NAG’S THE GHOST 18F MOVIES REVIEW: కింగ్ నాగార్జున ది ఘోస్ట్ సినిమా తెలుగు రివ్యూ

THE GHOST 18F TELUGU REVIEW

సినిమా: ది ఘోస్ట్ 

నటీనటులు: నాగార్జున, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనికా సురేంద్రన్, మనీష్ చౌదరి, రవివర్మ

దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు

నిర్మాతలు: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్

సంగీతం: భరత్ – సౌరభ్, మార్క్ కె రాబిన్

సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి

ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

రెలిజ్ డేట్ : 04-09-2022

THE GHOST REVIEW

కొత్త కొత్త  జోనర్ లలో, డిఫెరెంట్ చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీ లో  ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో కింగ్ నాగార్జున. వెండి తెరకు  కొత్త తరహా చిత్రాలను పరిచయం చేస్తూ, ప్రతిసారీ తన బెస్ట్ ను ఇస్తూనే ఉన్నారు నాగార్జున.

తన లేటెస్ట్  యాక్షన్ థ్రిల్లర్ ది ఘోస్ట్ కోసం స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారుతో చేతులు కలిపి కొత్త కధ ని తెరపైన ఆవిస్కరించారు.

ది ఘోస్ట్ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ది ఘోస్ట్ చిత్రం దసరా సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దామా :

KING SIZE HIT GHOST

కధ కధనం పరిశీలిస్తే : 

విక్రమ్ (నాగార్జున) ఇంటర్ పోల్ ఆఫీసర్, తన ప్రియురాలు ప్రియ (సోనాల్ చౌహాన్)తో కలిసి దుబాయ్‌ లో పనిచేస్తాడు. అతని ప్రొఫెషనల్ లైఫ్ సాఫీగా సాగుతున్న టైమ్ లో ఒక సంఘటన విక్రమ్‌ని మానసికంగా కలవరపెడుతుంది.

ఆ సంఘటన కారణం గా అతను, తన ప్రియురాలు ప్రియను విడిచి పెడతాడు. ఒక రోజు విక్రమ్ కి  అను (గుల్ పనాగ్) నుండి తన కుమార్తె అదితి మరియు ఆమె జీవితం పట్ల తనకున్న ఆందోళనను తెలియజేస్తూ, సమస్యను పరిష్కరించమని  అడగడం తో సినిమా కధ మొదలవుటయింది,

ఈ అను ఎవరు?

అను, అదితికి వచ్చిన  ముప్పు ఏంటి?

ఆమె విక్రమ్ సహాయం ఎందుకు కోరింది?

అనుకు విక్రమ్‌కి ఉన్న అనుబంధం ఏమిటి?

ఇలాంటి సమాధానాలు తెలుసుకోవాలంటే సినిమా మీ దగ్గర లోని వెండితెర మీద చూడాల్సిందే…

PRAVEEN AND TEAM VIEWS tHE GHOST 1

ది ఘోస్ట్ సినిమా ప్లస్ పాయింట్స్ చూస్తే :

వైవిధ్యమైన పాత్రలు చేయడానికి వెనుకాడని నటులల్లో కింగ్ నాగార్జున ఒకరు. ఈ విషయాన్ని తన కెరీర్‌లో చాలాసార్లు నిరూపించుకున్నాడు.

ది ఘోస్ట్‌ తో మరోసారి తన స్టామినా ఏంటో చూపించాడు. విక్రమ్‌ గా అతని నటన ఈ చిత్రం కి అతి పెద్ద ప్లస్ పాయింట్. కింగ్ నాగ్ ఈ సినిమాను స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తన అద్భుతమైన నటనతో తన భుజాలపై మోశాడు.

PRAVEEN AND TEAM VIEWS tHE GHOST 2

ది ఘోస్ట్‌ చిత్రంలో కంపోజ్ చేసిన అన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు ఇటీవలి కాలంలో అత్యుత్తమమైనవి అని చెప్పాలి. ఈ యాక్షన్ సీక్వెన్స్ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.

ది ఘోస్ట్‌ సినిమాలో అవి చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. ఈ సన్నివేశాలు చూస్తుంటే థియేటర్ల లో గూస్‌బంప్స్ వస్తాయి. అలాంటి రిస్కీ స్టంట్స్‌ని కన్విన్సింగ్‌ గా చేసినందుకు నాగార్జునను తప్పకుండా మెచ్చుకోవాలి.

ది ఘోస్ట్‌ చిత్రం అంతా కూడా అలాంటి అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంది. ఇది ప్రేక్షకులని స్క్రీన్‌ లకు అతుక్కుపోయేలా చేస్తుంది.

సోనాల్ చౌహాన్ కేవలం గ్లామర్ షో కి మాత్రమే కాకుండా చాలా చక్కని నటనని కనబరిచింది. ఆమె పాత్రకు ఈ సినిమా లో మంచి స్కోప్ ఉంది.

The Ghost poster

ది ఘోస్ట్‌ సినిమా కోసం సోనాల్ చౌహాన్ పెట్టిన ఎఫర్ట్స్ చాలా క్లియర్ గా కనిపిస్తాయి. అనికా సురేంద్రన్, గుల్ పనాగ్, రవివర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి మిగతా నటీనటులు తమ పాత్రలకి న్యాయం చేసారు.

praveen

మైనస్ పాయింట్స్ చూస్తే :

ది ఘోస్ట్‌ చిత్రం యాక్షన్ సీన్స్ తో చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ, డ్రామా మరియు కథ లో తీసులున్న పాయింట్ పాత సినిమా లలో చూసినట్టు గా ఉండుట వలన గొప్పగా త్రిల్ గా ఫీల్ అవ్వలేము.

యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కథకి ఏదో తగ్గినట్టు,  ఎమోషనల్ యాంగిల్ సినిమాలో ఆర్టిఫీషియల్ గా, కొంచెం బలవంతంగా కనిపిస్తుంది.

ఇది మనల్ని సినిమాకి పూర్తిగా కనెక్ట్ చెయ్యవు, ఈ మద్య వచ్చిన వెబ్ సిరీస్ 11 th అవర్ లో ఉన్న పాయింట్ చుట్టూనే  ది ఘోస్ట్ కధ  నాడుస్తున్నట్టు ఉంటుంది.

PRAVEEN AND TEAM VIEWS tHE GHOST 3

ది ఘోస్ట్‌లో విలన్ క్యారెక్టరైజేషన్ చాలా వీక్ గా ఉంది. ముఖ్యంగా హీరో నాగ్ తుపాకీలతో దూసుకు పోతున్నప్పుడు విలన్ పాత్ర కూడా అందుకు అనుగుణంగా ఉండాలి. కానీ, సినిమాలో అలా ఉండదు.

పెద్దగా కష్టపడకుండానే హీరో పని అయిపోతుందన్న ఫీలింగ్ మన అందరిలో కలుగుతుంది.

ఒకానొక సందర్బం లో  అంటే  చివరి గంటలో కథ ఊహించదగినదిగా ఉంటు స్క్రీన్‌ప్లే అంత ఆసక్తికరం గా ఉండదు. మధ్యలో కొన్ని సన్నివేశాలు హృదయాలకు హత్తుకునేలా ఉంటాయి. కానీ, వాటిని సినిమాలో పెట్టిన విధానం ప్రేక్షకుల మెప్పు పొందేలా ఉండవు,

THE GHOST RELEASE DAY

సాంకేతిక విభాగం పరిశీలిస్తే:

మ్యూజిక్ డైరెక్టర్ ద్వయం భరత్ – సౌరభ్ లు అందించిన పాటలు బాగున్నాయి. మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. కొన్ని యాక్షన్ బ్లాక్‌లలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్స్ ను పెంచడం మాత్రమే కాకుండా, దానికి విలువను జోడించింది.

ముఖేష్ జి సినిమాటోగ్రఫీ ఎక్స్‌ట్రార్డినరీ గా ఉంది. కొన్ని షాట్స్  హాలీవుడ్ చిత్రాల తరహాలో ఉన్నాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు అతని కెమెరా లెన్స్ నుండి వచ్చిన విజువల్స్  మరంత అందాన్ని  జోడించాయి అని చెప్పవచ్చు.

నిర్మాణ విలువలు అత్యద్భుతంగా ఉన్నాయి. సన్నివేశాలు మరింత అందంగా కనపడటానికి చాలా ఖర్చు చేశారు మేకర్స్. ముందుగా చెప్పినట్లుగా యాక్షన్ కొరియోగ్రాఫర్‌లు సినిమా కి ప్రధాన ఆస్తులు.

అడ్రినలిన్ రష్ మూమెంట్‌లను ఇవ్వడంతో పాటు అందుకు అవసరమైన డెప్త్ ను ఇచ్చారు.

Praveen Sattaru Interview 1

దర్శకుడు ప్రవీణ్ సత్తారు  ది ఘోస్ట్‌ చిత్రం ద్వారా  కొంతవరకు విజయం సాధించాడు. యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా హ్యాండిల్ చేశాడు.

 ది ఘోస్ట్‌ కధ లో మెయిన్ విలన్ లేకపోవడం నాగార్జున పాత్ర రక్షకుడు గా పాత సినిమాలను  గుర్తు చేసేలా ఉంది. అతను ఈలాంటి కధనం  విషయలలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే, సినిమా  ప్రేక్షకుల నుండి ఇంకా మంచి ఆధారణ సంపాదించి ఉండేది.

Ghost 3

I8F  ఒపీనియన్ :

ది ఘోస్ట్ సినిమా పర్వాలేదనిపించే యాక్షన్ థ్రిల్లర్, కానీ బలహీనమైన విలన్, ముందుగానే తెలిసిపోయే విధంగా కథ సాగుతూ ఉండటం వంటి అంశాలు నిరాశనే కలిగిస్తాయి.

ఇంగ్షీషు యాక్షన్ చిత్రాలను ఇష్ట పడేవారికీ  ది ఘోస్ట్  సినిమాను ఫీస్ట్ లాంటిది.

రేటింగ్ : 2.5 / 5 

రివ్యూ బై కృష్ణా ప్రగడ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *