సినిమా: అనుకోని ప్రయాణం,
విడుదల తేదీ : అక్టోబర్ 28, 2022
నటీనటులు: డా. రాజేంద్ర ప్రసాద్, నరసింహరాజు, ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేక సుధాకర్ తదితరులు
దర్శకుడు : వెంకటేష్ పెదిరెడ్ల
నిర్మాత: డా. జగన్ మోహన్ డి.వై
సంగీతం: ఎస్ శివ దినవహి
సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని
ఎడిటర్: రామ్ తుము
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అనుకోని ప్రయాణం. ఈ చిత్రం శుక్ర వారం థియేటర్ల లో విడుదల అయ్యింది.
డా. జగన్ మోహన్ డి.వై కధ ను అంధించగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నరసింహరాజు కీలక పాత్రలో నటించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.
కథ ను పరిశీలిస్తే:
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మరియు నరసింహ రాజు లు ఇద్దరు స్నేహితులు. వీరు భువనేశ్వర్ లోని ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో రోజువారీ కూలీలుగా పని చేసేవారు.
రాజేంద్ర ప్రసాద్ కి వంటరీగా స్నేహితులతో జీవించడం లో ఉన్న మజా రిలేషన్స్ పై నమ్మకం లేకుండా చేస్తుంది. తన పని ఏంటో తను చూసుకొనే వాడు.
అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణం గా వారి పని సైటులో నిలిచి పోతుంది. ఈ క్రమం లో తమ సొంతూరు కి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారు.
కరోనా లాక్ డౌన్ కారణంగా అనుకోని ప్రయాణం లో అతని స్నేహితుడు నరసింహ రాజు హాటత్ మరణం తో రాజేంద్ర ప్రసాద్ ఒక్కసారిగా షాక్ కు గురి అవుతాడు. ఎలాగైనా తన స్నేహితుడి చివరి కోరిక ప్రకారం తన శవాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటాడు.
రాజేంద్ర ప్రసాద్ ప్రారంబించిన ఈ శవ యాత్ర ప్రయాణ క్రమంలో
అతనికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి?
కరోనా వచ్చి మానవ సంభందాలను ఎలా దెబ్బ తీసింది ?
పుట్టిన ప్రాంతానికి శావుకి ఉన్న లికేంటి ?
అతనికి మానవ సంబంధాల విలువ తెలిసిందా ?
లాంటి అంశాలు తెలియాలంటే వెండితెర పై సినిమాచూడడానికి దీయటర్ ప్రయాణం సాగించాల్సిందే..!
సినిమా ప్లస్ పాయింట్స్ పరిశీలిస్తే:
అనుకోని ప్రయాణం సినిమా కధ చాలా బాగుంది. మనిషి జీవన ఆకరి గడియలు లో ఎలా ఉండాలి అనే పాయింట్ లో ఉండే ఎమోషన్స్ మీద ఈ చిత్రం ఉంది. ఆ ఎమోషన్స్ కి గల ఇంపార్టెన్స్ అనేది బాగా రాసి పెట్టుకొన్నట్టు ఉంది.
సినిమా స్టార్ట్ అయిన గంటలో కథ బాగా సెట్ అయ్యింది. ఈ చిత్రం లో ఎమోషన్స్ చూపించిన విధానం బాగుంది. మనిషి జీవితంలోని ఒడి దుడుకులను వైకుంట పాళీ ఆట లోని పాము నిచ్చెన లతో పోల్చడం చాలా ఆసక్తికరంగా ఉంది.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కధ కి నూరు శాతం న్యాయం చేశారు. తెలుగు సినీ పరిశ్రమ లో తను ఒక నట కిరీటం అని ఈ చిత్రం తో మరోసారి నిరూపించుకున్నాడు. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ నటించాడు అనే కంటే జీవించాడు అని చెప్పాలి.
మరీ కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చాలా అద్బుతంగా నటించారు. ఇలాంటి సబ్జెక్టును ఎంచుకున్నందుకు రాజేంద్ర ప్రసాద్ ను ప్రత్యేకం గా అభినందించాలి. చాలాకాలం తర్వాత అతనిలోని నటున్ని బయటికి తీసి ప్రేక్షకులకు చూపించే పాత్రను చేశారు.
రాజేంద్రప్రసాద్‌కి స్నేహితుడు గా నటించిన నరసింహరాజు గారు అయితే పాత్ర చనిపోయినా నాటిస్తూనే ఉండే మంచి పాత్ర లభించడంతో ఆయన బాగా నటించారు.
నారాయణ రావు, రవిబాబు, ధనరాజ్, తులసి వంటి వారు తమ పాత్రల ల్లో ఆకట్టుకున్నారు. సినిమాలోని కొన్ని చోట్ల ఫన్ పార్ట్ డీసెంట్‌గా, సింపుల్ గా చూపించడం జరిగింది.
పరుచూరి బ్రదర్స్ కలం నుండి వచ్చిన కొన్ని డైలాగులు చాలా డెప్త్ ను కలిగి ఉన్నాయి.
సినిమా కి మైనస్ పాయింట్స్ అనిపించేవి:
కధ వినడానికి చాలా బాగుంటుంది. కథనం, కొన్ని ఆర్టిఫీషియల్ సీన్స్ ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ అని చెప్పాలి. ఈ సినిమాలో కొన్ని హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నప్పటికీ అవి చాలా తక్కువగా కనిపిస్తాయి.
అనుకోని ప్రయాణం చాలా స్లో గా సాగినట్టు అనిపించింది. ఎడిటింగ్ పై కాస్త శ్రద్ద వహించి ఇంకా ట్రిమ్ చేసి లేదా ఫ్రెష్ సీన్స్ పెట్టి ఉండాల్సింది. కొన్ని రిపీట్ సన్నివేశాలు ఉండటం వలన మరీ బోరింగ్ గా ఉంది.
ఇంకా ఈ ప్రయాణం చిత్రం లోని బలవంతపు సన్నివేశాలు గురించి చూస్తే సెకండ్ ఆఫ్ లోని ఫైట్ సీక్వెన్స్, దాన్ని చూపించిన విధానం చాలా ఇబ్బందికరం గా ఉంటుంది.
డాక్టర్ కస్తూరి (ప్రేమ) పాత్ర చాలా ఆర్టిఫీషియల్ గా ఉంది. ఈ సీన్స్ పై డైరెక్టర్ కొంచెం వర్క్ చేసి ఉండాల్సింది. చాలా ఎమోషనల్ బాండింగ్ ఉన్న రియలిస్తిక్ కథ ని ఇలాంటి ఆర్టిఫీషియల్ సీన్స్ కారణం గా సినిమా కధనం మొత్తం స్పాయిల్ అయింది అని చెప్పాలి.
ఇంకా సినిమాలోని క్లైమాక్స్ ఆకట్టుకోనెలా లేదు. సినిమా స్టార్ట్ సీన్స్ బాగుండటం తో ఎండింగ్ కూడా బాగుంటుంది అని అంతా ఎక్స్ పెక్ట్ చేశాము, కానీ అలా జరగలేదు.
కొన్ని పాత్రలు ఇంకా బాగా నటించే అవకాశం ఉన్నా, డైరెక్టర్ అలా చేశాకుండా ఏదో సాదా సీదా సన్నివేశం తో కధా ప్రయాణం సాగించేశాడు.
రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ ల కాకుండా కంటెంట్ ఓపియంటెడ్ సినిమా ల కూడా ప్రేక్షకులను మెప్పించకపోవచ్చు.
టెక్నికల్ విభాగం పరిశీలిస్తే:
శివ దినవహి అందించిన పాటలు చిత్ర మూడ్ కి తగినట్లు గా ఉన్నాయి. మల్లికార్జున్ నరగాని సినిమాటోగ్రఫీ కొంతలో పరవాలేదు. కొండ ప్రాంత రోడ్డులు,లొకేషన్స్ ని చాలా బాగానే చూపించారు.
సినిమా నిర్మాణ పరంగా పరవాలేదు.
ఎడిటింగ్ టీమ్ గురించి చెప్పినట్లుగా, కొన్ని లాగ్ సన్నివేశాలను కత్తిరించాలి. దర్శకుడు వెంకటేష్ పెదిరెడ్ల విషయానికి వస్తే, అతను తన కథనంతో ఆకట్టుకున్నాడు. నిర్మాత జగన్ మోహన్ రాసిన బేసిక్ ప్లాట్ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంది, అయితే మరింత డ్రామాకు స్కోప్ ఉంది. కానీ, దర్శకుడు సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించడంలో సక్సెస్ కాలేకపోయాడు. రాజేంద్ర ప్రసాద్ నుండి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ను రాబట్టడం లో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అని చెప్పాలి.
18F టీం ఒపీనియన్:
అనుకోని ప్రయాణం చిత్రం కధ తో పాటుగా రాజేంద్ర ప్రసాద్ నటన, కొన్ని సన్నివేశాల లో పండించిన ఎమోషన్ చాలా బాగున్నాయి. స్లో గా సాగే కథనం, కల్పిత సన్నివేశాల వలన సినిమా ఫలితాన్ని దెబ్బతీస్తుంది.
రాజేంద్ర ప్రసాద్ సినిమా లు ఇస్తాపడే వారు ఓక సారీ చూడవచ్చు. లేదా కొన్ని రోజులు ఆగితే ఇంట్లో కుర్చీని టివి లో / ఓ టి టి లో చూసే సినిమా ఇది.
సింగల్ లైన్: అనుకోని సాహస (డీయేటర్) యాత్ర అనవసరం.
రివ్యూ బై కృష్ణా ప్రగడ.