SHIVA KARTIKEYAN PRINCE MOVIE TELUGU REVIEW: తమిళ ప్రిన్స్ తెలుగు జాతి రత్నాలు (ఆడియన్స్ ) మెప్పించడా లేదా !

prince movie telugu review by 18 f

 

సినిమా: ప్రిన్స్

విడుదల తేదీ : అక్టోబర్ 21, 2022

నటీనటులు: శివ కార్తికేయన్, మరియా ర్యాబోషప్కా, సత్యరాజ్, ప్రేమ్ జి అమరన్, ఆనందరాజ్, సతీష్ కృష్ణన్, ప్రాంక్ స్టార్ రాహుల్

దర్శకత్వం : అనుదీప్ కెవి

నిర్మాతలు: ఏషియన్ సునీల్, డి సురేష్ బాబు, పుస్కూర్ రామ్మోహనరావు

సంగీతం: ఎస్ థమన్

సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస

ఎడిటర్స్: ప్రవీణ్ కేఎల్

డాన్, వరుణ్ డాక్టర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా  దగ్గరైన శివకార్తికేయన్  హీరోగా తెలుగు లో జాతిరత్నాలు చేసిన  అనుదీప్ కెవి దర్శకత్వంలో తమిళ తెలుగు భాషలలొ తెరకెక్కిన లేటెస్ట్ ఎంటర్టైనర్ మూవీ ప్రిన్స్.

ప్రిన్స్ కి హీరోయిన్ గా  ఉక్రెయిన్ నటి మరియా ర్యాబోషప్కా  నటించారు. ప్రిన్స్ సినిమా  ఓపెనింగ్  రోజు నుండి రిలిజే రోజు వరకూ సౌత్ ఇండియన్ సినీ ప్రేక్షకులలో మంచి అంచనాలు ఏర్పారచాడు.

ప్రిన్స్ మూవీ నేడు తెలుగు తమిళ భాషలలొ ఒకేసారి  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

prince pre release event on 18th

ఈ ప్రిన్స్ మూవీ తెలుగు లో ఎలా ఉందో చూద్దామా !.

కథ విసయనికి వస్తే: 

కృష్ణా జిల్లా దేవరకోట (నిజంగా ఉందో లేదో కధ రచయితకు తెలియాలి) లోని ఒక స్కూల్ లో సోషల్టీ సైన్స్  టిచర్ గా పని చేస్తున్న  ఆనంద్ (Siva karthikeyan), అదే స్కూల్ కి ఇంగ్లీష్ టీచర్ గా  కొత్తగా వచ్చిన జెస్సికా (Maria Riaboshapka) ని తొలి చూపులోనే ప్రేమించడం మొదలు పెడతాడు.

అయితే ఆమె బ్రిటిష్ దేశానికి  చెందిన యువతి కావడంతో ఆనంద్ తండ్రి విశ్వనాధ్ (Sathyaraj) కి వారి ప్రేమ నచ్చదు. అయితే అదే దేవరకోట గ్రామం లో హీరోయిన్ తండ్రి ఒక భూ కబ్జా సమస్యలో ఇరుక్కోవడంతో, దానిని పరిష్కారించేందుకు హీరో రంగంలోకి దిగుతాడు.

ఇటువంటి సమస్యల  మధ్య ఆనంద్, జెస్సికాల ప్రేమ ఫలించిందా ?,

అలానే హీరోయిన్ తండ్రి స్థలం వివాదం ఎలా పరిష్కరించబడింది ?

హీరో తండ్రి కొడుకు ప్రేమ ను అంగీకరించడా ?

ఆంద్ర గ్రామ సమస్య భారత – బ్రిటిష్ దేశాల సమస్య ఎలా అయ్యింది ?

వంటి ప్రశ్నలకు బదులు కావాలంటే ప్రిన్స్ సినిమా థియేటర్ లోనే చూడాలి.

PRINCE PRE RELEASE VIJAY AND SK SOLO2

ప్రిన్స్ కి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే:

ప్రిన్స్ మూవీ కి పెద్ద ప్లస్ పాయింట్ హీరో శివ కార్తికేయనే అని చెప్పాలి. హీరోగా ఓక సినిమా నుండి మరో సినిమా కి  తన క్రేజ్ పెంచుకుంటూ పోతున్న శివ కార్తికేయన్ ఈ మూవీలో కూడా ఆనంద్ పాత్రలో కనబరిచిన ఎంటర్టైన్మెంట్ పెర్ఫార్మన్స్, ఫన్నీ డైలాగ్స్ చాలా బాగున్నాయి.

ఇక ఉక్రెయిన్ అందాలభామ మరియా కూడా తన పాత్ర పరిదిలో  అందం కనిపిస్తూ, అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

సినిమాలో హీరో తండ్రి గా  ప్రధాన పాత్ర చేసిన సత్యరాజ్, ప్రేమ్ జి  కూడా బాగా చేశారు. మన డైరెక్టర్ అనుదీప్ ప్రిన్స్ మూవీని ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు పూర్తి ఫన్నీ ఎంటర్టైనర్ గా మలిచారు.

చాలా చోట్ల వచ్చే కామెడీ సీన్స్ కి ఆడియన్స్ కి మరింతగా గిలిగింతలు పెట్టేలా ఉన్నాయి కానీ, కొంత వరకూ మాత్రమే బాగుంటుంది. పాత్రల స్వభావం మాత్రం మనకు జాతి రత్నాలు లనే లో-ఐక్యూ లో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాయి.

థమన్ సంగీతం, మనోజ్ పరమహంస విజువల్స్, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్, నిర్మాతల భారీ నిర్మాణ విలువలు ప్రి న్స్  ని చాలా రీచ్ గా ప్రెసెంట్ చేశాయి.

PRINCE PRE RELEASE VIJAY AND SK 1

ప్రి న్స్ లో మైనస్ పాయింట్స్ ఏంటంటే:

ప్రి న్స్ సినిమాని ఆద్యంతం కామెడీతో ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి దర్శకుడు అనుదీప్ నడపడంతో చాలా వరకు సినిమా పెద్దగా బోర్ కొట్టదు.

అక్కడక్కడా వచ్చే కొన్ని సీన్స్ కావాలని సాగదీసి ఇరికించారేమో అనిపిస్తుంది. ముక్యంగా కూరకాయలు షాప్ దగ్గర స్వర కాయ లాంటి సన్నివేశాలు.  ఇంకా  మూవీలో ఆకట్టుకునే కథ ( story ), కథనాలు (screen-play ), థ్రిల్లింగ్ అంశాలు ఏమి లేవు.

అలానే ఓక సీన్ తరువాత వచ్చే మరో సన్నివేశాలు ఏమిటనేది ఆడియన్స్ కి ముందే తెలిసిపోతుంటుంది. హీరోయిన్ నానమ్మ తన ఫ్లాష్ బ్యాక్ వివరించే సన్నివేశాలను మరింత క్లియర్ గా  హృదయానికి హత్తు కునేల చూపిస్తే బాగుండేదనిపిస్తుంది.

సినిమాలో దాదాపుగా ప్రతి సీన్ కి, ప్రతి డైలాగ్ కి కామిక్ టచ్ ఇవ్వడంతో,  యాక్షన్, ఎమోషనల్, థ్రిల్లింగ్ మూవీస్ చూసేవారిని ఇది పెద్దగా ఆకట్టుకోదు. నవ్వడమే మహా బోగం అనుకొనే వారికి ఈ సినిమా చాలా జాలిగా ఉంటుంది.

PRINCE PRE RELEASE VIJAY AND SK TEAM BIG TICKET

దర్శకుడు, సాంకేతిక నిపుణుల వర్క్ పరిశీలిస్తే:

దర్శకుడు అనుదీప్ మూవీని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా పెద్దగా బోర్ కొట్టించకుండా ముందుకి నడిపిన తీరు కొంత లో కొంత బాగుంది.

థమన్ అందించిన సాంగ్స్ లో జెస్సికా, బింబిలికి సాంగ్స్ థియేటర్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకొనటున్నాయి. ముఖ్యంగా బింబిలికి సాంగ్ కి శివకార్తికేయన్ స్టెప్స్, థమన్ బీట్స్ కి థియేటర్స్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

మనోజ్ పరమహంస గ్రాండియర్ లుక్స్, సినిమాలో డీసెంట్ కలరింగ్ మనకి వైవిధ్యమైన క్లాసిక్ కలర్ లో మూవీ చూసిన ఫీల్ కలుగుతుంది.

కథ యొక్క పరిధి మేరకు ప్రవీణ్ ఎడిటింగ్ ఒకే. చాలా వరకు నిర్మాతలు పెట్టిన భారీ ఖర్చు మనకు తెరపైన కనపడుతుంది. అన్ని విభాగాల పనితీరు బాగానే ఉంది అని చెప్పవచ్చు.

PRINCE PRE RELEASE VIJAY AND SK TEAM 2

 

18F OPINION:

ప్రిన్స్ సినిమా గురించి చెప్పుకుంటే.. సరదాగా సాగే ఎంటర్టైన్మెంట్ మూవీస్ కోరుకునే వారికి బాగా నచ్చుతుంది. పెద్దగా ట్విస్టులు, థ్రిల్లింగ్ అంశాలు లేకుండా జస్ట్ నార్మల్ గా ఈ సినిమా సాగుతోంది.

 ప్రిన్స్ సినిమాని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కామెడీ టచ్ తో ఎంటర్టైన్మెంట్ మిక్స్ తో డైరెక్టర్ బాగానే  నడిపాడు.  వారంతం లో  సరదాగా ఫామిలీ కానీ ఫ్రెండ్స్ తో కానీ  కలిసి థియేటర్ కి వెళ్లి కామెడీ సినిమాను ఎంజాయ్ చేయాలనుకునే  ప్రిన్స్ ని ఒకసారి చూడొచ్చు.

ఆకరి మాట: ప్రిన్స్ వట్టి ప్రిన్స్ మాత్రమే,,,,రత్నం కాదు.

రివ్యూ బై కృష్ణా ప్రగడ

18F MovieS Rating: 2,75 / 5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *