గేర్ బాక్స్ ముట్టుకోకుండా న్యూట్రల్లో కారు ని నడిపినాటు సాగదీశాడు దర్శకుడు.
ఇక రెండవ అంకం అదే సెకండాఫులో అన్నా స్క్రీన్ ప్లే తో టాప్ గేర్ లో కధను నాడుపుతాడా అంటే అది ఇంకా దారుణం. ఫస్ట్ గేర్ వేసి ఫిల్మ్ నగర్ కొండలు ఎక్కుతున్న ఫీలింగొస్తుంది. ఎక్కడా ఎడ్జ్ ఆఫ్ ద సీట్లో కూర్చుని గోళ్లు కొరుక్కునేలాంటి సన్నివేశాలు లేవు. క్రైం బ్యాక్డ్రాప్లో తీసిన సినిమాకి ఉండాల్సిన ప్రాధమిక లక్షణాలు ఇందులో లేవు.
కథగా రాసుకున్నప్పుడు ఏవో కొన్ని ట్విస్టులు పెట్టుకున్నా అవి తెరమీద కధనం లోకి తేవడంలో దర్శకుడు విఫలమయ్యాడు.
సాంకేతిక విభాగం పరిసిసలిస్తే:

టాప్ గేర్ సినిమా సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే..
హర్ష వర్ధన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాలో డీసెంట్ గా ఉంది అలాగే తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రధమార్ధంలో ఒక పాటుంది. అది గుర్తుండేలా అయితే లేదు. ఇంకెక్కడా మనకి పాటలు వినపడవు.
సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ని మాత్రం మెచ్చుకోవాలి. ఎక్కడా సాగతీత లేకుండా త్వరగా ముగించాడు. నిర్మాతలు ఉన్నంతలో చక్కగా తీశారు అని చేపపెచ్చు. ఎలా అంటే దర్శకుడు వాడుకోవడానికి మంచి కారుని, క్లీన్ రోడ్డులాను అందించారు.

18f మూవీస్ టీం ఒపీనియన్:
తక్కువ బడ్జెట్ లో హైదరాబాద్ రోడ్లమీద చుట్టేసినట్టుగా ఉన్న కధ కి కాస్త ఇంటెరస్ట్ తో స్క్రీన్ ప్లే రాసుకొని ఉంటే కొంతైనా టెన్షన్ పెట్టే కథనం తోడై మంచి ఫలితం వచ్చేది. ప్రేక్షకులు సినిమా చూస్తూ టెన్షన్ పడతారో లేదో తెలియదు కానీ, సినిమా ఫలితాన్ని చూసి నిర్మాతలు టెన్షన్ పడాల్సిరావొచ్చు.
సినిమా టైటిల్ కార్డ్స్ నుండి టాప్ గేర్ వేసుకుని దూసుకుపోతుందను కుంటే అసలు గేర్ బాక్స్ లేని కారు గమ్యం తెలియక చెట్టుకి గుద్దుకొని ఆగిపోయినట్టు ఉంది.
టాగ్ లైన్: గేర్ బాక్స్ లేని టాప్ గేర్.
18 f Movies రేటింగ్: 2.25 / 5
* కృష్ణ ప్రగడ.