SAMANTHA’S YASHODA MOVIE TELUGU REVIEW: గర్బానీకి అందానికి మధ్యలో ఏమోసనల్ సస్పెన్స్ త్రిల్లర్ డ్రామా !

యశోద తెలుగు రివ్యూ ఆఫ్ 18 ఫ

మూవీ: యశోద

విడుదల తేదీ : నవంబర్ 11, 2022

నటీనటులు: సమంత, వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పిక గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మ తదితరులు

దర్శకుడు : హరి – హరీష్

నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్

సంగీత దర్శకులు: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: ఎం. సుకుమార్

ఎడిటర్: మార్తాండ్. కె. వెంకటేష్

 

యశోద పోస్టర్

కథ ని పరిశీలిస్తే:

యశోద (సమంత)  తన చెల్లి ఆపరేషన్ కోసం ఆర్ధిక ఇబ్బందులతో డబ్బు కోసం సరోగసికి (అద్ది గర్బం) ఒప్పుకుంటుంది. తన లాగే డబ్బులు కోసం ఇబ్బందులు పడుతున్న పేద అమ్మాయిలకు డబ్బు ఆశ చూపించి సరోగసి తల్లులు గా  మారడానికి మధు (వరలక్ష్మి శరత్ కుమార్ ) తన నెట్వర్క్ ద్వారా ఒప్పించి,  డాక్టర్ గౌతమ్ (ఉన్ని ముకుందన్) సహాయం తో సీక్రెట్ హాస్పిటల్ (Eva care centre) నడుపుతుంటారు.

మధు, డాక్టర్ గౌతం రన్ చేస్తున్న హాస్పిటల్ నెట్వర్క్ లొకే   యశోద కూడా బిడ్డను కని ఇవ్వడానికి ఒప్పు ప్రెగ్నెంట్ అయ్యి eva సెంటర్ కి తరలించబడుతుంది. అయితే,  అ సెంటర్ లో  ఉన్న మిగిలిన ఆడవారి కస్టాలు, వారి భాద లు విని, ఇంకా కొందరు గర్బవతి తల్లులు అదృశ్యం వెనుక ఏదో కుట్ర ఉంది అని యశోదకు అర్థం అవుతుంది.

ఆ ఈవ హెల్త్ సెంటర్ లో సరోగసి పేరుతో జరుగుతున్న అకృత్యాలు ఏమిటి ?

పిల్లలు కనడానికి వచ్చిన తల్లులు మయం అవ్వడం ఏమిటి ?

అని తెలుసుకోవడానికి యశోద ఏం చేసింది ?

అసలు యశోద నిజంగా ఎవరు?,

ఎందుకు ఇదంతా చేస్తోంది?,

చివరకు సరోగసి పేరు మీద జరుగుతున్న అక్రమ వ్యాపారాన్ని ఎలా అరికట్టింది ?

ఈ నెట్వర్క్ వెనుక ఉన్న పెద్దమనుషులు ఎవరు ?

అనే ప్రశ్నలు కి జవాబులు కావాలి అనుకొంటే సినిమా చూసి తెలుసుకో వాలసిందే !.

samantha స్టిల్

కధ కధనం (SCREENPLAY) పరిశీలిస్తే:

వైవిధ్యమైన పాయింట్ తో దర్శక ద్వయం  హరి (హరి శంకర్ )– హరీష్ (హరీష్ నారాయణ) ఈ కథను రాసుకుకుని  ఆసక్తికరమైన కథనంతో సినిమాని చివరి వరకూ సస్పెన్స్ కంటిన్యూ చేస్తూ  ఇంట్రెస్టింగ్ గా మలచడము లో సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి.

అక్కడక్కడ కధనం లో వచ్చే కొన్ని సన్నివేశాలు స్లో కారణంగా ఈ సినిమా కొంత స్లో అనిపిస్తోంది కానీ వాటికి కూడా త్రిల్లింగ్ ఎలిమెంట్ యాడ్  చేయడం వలన ఆసక్తిగా కధనం సాగుతుంది.  ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లో  గా సాగాయి అనిపిస్తుంది కానీ, ఇలాంటి కధ లు చెప్పేటప్పుడు అలాంటివి ప్రేక్షకులు పట్టించుకోకుండా నెక్స్ట్ సీన్ ఏమిటి అనే క్యురీసిటీ ఉండిపోతాము.

యశోద హాస్పిటల్ సీన్స్ తో పాటు  పోలీసులు ఇన్విస్టిగేసన్  చేసే క్రమం పెరిగే కొద్ది కధనం చాలా ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉంటుంది. కానీ ఈ చిత్రంలో కొన్ని సీన్స్  చాలా తేలికపాటి ఇన్విస్టిగేషన్ తోనే కధ ను ముందుకి నడపడం తో కొన్ని చోట్ల సన్నివేశాలు అర్దం కానట్టు ఉంటాయి.

కానీ సెకండ్ హాఫ్ లో మెయిన్ ప్లాట్ ఎంటర్ అయ్యేటప్పటికి ఇంతకు  ముందు జరిగిన సన్నివేశాలు అన్నీ మర్చిపోయి కధ లో లీనం అయిపోతాము. ఓవరాల్ గా స్క్రీన్ ప్లే త్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకొనే విదంగా వ్రాయడం లో దర్శక ద్వాయం విజయం సాదించినట్టే.

SAMANTHA WITH STUNTS MASTER FOR YASODA 1

నటి నటుల నటన పరిశీలిస్తే: 

ఈ చిత్రంలో యశోద పాత్ర‌లో నటించిన సమంత తన టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ తో సినిమా ని వంటి చేత్తో నడిపిస్తూ మంచి పరిణితి చెందిన నటన తో ఆకట్టుకుంది. తన పాత్రకు తగిన వేరియేషన్స్ చూపిస్తూ చాలా బాగా నటించింది.

ఫస్ట్ హాఫ్ లో అమాయక  లో -మిడీల్ క్లాస్ నుండి హై క్లాస్  యువతిగా.. సెకండ్ హాఫ్ లో ప్రేగ్నన్సి తో ఉన్న మహిళా గా కొంత అగ్రెసీవ్ బాడీ లాంగ్వేజ్ తో , డామినేట్ చేసే యాక్షన్ తో సమంత యశోద  పాత్రకు ఫర్ఫెక్ట్ గా న్యాయం చేసింది.

పైగా చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తోనే సమంత కొన్ని భావోద్వేగ సన్నివేశాలను చాలా చక్కగా పడించింది.

ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్రలో కనిపించిన ఉన్ని ముకుందన్ తన పాత్రకు తగ్గట్లే తన లుక్స్ ను తన ఫిజిక్ ను చాలా బాగా మార్చుకున్నాడు. అలాగే మరో ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేస్తూ ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది. వర అవుట్ ఫిట్స్  స్టైల్ బాగుంది.

రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు తమ నటనతో మెప్పించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

yasoda english psoter 1 YASODA TRAILER OUT AT 5.30PM

సాంకేతిక విభాగం పనితీరు పరిశీలిస్తే:

దర్శకులు హరి – హరీష్ రాసిన ఈ చిత్ర కథ కొత్తగా ఉంది. సినిమాలోని కొన్ని సంఘటనలు సమాజంలో జరుగుతున్న కొన్ని అక్రమాలను ఎత్తి చూపాయి.

దర్శకులు ఓ మంచి స్టోరీ లైన్  తీసుకున్నారు, ఆ లైన్ కు తగ్గట్టు అంతే కొత్తగా ఫిక్షణల్  ట్రీట్మెంట్ రాసుకోని ప్రెస్ లుక్ తో సినిమా ని ప్రెసెంట్ చేశారు. మ్యూజిక్ విష‌యానికి వ‌స్తే… మణిశర్మ అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపధ్య సంగీతం (బ్యాక్ గ్రౌండ్ స్కోర్ )  చాలా బాగా ఆకట్టుకుంది.

unni and samantha

సినిమాటోగ్రఫర్ తన లైటింగ్ మూడ్ తో నీట్ గా షాట్స్ ని ప్రెసెంట్ చేశారు. అచ్చు తెలుగు లో చెప్పాలి అంటే  సినిమా కధ లోని  మూడ్ కి అనుగుణంగా దృశ్యాలని తెరకెక్కించారు.

ఎడిటింగ్ బాగున్నప్పటికీ కథకు అవసరం లేని కొన్ని షాట్స్ ట్రీమ్ చేసి ఇంకా గ్రిప్పింగ్ గా ఉంచి ఉంటే ఈ యశోద సినిమా హాలీవుడ్ సినిమా చూస్తున్నమా అన్నట్టు ఉండేది. ఇక సినిమా నిర్మాత శివలేంక కృష్ణ ప్రసాద్ గారు  పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.

ఇలాంటి మెడికల్ హై టెక్నికల్ సీన్స్ కి మాటలు అందించిన రచయితల  ద్వయం పులగం శ్రీమన్నారాయణ & డాక్టర్ భాగ్యలక్ష్మి గారిని అభినందించకుండ ఉండలేము. సింపుల్ గా శ్రావణ ఆనందంగా మాటలు ఉన్నాయి.

రాజు రాజ్యాన్ని గెలవాలి అంటే యుద్దం చెయ్యాలి. 

అదే రాజ్యానికి రాణి అవ్వాలి అంటే రాజు ని గెలిస్తే చాలు.

వంటి మాటలు బాగున్నాయి.

samantha

18 ఫ్ టీం ఒపీనియన్:

యశోద సినిమా కి   సోషల్ ఇష్యూకి సంబంధించిన  చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్  తీసుకున్నారు. అలాగే ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ సస్పెన్స్ త్రిల్లర్  డ్రామాలో గుడ్ ఎమోషన్స్, బెటర్ స్క్రిప్ట్, మరియు బెస్ట్ స్క్రీన్ ప్లే ఉన్నాయి.

సమంత నటన ఈ సినిమాకే మెయిన్ హైలైట్ గా నిలుస్తోంది. సమంత రిలీజ్ ముందు మా ఇంటర్వ్యూ లో   చెప్పినట్టుగా  ప్రాణం పెట్టి చేసింది. ఓవరాల్ గా ఆడవారు మగవారు అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవలసిన సినిమా యశోద.

చిన్న పిల్లలకు అయితే  కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

ఈ రివ్యూ నేను సినిమా చూసి ఫీల్ అయ్యి రాసినది. నాకు నచ్చిన కొన్ని సన్నివేశాలు మీకు నచ్చక పోవచ్చు. అలాంటివి ఉంటే కామెంట్స్ లో షేర్ చేయండి.

YASODA UA CENSORED 1

18F MOVIE RATING: 3.5/5

  • కృష్ణ ప్రగడ..

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *